For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్లలో రూ.1 కోటి ఎలా వస్తుంది? లోన్ సౌకర్యం కూడా

|

సురక్షిత లాంగ్‌టర్మ్ పెట్టుబడుల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. సావరీన్ గ్యారెంటీ కలిగిన పెట్టుబడి ఇది. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ (FD) కంటే అధిక వడ్డీ రేటు కలిగి ఉంటుంది. పీపీఎఫ్ పథకాలు కామన్ మ్యాన్‌కు అనేక ప్రయోజనాలు ఉంటాయి. రూ.500 కనీస మొత్తంతో పీపీఎఫ్ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ అకౌంట్‌లో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. శాలరైడ్, చిన్న వ్యాపారులు, పెద్ద వ్యాపారులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, గిగ్ వర్కర్లు, ఫ్రీలాన్సర్లు.. ఇలా ఏ రకమైన ఉద్యోగం చేసేవారు అయినా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షిత పెట్టుబడి, మంచి రిటర్న్స్ పొందవచ్చు. పీపీఎఫ్ అకౌంట్‌లోని మొత్తం లాంగ్ టర్మ్‌లో పెద్ద మొత్తానికి చేరుకుంటుంది. ఈపీఎఫ్ లేని వారు కూడా ఇందులో ప్లాన్ చేయవచ్చు.

రూ.1 కోటి ఎలా వస్తుంది?

రూ.1 కోటి ఎలా వస్తుంది?

పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్‌లో రూ.1 కోటి వరకు కూడా పొందవచ్చును. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ప్రభుత్వం త్రైమాసికం ప్రాతిపదికన వడ్డీ రేట్లను సవరిస్తుంది. ఏడాదికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 15 ఏళ్ల కాలంలో రూ.40 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. పదిహేనేళ్ల కాలపరిమితి తర్వాత 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు.

అప్పుడు ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఇరవై ఏళ్లకు మీ చేతికి రూ.66 లక్షలు వస్తుంది. ఒకవేళ మెచ్యూరిటీ ఆ తర్వాత మరో అయిదేళ్లు పొడిగించినప్పుడు కూడా ఏడాదికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం పాతికేళ్లకు మీ చేతికి వచ్చే మొత్తం రూ.1 కోటి అవుతుంది. ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తే అంటే(పెరిగితే) మీ రిటర్న్స్ మరింత పెరుగుతాయి.

వడ్డీ రేటు

వడ్డీ రేటు

2021 డిసెంబర్ త్రైమాసికంలో పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. అయితే 2022 జనవరి-మార్చి త్రైమాసికంలో వడ్డీ రేటును సవరించడంలో భాగంగా కాస్తపెంచవచ్చునని భావిస్తున్నారు. గతంలో ఓ సమయంలో పీపీఎఫ్ వడ్డీ రేటు పన్నెండు శాతంగా కూడా ఉంది.

పీపీఎఫ్ మెచ్యూరిటీ, క్లోజింగ్, ఉపసంహరణ నిబంధనలు

పీపీఎఫ్ మెచ్యూరిటీ, క్లోజింగ్, ఉపసంహరణ నిబంధనలు

పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ పదిహేనేళ్లు ఉంటుంది. వీరు తమ అకౌంట్‌ను మెచ్యూరిటీ తర్వాత అయిదేళ్లు పొడిగించుకోవచ్చు. ప్రత్యేక కారణాలతో మాత్రమే అయిదేళ్ల తర్వాత పీపీఎఫ్ ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు. ఏడో ఏడాది నుండి పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. గరిష్టంగా బ్యాలెన్స్ మొత్తంలో 50 శాతం తీసుకోవచ్చు.

గ్యారెంటీ రిటర్న్స్, ఓపెనింగ్

గ్యారెంటీ రిటర్న్స్, ఓపెనింగ్

పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. సురక్షిత పెట్టుబడి.

పోస్టాఫీస్, ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల్లో పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.

వ్యక్తిగతంగా తన పేరు పైన ఓపెన్ చేయవచ్చు. మీ కుటుంబంలోని ఒక్కొక్కరి పేరు మీద కూడా ఒక్కో ఖాతాను ఓపెన్ చేయవచ్చు.

అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వచ్చేసరికి అందరివి కలిపి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది.

రెండు పీపీఎఫ్ ఖాతాలు ఉంటే ఒక దానిని క్లోజ్ చేసుకోవాలి.

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి.

పీపీఎఫ్ కీ ఫీచర్స్

పీపీఎఫ్ కీ ఫీచర్స్

- సావరీన్ గ్యారెంటీ

- లీగల్ ఇమ్యూనిటీ

- పెట్టుబడి, వడ్డీ, రిటర్న్స్ పైన ఎలాంటి ట్యాక్స్ ఉండదు

- లోన్ సౌకర్యం

- ఏడాదికి కనీస మొత్తం రూ.500 ఇన్వెస్ట్ చేయవచ్చు.

- ఏడాదికి రూ.1.5 లక్షలను పన్ను మినహాయింపుతో ఇన్వెస్ట్ చేయవచ్చు.

లోన్ సౌకర్యం

లోన్ సౌకర్యం

పీపీఎఫ్ అకౌంట్ డిపాజిట్ పైన రుణం కూడా తీసుకోవచ్చు. పీపీఎఫ్ పైన తీసుకునే రుణం పైన వడ్డీ రేటు ఒక శాతం. లోన్ మొత్తం తీర్చే వరకు పీపీఎఫ్ వడ్డీ ఉండదు. అయినప్పటికీ చిన్న మొత్తంలో మీకు అవసరం అయితే పీపీఎఫ్ ద్వారా రుణం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 4వ సంవత్సరం, 6వ సంవత్సరం మీరు రుణం తీసుకోవచ్చు.

English summary

ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్లలో రూ.1 కోటి ఎలా వస్తుంది? లోన్ సౌకర్యం కూడా | Want Rs 1 crore? Know how to calculate interest on Public Provident Fund amount

Public Provident Fund is a long-term investment option that comes with a sovereign guarantee. Not just generally higher than FD returns, the PPF scheme comes power-packed with several benefits for the common man.
Story first published: Thursday, December 23, 2021, 19:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X