For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

62% రిటర్న్స్ ఇచ్చే ఈ స్టాక్స్ కొనుగోలు చేయవచ్చా, కానీ చిన్న మొత్తమే!

|

కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో మార్కెట్లు వరుసగా రెండో రోజులు నష్టాల్లో ముగిశాయి. నేడు(జూలై 21 బుధవారం) మార్కెట్లకు సెలవు. వరుసగా రెండు రోజులు నష్టపోవడంతో నిఫ్టీ గరిష్టస్థాయి నుండి దాదాపు 3 శాతం పతనమైంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలని చూసే వారికి ఇది ఒక అవకాశంగా భావించవచ్చు. మళ్లీ సూచీలు పుంజుకుంటే గతంలో వలె ఎప్పటికప్పుడు కొత్త రికార్డులకు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేం. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పలు స్టాక్స్‌ను సిఫార్స్ చేస్తోంది.

ఇండియన్ బ్యాంకు టార్గెట్ ధర

ఇండియన్ బ్యాంకు టార్గెట్ ధర

ఇండియన్ బ్యాంకు టార్గెట్ ధరను ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ భారీగా పెంచింది. ఈ ప్రస్తుతం ఈ స్టాక్ రూ.137 వద్ద ఉంది. ఈ షేర్ టార్గెట్ ధరను రూ.225కు పెంచింది. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే ఇది 62 శాతం ఎక్కువ. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకారం విలీనం కారణంగా ఎక్కువ ప్రయోజనం పొందింది. ఎన్పీఏల భారం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన ఈ బ్యాంకు వృద్ధి పది శాతం నుండి పన్నెండు శాతం అంచనా ఉంది. ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యాంకు షేర్ కొనుగోలును పరిగణలోకి తీసుకోవచ్చునని సూచిస్తున్నారు.

HDFC లైఫ్

HDFC లైఫ్

ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరో స్టాక్ టార్గెట్ ధరను కూడా పెంచింది. HDFC లైఫ్ షేర్ ధర ప్రస్తుతం రూ.672 కాగా, టార్గెట్ ధరను రూ.870కి పెంచింది. అంటే రిటర్న్స్ 25 శాతం ఉంటాయి. HDFC లైఫ్ షేర్ పెరగడానికి పలు పాజిటివ్ అంశాలు ఉన్నాయని చెబుతోంది. ఈ బ్రోకరేజీ సంస్థ ప్రకారం HDFC లైఫ్ మార్కెట్ షేర్ త్రైమాసికం ప్రాతిపదికన 15.5 శాతం నుండి 17.8 శాతానికి పెరిగింది. సాల్వెన్సీ రేషియో 204 శాతంగా ఉంది. ఎమ్కే ప్రకారం నిర్దిష్ట రుణ ఉత్పత్తులపై దృష్టి పెరిగింది. క్రెడిట్ రక్షణ, యాన్యుటీ వ్యాపారాలలో వృద్ధి సాధించింది.

పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి

పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి

మార్కెట్లు మరింత క్షీణించే అవకాశాలు లేవని, పెట్టుబడిదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. పెట్టుబడిదారులు చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టడానికి చూడాలని సూచిస్తోంది. చిన్న మొత్తాల్లో పెట్టుబడి బాగుంటుందని అంటున్నారు. స్టాక్స్‌లో పెట్టుబడులు, రిటర్న్స్ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయి. దీని ఆధారంగా మాత్రమే పెట్టుబడులు సరికావు. నిపుణుల సలహాలు తీసుకొని, అన్నీ పరిశీలించి పెట్టుబడులు పెట్టాలి.

English summary

62% రిటర్న్స్ ఇచ్చే ఈ స్టాక్స్ కొనుగోలు చేయవచ్చా, కానీ చిన్న మొత్తమే! | Upto 62 percent returns with these stocks

Emkay Global Financial Services has set a very bold price target on the stock of Indian Bank and has recommended to buy the stock. The firm has set a price target of Rs 225 on the shares as against the current stock price of Rs 139, which implies an upside of almost 62% from the current price.
Story first published: Wednesday, July 21, 2021, 10:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X