For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా, ఎలా ఉపయోగించాలి?

|

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నవారు అదనంగా మరో క్రెడిట్ కార్డు కోసం తీసుకోవచ్చా? అంటే ప్రస్తుత క్యాష్‌‌లెస్ ట్రాన్సాక్షన్స్ కాలంలో మన అవసరాలకు అనుగుణంగా అదనపు కార్డు అవసరమో కాదో తెలుసుకొని తీసుకోవాలి. ఒక క్రెడిట్ కార్డు ఉన్నాక, మరో క్రెడిట్ కార్డు తీసుకుంటే లాభమా, నష్టమా అంటే.. క్రెడిట్ కార్డును పద్ధతి ప్రకారం ఉపయోగించి, బిల్లులు సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ డ్యూడేట్ లోపు చెల్లింపులు లేకుంటే ఒక క్రెడిట్ కార్డు ఉన్నా ప్రయోజనం లేదు. ఇది మన సిబిల్ స్కోర్ పైన ప్రభావం చూపుతుంది. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే ఆదాయానికి మించి ఖర్చు చేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి అత్యవసరం అనుకుంటే తప్ప మరో క్రెడిట్ కార్డు అవసరం లేదు. కానీ ఖర్చును నియంత్రించుకునే సామర్థ్యం ఉంటే మాత్రం ఒకటికి మించి కార్డులు ఉన్నా ఇబ్బంది లేదు. పైగా ఇది ఉపయోగకరం!

రెండో క్రెడిట్ కార్డు ఉంటే

రెండో క్రెడిట్ కార్డు ఉంటే

క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే చాలా ఉత్పత్తులపై ఆయా బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు జారీ సంస్థ వద్ద అప్పు తీసుకున్నట్లుగా భావించాలి. కార్డు ద్వారా వినియోగించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు గడువు ఉంటుంది. ఆ గడువులోగా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. రెండు క్రెడిట్ కార్డులు కలిగి ఉంటే మీ వడ్డీ లేని చెల్లింపుల కాల వ్యవధి పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లును నిర్ణీత తేదీ లోపు చెల్లించడం ద్వారా అధిక వడ్డీ రేటు నుండి ఉపశమనం పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు క్రెడిట్ కార్డు మొత్తం బిల్లు చెల్లించలేక మినిమం 5 శాతం చెల్లిస్తారు. ఇలా చేస్తే బ్యాంకు రెండు శాతం నుండి మూడు శాతం వడ్డీ విధిస్తుంది. కానీ మీరు మరో క్రెడిట్ కార్డు కలిగి ఉంటే రెండో కార్డుపై తర్వాత నెల కొనుగోళ్లు చేయడం ద్వారా అధిక వడ్డీ రేటు బారి నుండి తప్పించుకోవచ్చు.

బదలీ

బదలీ

పలు క్రెడిట్ కార్డు సంస్థలు వ్యాపార విస్తరణ కోసం మీరు చెల్లించని మొత్తాన్ని వారి కార్డులకు బదలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు మొదటి రెండు నెలలకు ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. ఆ తర్వాత నెల రోజులకు 1.5 శాతం నుండి 2 శాతం ఛార్జ్ విధిస్తున్నాయి. మొదటి కార్డుపై ఇది రెండు శాతం నుండి మూడు శాతం. చెల్లించని మొత్తాన్ని కార్డుకు బదలీ చేసుకుంటే తక్కువ వడ్డీ ఉంటుంది. అయితే ప్రతిసారి ఇలా చేయడం సరికాదు.

మరిన్ని..

మరిన్ని..

కో-బ్రాండెడ్ కార్డులు ఉంటాయి. గ్రాసరీస్, ఆన్ లైన్ షాపింగ్, ఇంధన కొనుగోలు.. ఒక్కో కార్డుపై ఇలా వివిధ ప్రయోజనాలు ఉంటాయి. మీరు ఎక్కువగా దేనిని ఉపయోగిస్తారో ఆ కో-బ్రాండెడ్ కార్డును కొనుగోలు చేయాలి.

సాంకేతిక సమస్య వల్ల మొదటి క్రెడిట్ కార్డు పని చేయకుంటే రెండో క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది.

మీ క్రెడిట్ యుటిలైజేషన్ 50 శాతం మించకుంటే క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు.

English summary

రెండో క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా, ఎలా ఉపయోగించాలి? | What is the benefit of second credit card?

Multiple credit cards collectively offer you a much higher credit limit. A typical no-frills card may offer you a limit of Rs 1 lakh.
Story first published: Wednesday, March 9, 2022, 20:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X