For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకు రూ.100 పెట్టుబడితో... రూ.4.5 కోట్ల రాబడి!! ఎందులో ఇన్వెస్ట్ చేయాలంటే?

|

దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా ఎక్కువ డబ్బు కూడబెట్టాలనుకుంటున్నారా? ఇరవై ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి ద్వారా... పిల్లల వివాహం, చదువులు, పదవీ విరమణకు ఫండ్ సమకూర్చుకోవడం వంటివి చేసుకోవచ్చు. వివిధ రకాల ఖర్చుల కోసం ముందుచూపుతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్లాన్డ్‌గా ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా కోట్లు కూడా సంపాదించవచ్చు. మెచ్యూరిటీ తర్వాత ఎక్కువ మొత్తం వచ్చే వాటిని ఎంచుకోవడం మంచిది.

రూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడిరూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడి

15 శాతం రిటర్న్స్

15 శాతం రిటర్న్స్

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎనిమిది అంకెల్లో (కోటి రూపాయలు) సంపాదన కోరుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అత్యుత్తమ ఎంపిక అని చెబుతున్నారు. ఓ వ్యక్తి తన 30 ఏళ్ల వయస్సులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే మరో 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లలో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెబుతుంటారు. సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లలో ఓ వ్యక్తి 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు తమ పెట్టుబడిలో 15 శాతం అధిక రిటర్న్స్ పొందవచ్చు.

ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తే..

ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తే..

దీర్ఘకాలంలో పెట్టుబడి వల్ల కాంపౌండ్ బెనిఫిట్స్ లభిస్తాయని చెబుతున్నారు. ప్రతి ఏడాది పెట్టుబడిని పది శాతం పెంచుకుంటూ వెళ్తే రాబడి మరింత ఎక్కువగా ఉంటుంది.

రాబడి

రాబడి

ఎవరైనా ఓ వ్యక్తి రోజుకు రూ.100 లేదా నెలకు రూ.3,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే.. అలాగే ప్రతి ఏడాది పది శాతం పెంచుకుంటూ పోతే 30 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత రూ.4,50,66,809 వరకు పొందవచ్చు. ఈ లెక్క ప్రకారం అతను రూ.59,17,512 చేయగా రూ.3,91,49,297 రాబడి వస్తుంది.

English summary

రోజుకు రూ.100 పెట్టుబడితో... రూ.4.5 కోట్ల రాబడి!! ఎందులో ఇన్వెస్ట్ చేయాలంటే? | Turn your Rs 100 into Rs 4.5 crore

Becoming a crorepati through long-term investment is a basic need because, after 20 years or more, things like child marriage, child education and retirement funds, etc. have to be provided funds for.
Story first published: Sunday, November 17, 2019, 17:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X