For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇళ్లు కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే అదిరిపోయే ఛాన్స్, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అంటే

|

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో వివిధ బ్యాంకులు హోమ్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, వెహికిల్ లోన్ వంటి వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. పలు బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఏడు శాతం కంటే తక్కువకు పడిపోయాయి. ఐతే కరోనా వ్యాప్తి తగ్గడం, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు త్వరలో పెంచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2022లో హోమ్ లోన్ సహా అన్ని రకాల వడ్డీ రేట్లలో కాస్త పెరుగుదల కనిపించవచ్చు. విడతలవారీగా ఈ పెరుగుదల ఉండే అవకాశం ఉంది.

అంటే హోమ్ లోన్ వడ్డీ రేటు ఇప్పుడే కనిష్టస్థాయిలో ఉందని అర్థం. హోమ్ లోన్ తీసుకోవాలని భావించేవారు ఇప్పుడే తీసుకోవడం మంచిది. ఇప్పటికే ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కీలక వడ్డీ రేట్లను పది బేసిస్ పాయింట్లు పెంచింది.

ఇప్పటికే ఎస్బీఐ పెంపు

ఇప్పటికే ఎస్బీఐ పెంపు

SBI గతవారం వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచినట్లు తెలిపింది. డిసెంబర్ 15, 2021 నుండి కొత్త వడ్డీ రేటు 7.55 శాతం వర్తిస్తోంది. హోమ్ లోన్ కొనుగోలుకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత వడ్డీ రేట్లు పెరుగుతాయని, అప్పుడు ఈఎంఐ మరింత భారం అవుతుందని చెబుతున్నారు. ఎస్బీఐ వడ్డీ రేటు 7.55 శాతానికి పెరిగినప్పటికీ, కొన్ని బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేటు ఇప్పటికీ 7 శాతం కంటే తక్కువగానే ఉంది. ఆ బ్యాంకులు కూడా చూద్దాం...

వడ్డీ రేటు 6.40 శాతమే

వడ్డీ రేటు 6.40 శాతమే

ఉదాహరణకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI) హోమ్ లోన్ వడ్డీ రేటు 6.4 శాతం నుండి ప్రారంభమవుతోంది. ఎస్బీఐ టర్మ్ లోన్ 6.65 శాతం నుండి, HDFC బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీ రేటు అతి తక్కువగా 6.40 శాతం నుండి ప్రారంభం అవుతోంది. ఈ వడ్డీ రేట్లు అన్ని కూడా శాలరైడ్‌కు.

అక్టోబర్ 1, 2019 నుండి బ్యాంకులు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ హోమ్ లోన్ వడ్డీ రేటును అమలు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకులు ఈ కింది వాటిలో ఏ ఆధారంగానైనా హోమ్ లోన్ వడ్డీ రేటును అందించవచ్చు. అందులో ఒకటి ఆర్బీఐ రెపో రేటు, రెండు ప్రభుత్వ మూడు నెలల ట్రెజరీ బిల్ యీల్డ్స్ (ఫైనాన్షియల్ బెంచ్ మార్స్ ఇండియా పబ్లిష్), మూడు ప్రభుత్వ ఆరు నెలల ట్రెజరీ బిల్ యీల్డ్స్, నాలుగు ఫైనాన్షియల్ బెంచ్ మార్క్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ పబ్లిష్ చేసిన ఇతర బెంచ్ మార్క్ మార్కెట్ వడ్డీ రేటు. వీటిలో దేనికైనా లింక్ చేయవచ్చు.

వివిధ బ్యాంకుల్లో కనిష్ట, గరిష్ట వడ్డీ రేటు

వివిధ బ్యాంకుల్లో కనిష్ట, గరిష్ట వడ్డీ రేటు

Union Bank of India - కనిష్టం 6.4% - గరిష్టం7.25%

Bank of Maharashtra - 6.4% - 7.80%

Bank of Baroda - 6.5% - 7.85%

Bank of India - 6.5% - 8.20%

Kotak Mahindra Bank - 6.55% - 7.10%

Punjab & Sind Bank - 6.6% - 7.35%

ICICI Bank - 6.7% - 7.40%

Axis Bank - 6.75% - 7.10%

IDBI Bank - 6.75% - 8.40%

SBI Term Loan - 6.75% - 7.15%

HDFC Bank - 6.75% - 7.65%

Indian Bank - 6.8% - 8.25%

Central Bank of India - 6.85% - 7.30%

Canara Bank - 6.9% - 8.90%

IDFC First Bank - 6.9% - 8.80%

Punjab National Bank - 6.95% - 7.85%

Indian Overseas Bank - 7.05% - 7.30%

SBI Max Gain - 7.1% - 7.50%

UCO Bank - కనిష్టం 7.15% - గరిష్టం 7.25%

English summary

ఇళ్లు కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే అదిరిపోయే ఛాన్స్, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అంటే | These banks are offering home loans below 7 percent interest rate

Home loan borrowers have been enjoying multi-year low interest rates for a while now. However, things might change soon as India’s largest lender, State Bank of India (SBI) increased its base rate by 10 basis points (bps) last week.
Story first published: Thursday, December 23, 2021, 12:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X