For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్ద బ్యాంకుల కంటే ఇక్కడ RD వడ్డీ రేటు ఎక్కువ: ఏ బ్యాంకులో ఎంత అంటే?

|

వివిధ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రికరింగ్ డిపాజిట్స్(RD) పైన ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆయా బ్యాంకుల షరతుల మేరకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. చాలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల రికరింగ్ డిపాజిట్స్ కాలపరిమితి కనీసం ఆరు నెలల కాలం నుండి గరిష్టంగా పదేళ్లు ఉంది. డిపాజిటర్లు కనీసం రూ.100 నుండి డిపాజిట్ ప్రారంభించవచ్చు. చాలా బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి ముందు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను అడుగుతాయి. వడ్డీ రేట్లు ఆయా బ్యాంకుల నిబంధనలు, షరతులను పరిగణలోకి తీసుకొని చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో RDలు ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఈ బ్యాంకుల్లో అధిక వడ్డీ రేటు

ఈ బ్యాంకుల్లో అధిక వడ్డీ రేటు

స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంకులు RDకి 6.25 శాతం నుండి 7.5 శాతం వ‌ర‌కు వ‌డ్డీ రేటును అందిస్తున్నాయి. RD ఒక విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ వంటిది. ఫిక్స్డ్ డిపాజిట్ ఒకేసారి పెద్ద మొత్తం డిపాజిట్ చేయాలి. RD ప్ర‌తి నెల కొంత మొత్తంలో SIP వ‌లె డిపాజిట్ చేయాలి. ఈ RD వడ్డీ రేట్లు వాటి కాలవ్యవదిపై ఆధారపడి ఉంటాయి.

ఒక సంవత్సర RD కంటే మూడేళ్ల RDకి అధిక వడ్డీ రేటు ఉండవచ్చు. బ్యాంకులతో పాటు ఇండియా పోస్ట్ కూడా చిన్న పొదుపు పథకాల కింద RDని అందిస్తోంది. ఇండియా పోస్ట్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు 5.4 శాతం నుండి 5.5 శాతం RDలకు వడ్డీని అందిస్తున్నాయి. స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంకులు ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి.

ఈ బ్యాంకుల వడ్డీ రేట్లు...

ఈ బ్యాంకుల వడ్డీ రేట్లు...

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అత్యధికంగా 6.25 శాతం నుండి 7.5 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి.

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 6.25 శఆతం వడ్డీ రేటును అందిస్తోంది. 25 నెలల నుండి 36 నెలలు, 61 నెలల నుండి 120 నెలల RD ఆఫర్ ఇస్తున్నాయి.

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.5 శాతం వడ్డీ రేటును రెండేళ్ల కాలానికి అందిస్తోంది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 24 నెలల నుండి 36 నెలల కాలపరిమితి RD పైన 7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

మరిన్ని ఇతర బ్యాంకులు...

మరిన్ని ఇతర బ్యాంకులు...

ఇతర చాలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల RD 6.5 శాతం నుండి 6.75 శాతంగా ఉంది. ఇందులో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సుర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఉద్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువగా అయిదేళ్ల లోపు RDలకు అత్యధిక వడ్డీని అందిస్తున్నాయి.

English summary

పెద్ద బ్యాంకుల కంటే ఇక్కడ RD వడ్డీ రేటు ఎక్కువ: ఏ బ్యాంకులో ఎంత అంటే? | These banks offer up to 7.5 percent interest rate on recurring deposit

Recurring deposits(RD) with these small finance banks can be attractive considering the interest rates and their terms and conditions.
Story first published: Tuesday, July 6, 2021, 15:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X