For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తే 30% వరకు రిటర్న్స్ ఇవ్వవచ్చు

|

కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) ఎంపీసీ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ఎంపీసీ సమావేశం నేపథ్యంలో మార్కెట్లు ఈ వారం అస్థిరంగా కొనసాగే అవకాశాలు కొట్టి పారేయలేం. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాన్ని అనుసరించి బ్యాంకింగ్ స్టాక్స్ కదిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజీ హౌస్‌లు ప్రభుదాస్ లీలాధర్ అండ్ ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ పలు బ్యాంకింగ్ స్టాక్స్ మున్ముందు మంచి ఫలితాలు ఇవ్వవచ్చునని అంచనా వేస్తున్నాయి. ఆ బ్యాంకింగ్ స్టాక్స్ రిటర్న్స్ ఇదివరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు పుంజుకోవచ్చునో కూడా వెల్లడించే ప్రయత్నం చేశాయి. ఈ బ్యాంక్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే 30 శాతం వరకు రిటర్న్స్ ఇవ్వవచ్చు.

కెనరా బ్యాంకుపై ఎంకే గ్లోబల్

కెనరా బ్యాంకుపై ఎంకే గ్లోబల్

కెనరా బ్యాంకు స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ సూచిస్తోంది. ప్రస్తుతం కెనరా బ్యాంకు షేర్ ధర రూ.152 వద్ద ఉంది. దాదాపు 30 శాతం వృద్ధితో టార్గెట్ ధర రూ.185కు పెంచింది. ఈ బ్రోకరేజీ ప్రకారం మోడరేట్ క్రెడిట్ గ్రోత్, ఎలివేటెడ్ ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ కెనరా బ్యాంకు నికర లభం రూ.11.7 బిలియన్లకు పెరిగింది. బలమైన మార్జిన్స్ కారణంగా నికర లాభం పెరిగింది. ప్రధానంగా యూబీ గ్రూప్ వాటా విక్రయం, హయ్యర్ పీఎస్ఎల్‌సీ ఫీజు వంటి అంశాలు కలిసి వచ్చాయి. గ్రాస్ నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ 43 బేసిస్ పాయింట్లు, త్రైమాసికం ప్రాతిపదికన 8.5 శాతం మెరుగుపడ్డాయి. విలీనం, ఆస్తుల నాణ్యత సంబంధిత ఆందోళనలు క్షీణిస్తున్నాయని, క్రమంగా రిపోర్ట్స్ క్రమంగా మెరుగు పడుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇదివరకు బ్యాంకు టార్గెట్ ధర రూ.175 కాగా, ఇప్పుడు రూ.185కు సవరించినట్లు తెలిపింది.

ICICI బ్యాంకుపై ప్రభుదాస్ లీలాధర్

ICICI బ్యాంకుపై ప్రభుదాస్ లీలాధర్

బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ ప్రయివేటు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు షేర్ ధర ప్రస్తుతం రూ..677 వద్ద ఉంది. ఈ బ్రోకరేజీ సంస్థ టార్గెట్ ధర రూ.815. ఈ బ్యాంకు నిక లాభం రూ.46.2 బిలియన్లుగా నమోదయింది. బలమైన నికర వడ్డీ ఆదాయ వృద్ధి రేటు 18 శాతం పెరగడంతో నికర లాభం పెరిగింది. బ్యాంకింగ్ పరిశ్రమలోనే బలమైన నికర వడ్డీ ఆదాయ వృద్ధి రేటు కనబరిచింది ఐసీఐసీఐ. అయితే హయ్యర్ స్లిప్పేజ్ మాత్రం రూ.72.3 బిలియన్లుగా ఉంది. ఇది వరకు టార్గెట్ ధర రూ.750 కాగా, దీనిని రూ.815కు సవరించింది.

ఇండస్ఇండ్ బ్యాంకు

ఇండస్ఇండ్ బ్యాంకు

ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్స్ కొనుగోలు చేయవచ్చునని ప్రభుదాస్ లీలాధర్ సూచిస్తోంది. ఈ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ రూ.88.6 బిలియన్లతో బలంగా ఉంది. ఏడాది ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయ వృద్ధి 8 శాతం పెరగడంతో ఇండస్ఇండ్ బ్యాంకు ఎర్నింగ్స్ రూ.9.75 బిలియన్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంకు షేర్ ధర రూ.982 వద్ద ఉంది. ఈ షేర్ టార్గెట్ ధర ఇదివరకు రూ.1195 నుండి రూ.1280కి పెంచింది. స్టాక్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. స్టాక్స్, ఫండ్స్‌లో పెట్టుబడులు లాభాలు ఇవ్వవచ్చు లేదా నష్టాలను నమోదు చేయవచ్చు. కాబట్టి పెట్టుబడిదారులు వ్యాసం ఆధారంగా కాకుండా నిపుణుల సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి.

English summary

ఈ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తే 30% వరకు రిటర్న్స్ ఇవ్వవచ్చు | These banking stocks with an upside target of up to 30 percent

Markets may have a volatile session next week, as investors will digest the RBI MPC meet. Banking stocks are expected to see movement based on the decision of the Monetary Policy Committee of the RBI.
Story first published: Monday, August 2, 2021, 9:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X