For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే రిటర్న్స్!

|

స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. సెన్సెక్స్ 52, 950 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15,885 పాయింట్ల వద్ద ముగిసింది. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్ లేదా సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ప్రయాణానికి ముందు మీ రిస్క్ పరిమితి పైన అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని రిస్క్‌ను అంచనా వేయవచ్చు.

పెట్టుబడికి ముందు ఇది చూసుకోండి

పెట్టుబడికి ముందు ఇది చూసుకోండి

పెట్టుబడికి ముందు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవడం తప్పనిసరి.

- ఫైనాన్షియల్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ గోల్స్

- టైమ్ హారిజోన్

- లిక్విడిటీ ఆందోళనలు

- కరెంట్ అండ్ ఫ్యూచర్ ఇన్‌కం ఫ్లో

- మీ వయస్సు

- నెట్ వర్త్

- ఇన్సురెన్స్ కవర్

వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటేనే మనం ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లు మరింత లాభాలు నమోదు చేయవచ్చు. తక్కువ రిస్క్‌తో పెట్టుబడికి మొగ్గు చూపాలి.

రిస్క్ ప్రయోజనాన్ని గుర్తించుకోవాలి

రిస్క్ ప్రయోజనాన్ని గుర్తించుకోవాలి

మీ పెట్టుబడిపై రిస్క్ ప్రయోజనాన్ని గుర్తించాలి. మీ వద్ద ఉన్న ఇన్వెస్టిబుల్ సర్‌ప్లస్ ద్వారా మీ రిస్క్ ప్రొఫైల్‌ను, మీ రిస్క్ ప్రొఫైల్ సామర్త్యాన్ని గుర్తించవచ్చు. తక్కువ రిస్క్, పెట్టుబడి పెట్టాలని ఆశించే వారు వీటిని గమనించవచ్చు.

లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో 50 శాతం పెట్టుబడులు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో 20 శాతం పెట్టుబడులు, డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో 10 శాతం పెట్టుబడులు, క్రెడట్ రిస్క్ ఫండ్స్‌లో 5 శాతం పెట్టుబడులను మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫండ్ హౌస్ నుండి వచ్చిన సంప్రదాయ హైబ్రిడ్ ఫండ్. ఈ ఫండ్ జూన్ 30, 2021 నాటికి రూ.3287 కోట్ల AMUతో ఉంది. ఈ ఫండ్ 2004లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు పది శాతానికి పైగా రాబడిని అందించింది. వ్యాల్యూ రీసెర్చ్, మార్నింగ్ స్టార్ ఈ ఫండ్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. ఇన్వెస్టర్లు రిటర్న్స్ కోసం, స్థిర ఆదాయ వనరుల కోసం చూస్తుంటే తమ ఇన్వెస్టబుల్ మిగులును సిప్ ద్వారా రూ.100తో ప్రారంభించవచ్చు. అలాగే, ఫండ్‌లో ఒకేసారి రూ.5000ను చెల్లించవచ్చు. మూడేళ్ల క్రితం రూ.10,000 సిప్‌తో ప్రారంభిస్తే ఇప్పుడు రూ.4.21 లక్షలు అవుతుంది. ఈ స్టాక్ హోల్డింగ్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, HDFC బ్యాంకు, అవెన్యూ సూపర్ మార్ట్స్, యాక్సిస్ బ్యాంకు, మతర్సన్ సుమి, టీవీఎస్ మోటార్స్ వంటివి ఉన్నాయి.

మిరా అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్

మిరా అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్

మిరా అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ అసెట్ రూ.26,746 కోట్లు. ప్రధానంగా లార్జ్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. హై క్వాలిటీ బిజినెస్‌లను గుర్తిస్తుంది. 2008లో వచ్చిన ఈ ఫండ్, ఇప్పటి వరకు 16 శాతం రిటర్న్స్ అందించింది. ఈ ఫండ్ టాప్ హోల్డింగ్స్‌లో ఇన్ఫోసిస్, HDFC బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్ ఉన్నాయి. రూ.1000తో సిప్ ప్రారంభించవచ్చు. మూడేళ్ల క్రితం రూ.10,000తో సిప్ ప్రారంభిస్తే ఇప్పుడు రూ.3.6 లక్షలు అవుతుంది. అయితే ఈ వ్యాల్యూ ఇప్పుడు రూ.5.02 లక్షలు.

ఎస్బీఐ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్

ఎస్బీఐ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్

ఎస్బీఐ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ 2015లో ప్రారంభం కాగా, 8.5 శాతం రిటర్న్స్ అందించింది. రూ.500తో సిప్ ప్రారంభించవచ్చు. ఈ ఫండ్ టాప్ హోల్డింగ్స్‌లో రిలయన్స్, HDFC, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, HUL ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి అత్యంత రిస్క్‌తో కూడుకున్నది. వ్యాసం ఆధారంగా పెట్టుబడి సరికాదు. నిపుణుల సలహాలు, ఫండ్ పైన పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి.

English summary

ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే రిటర్న్స్! | These are best SIPs to start in this year

Before you begin your investment journey into Mutual funds, you need to be well acquainted with your risk appetite as well, while the risk-o-meter.
Story first published: Monday, August 2, 2021, 21:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X