For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు అదుర్స్

|

స్మార్ట్ ఇన్వెస్టర్ అయితే దీర్ఘకాలికాలంలో పెద్ద మొత్తంలో వెనుకేసుకోవడానికి ముందుగానే షార్ట్ టర్మ్‌లో అవసరమైన వాటిని టార్గెట్‌గా పెట్టుకుంటారు. షార్ట్ టర్మ్ పెట్టుబడికి మంచి వడ్డీ రేటుతో పాటు లిక్విడిటీ కూడా కీలకమే. షార్ట్ టర్మ్ పర్సనల్ ఫైనాన్షియల్ గోల్, అత్యవసర పరిస్థితుల్లో అవసరానికి అనుగుణంగా మీ డబ్బును సేవింగ్స్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. సేవింగ్స్ ఖాతా పైన మీకు రోజువారీగా వడ్డీ రేట్లు లెక్కిస్తారు. వడ్డీ రేటు మొత్తాన్ని ఏడాది ప్రాతిపదికన నెలవారీగా చెల్లిస్తారు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయనే విషయం కూడా గుర్తించాలి. సేవింగ్స్ ఖాతా పైన అత్యధిక వడ్డీ రేటును అందించే ఐదు బ్యాంకులు ఇక్కడ చూడండి.

DCB బ్యాంకు

DCB బ్యాంకు

25 ఆగస్ట్ 2021 నుండి DCB బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు (రెసిడెంట్స్, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్స్) అమల్లోకి వచ్చాయి. తాజా వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

- సేవింగ్స్ ఖాతాలో రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 2.75%,

- ఖాతాలో రూ.1 లక్ష నుండి రూ.5 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 4.00%,

- ఖాతాలో రూ.5 లక్ష నుండి రూ.10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 4.50%,

- ఖాతాలో రూ.10 లక్ష నుండి రూ.25 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 5.00%,

- ఖాతాలో రూ.25 లక్ష నుండి రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 6.00%,

- ఖాతాలో రూ.50 లక్ష నుండి రూ.1 కోటి లోపు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 6.50%,

- ఖాతాలో రూ.1 కోటి నుండి రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 6.75%,

- ఖాతాలో రూ.10 కోట్లకు పైన బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 6.55%.

RBL బ్యాంకు

RBL బ్యాంకు

సెప్టెంబర్ 1, 2021 నుండి ఆర్బీఎల్ బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ బ్యాంకు ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

- సేవింగ్స్ ఖాతాలో రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 4.25%,

- ఖాతాలో రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 5.75%,

- ఖాతాలో రూ.10 లక్ష నుండి రూ.3 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 6.00%,

- ఖాతాలో రూ.3 కోట్ల రూ.5 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు - 6.00%.

బంధన్ బ్యాంకు

బంధన్ బ్యాంకు

బంధన్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ కొత్త వడ్డీ రేటు జూన్ 7, 2021 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

- డైలీ బ్యాలెన్స్ రూ.1 లక్ష ఉంటే వడ్డీ రేటు 3 శాతం,

- డైలీ బ్యాలెన్స్ రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల మధ్య ఉంటే వడ్డీ రేటు 4 శాతం,

- డైలీ బ్యాలెన్స్ రూ.10 లక్షల నుండి రూ.10 కోట్ల మధ్య ఉంటే వడ్డీ రేటు 6 శాతం.

యస్ బ్యాంకు

యస్ బ్యాంకు

మే 13, 2021 నుండి యస్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు కింది విధంగా ఉన్నాయి.

- రూ.1 లక్ష లోపు సేవింగ్స్ అకౌంట్ డైలీ బ్యాలెన్స్ పైన 4 శాతం,

- రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల వరకు సేవింగ్స్ అకౌంట్ డైలీ బ్యాలెన్స్ పైన 4.50 శాతం,

- రూ.10 లక్షల నుండి రూ.100 లక్షల వరకు సేవింగ్స్ అకౌంట్ డైలీ బ్యాలెన్స్ పైన 5.25 శాతం.

IDFC ఫస్ట్ బ్యాంకు

IDFC ఫస్ట్ బ్యాంకు

IDFC ఫస్ట్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

- రూ.1 లక్ష లోపు సేవింగ్స్ అకౌంట్ పైన వడ్డీ రేటు 4 శాతం,

- రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల వరకు సేవింగ్స్ అకౌంట్ పైన వడ్డీ రేటు 4.50 శాతం,

- రూ.10 లక్షల నుండి రూ.2 కోట్ల సేవింగ్స్ అకౌంట్ పైన వడ్డీ రేటు 5 శాతం,

- రూ.2 కోట్ల నుండి రూ.10 కోట్ల సేవింగ్స్ అకౌంట్ పైన వడ్డీ రేటు 4 శాతం,

- రూ.10 కోట్ల నుండి రూ.100 కోట్ల సేవింగ్స్ అకౌంట్ పైన వడ్డీ రేటు 3.50 శాతం,

- రూ.100 కోట్లకు పైన సేవింగ్స్ అకౌంట్ పైన వడ్డీ రేటు 3.00 శాతం.

English summary

ఈ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు అదుర్స్ | These private sector banks giving upto 6.75 percent interest on Savings accounts

As a smart investor, you should be prepared for your short-term needs before investing for long-term wealth creation. For short-term investments, apart from good interest rates, the factor that matters the most is liquidity.
Story first published: Tuesday, September 14, 2021, 22:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X