For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 4 కంపెనీలు అదరగొట్టాయి: మూడేళ్లలో మూడింతల వరకు రిటర్న్స్

|

దేశీయ రెండో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ స్టాక్ మంగళవారం ఓ సమయంలో రూ.1757కు చేరుకోవడంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు దాటింది. ఆ తర్వాత కాస్త క్షీణించడంతో ఈ మార్కుకు సమీపంలో నిలిచింది. ఈ స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో నిన్న స్వల్ప నష్టాల్లో ముగిసింది. నేడు దాదాపు 1 శాతం లాభాల్లో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 100 బిలియన్ డాలర్ల దిగువనే ఉన్నప్పటికీ, మరో అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. ఇన్ఫోసిస్ కంటే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాప్ 100 బిలియన్ డాలర్లు దాటింది. ఈ దిగ్గజ స్టాక్స్ లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, షార్ట్ టర్మ్‌లో మంచి లాభాలు అందిస్తున్నాయి. ఈ కంపెనీలో పెట్టుబడులకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ టాప్ 4 కంపెనీలు మార్కెట్ క్యాప్, ఏడాదిలో ఎంత శాతం ఎగిసిందో తెలుసుకుందాం.

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన సంస్థ. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఎనర్జీ, పెట్రో కెమికల్స్, నేచరల్ గ్యాస్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, మాస్ మీడియా, టెక్స్ టైల్ సహా వివిధ రంగాల్లో ఉంది రిలయన్స్. ఆగస్ట్ నెలలో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.14,77,782.78 కోట్లుగా ఉంది. గతంలో ఓ సమయంలో రూ.16 లక్షల కోట్లు కూడా క్రాస్ చేసింది. ఈ దేశీయ దిగ్గజం మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే 56వ మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీ.

These four companies with market valuation of $100 billion

- రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,76,024.64 కోట్లు.
- ఎర్నింగ్ పర్ షేర్(EPS TTM) - రూ.46.41,
- ప్రైస్ టు ఎర్నింగ్స్ (P/E) రేషియో - 47.03,
- బుక్ వ్యాల్యూ పర్ షేర్ రూ.618.04,
- Price/Book (MRQ) 3.53,
- Price/Earning (TTM) 36.07,
- ROCE (%) 6.27.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియన్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ. ముంబైలో ప్రధాన కార్యాలయం ఉంది. తమిళనాడులోని చెన్నైలో మెయిన్ క్యాంపస్ ఉంది. ఫిబ్రవరి 21లో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సర్వీసెస్ సంస్థ టీసీఎస్.

గత మూడేళ్లలో టీసీఎస్ షేర్ 76.86 శాతం లాభపడింది. అదే సమయంలో నిఫ్టీ 100 కంపెనీల వృద్ధి 40.63 శాతంగా నమోదయింది. మూడేళ్ల కాలంలోనే 76.86 శాతం రిటర్న్స్ అందించాయి. నిఫ్టీ ఐటీ 122.28 శాతం లాభాలను అందించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,36,541 కోట్లుగా ఉంది.

- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,36,171.34 కోట్లు.
- ఎర్నింగ్ పర్ షేర్(EPS TTM) - రూ.89.60,
- ప్రైస్ టు ఎర్నింగ్స్ (P/E) రేషియో - 40.31,
- బుక్ వ్యాల్యూ పర్ షేర్ రూ.225.28,
- Price/Book (MRQ) 16.03,
- Price/Earning (TTM) 36.84,
- ROCE (%) - 56.24,
- ప్యాట్ మార్జిన్ - 22.77 శాతం,
- డివిడెండ్ యీల్డ్ - 1.05 శాతం.

ప్రయివేటు దిగ్గజం HDFC బ్యాంకు లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ. అసెట్స్, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఫిబ్రవరి 21 నాటికి ఈ బ్యాంకు దేశీయ అతిపెద్ద బ్యాంకు.

గత మూడేళ్లలో ఈ స్టాక్ 50.62 శాతం రిటర్న్స్ అందించింది. నిఫ్టీ 100 ఇండెక్స్ సూచీ మాతరం 40.63 శాతం రిటర్న్స్ అందించింది. గత మూడేళ్లలో ఈ కంపెనీ 50.62 శాతం రిటర్న్స్ ఇవ్వగా, నిఫ్టీ బ్యాంకు 26.19 శాతం ఇచ్చింది. HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.8,61,533 కోట్లుగా ఉంది.

- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,62,971.66 కోట్లు.
- ఎర్నింగ్ పర్ షేర్(EPS TTM) - రూ.54.14,
- ప్రైస్ టు ఎర్నింగ్స్ (P/E) రేషియో - 26.81,
- బుక్ వ్యాల్యూ పర్ షేర్ రూ.336.17,
- Price/Book (MRQ) 4.64,
- Price/Earning (TTM) 26.81,
- ROCE (%) - 14.51,
- ప్యాట్ మార్జిన్ - 25.75 శాతం,
- డివిడెండ్ యీల్డ్ - 1.05 శాతం,
- ఫేస్ వ్యాల్యూ - 0.42 శాతం.

ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ మంగళవారం ఓ సమయంలో 100 బిలియన్ డాలర్లు దాటింది. రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ తర్వాత ఈ మార్కెట్ క్యాప్ దాటిన నాలుగో కంపెనీ ఇన్ఫోసిస్.
ఇన్ఫోసిస్ గత మూడేళ్లలో 149.71 శాతం రిటర్న్స్ అందించింది. నిఫ్టీ 100 సూచీ మాత్రం 40.63 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత మూడేళ్ల కాలంలో ఈ స్టాక్ 149.71 శాతం రిటర్న్స్ ఇస్తే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 122.28 శాతం పెరిగింది. డిజిటైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ రంగం జోరుగా ఉంది. కరోనా తదనంతర వ్యాపారాలు ఐటీకి కొత్త రూపు ఇస్తాయని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్లు రాణిస్తున్నాయి.

English summary

ఈ 4 కంపెనీలు అదరగొట్టాయి: మూడేళ్లలో మూడింతల వరకు రిటర్న్స్ | These four companies with market valuation of $100 billion

On Tuesday, the shares of Infosys, a leading information technology company, hit a new high in intraday trade, putting the company's market capitalization over $100 billion. Infosys is the fourth firm in India to reach this milestone.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X