For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2022 నాటికి క్రిప్టో కరెన్సీపై దాడులమీద రిపోర్ట్, భద్రత.. అనేక సవాళ్లు!!

|

స్టేట్ స్పాన్సర్డ్ గ్రూప్స్ వచ్చే ఏడాదికి ప్రపంచంలోని క్రిప్టో పరిశ్రమను లక్ష్యంగా చేసుకుంటాయని, అయితే సైబర్ క్రిమినల్స్ బ్యాక్ డోర్స్‌తో కూడిన రోగ్ వ్యాలెట్ ద్వారా అడ్వాంటేజ్ పొందుతారని భావిస్తున్నారు. ఈ పేమెంట్ సిస్టమ్ పైన అటాక్స్, మరింత అడ్వాన్స్డ్ మొబైల్ థ్రెట్స్ వచ్చే ఏడాది పెరుగుతాయని సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పేర్స్కీ పేర్కొంది. 2021 సవాల్, కొత్తదనంతో కూడిన ఏడాది అని, ఈ మార్పును వేగంగా తమకు అనుకూలంగా మార్చుకొని, నిర్వహించేవారు సైబర్ నేరస్తులు అని, ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి క్రిప్టో కరెన్సీల పైన వీరి అటాక్స్ పెరుగుతాయని పేర్కొంటోంది. ఇప్పటికే పలువురు సైబర్ నేరగాళ్లు బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టోలను ఇప్పటికే లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ఈ నివేదిక వచ్చింది.

ఒక్కో దేశం ఒక్కోలా..

ఒక్కో దేశం ఒక్కోలా..

క్రిప్టో కరెన్సీని కొన్ని దేశాలు నిషేధించాయి. కొన్ని దేశాల్లో చట్టబద్దం. ఎల్ సాల్వెడార్ క్రిప్టో చట్టపర ట్రాన్సాక్షన్స్ కోసం టెక్నాలజీ సాయం అందించాలని ప్రపంచబ్యాంకును కోరింది. దీనికి ప్రపంచ బ్యాంకు నిరాకరించింది. సౌతాఫ్రికా, ఆఫ్రికన్ దేశాలు బిట్ కాయిన్ చట్టపర హోదాపై చర్చిస్తున్నాయి.

తాజాగా కేంద్ర ప్రభుత్వం క్రిప్టో బిల్లును తీసుకు వస్తున్న నేపథ్యంలో డిజిటల్ కరెన్సీపై జోరుగా చర్చ సాగుతోంది. క్రిప్టోపై దేశాలు కలిసి పని చేయాలని, అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడాలని, దీనిపై అంతర్జాతీయ చట్టం అవసరమని నరేంద్ర మోడీ ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ది సిడ్నీ డైలాగ్ సదస్సులో అన్నారు.

క్రిప్టో ఇబ్బందులు

క్రిప్టో ఇబ్బందులు

క్రిప్టో కరెన్సీకి ఎలాంటి రెగ్యులేటర్ లేదు. అంతర్జాతీయ చట్టాలు లేదా నిబంధనలు లేవు. దీంతో క్రిప్టో ట్రాన్సాక్షన్స్ ప్రత్యేక సర్వర్లలో ఉన్నప్పటికీ వాటి భద్రతకు ఎలాంటి హామీ ఉండదని చెప్పవచ్చు. పూర్తి డిజిటల్ కరెన్సీ కాబట్టి సమస్యలు వస్తే ఇన్వెస్టర్లు నష్టపోవచ్చు. క్రిప్టోలో పెట్టుబడి పెట్టి, నష్టపోయి తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటవల ఆత్మహత్య చేసుకున్నాడు. ధర ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం.టెస్లా కార్లకు చెల్లింపులకు బిట్ కాయిన్‌ను తీసుకోలేమని ఎలాన్ మస్క్ చెప్పడంతో ఈ డిజిటల్ భారీగా పడిపోయింది.

కొంతమంది హ్యాకర్లు గతంలో బ్లాక్ చైన్ సైటులోని లోపాలను కనిపెట్టి ఎథేర్ వంటి కొన్ని వేల డిజిటల్ కాయిన్స్‌ను దొంగిలించారు. వీటి వ్యాల్యూ వేల కోట్లలో ఉంది. మోసాలు జరిగాయి.. జరుగుతున్నాయి. బిట్ కాయిన్‌‍ను సృష్టించేందుకు భారీగా విద్యుత్ అవసరం. అందుకే కొద్ది రోజుల క్రితం చైనా షిన్‌జియాంగ్‌లో విద్యుత్ కొరత ఏర్పడింది. అప్పుడు కూడా బిట్ కాయిన్ పడిపోయింది.

నియంత్రణ... పర్యావరణం

నియంత్రణ... పర్యావరణం

అయితే క్రిప్టో నియంత్రణ అంత సులువు కాదని అంటున్నారు. ప్రభుత్వాల వద్ద ఇలాటి వ్యవస్థలు అందుబాటులో లేకపోవడంతో కొన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. క్రిప్టోను మనీ లాండరింగ్, స్మగ్లింగ్, తీవ్రవాద కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నరనే ఆందోళనలు ఉన్నాయి. క్రిప్టో కరెన్సీలో అధిక మార్కెట్ వాటా కలిగిన బిట్ కాయిన్, ఎథేరియం మైనింగ్ ప్రక్రియతో నడిచేవి. ఒక వ్యక్తి మరో వ్యక్తికి బిట్ కాయిన్ ట్రాన్సుఫర్ చేస్తే ఆ బిట్ కాయిన్ ద్వారా కొన్ని బ్లాక్స్ ఏర్పడతాయి.

ఈ బ్లాక్స్‌ను కొన్ని మ్యాథమెటికల్ హాషెస్ ద్వారా మైనర్లు సాల్వ్ చేస్తారు. అప్పుడు కొత్త బిట్ కాయిన్ జనరేట్ అవుతుంది. ఇందుకు కంప్యూటర్లు, అధిక సామర్థ్యంతో కూడిన ప్రాసెసర్లు, సర్వర్లు అవసరం. ఈ కంప్యూటర్ల సగటు జీవిత కాలం 1.3 సంవత్సరాలు.అంటే ఈవేస్ట్ జనరేట్ అవుతుంది. పర్యావరణానికి ఇది అననుకూలం.

English summary

Targetted cryptocurrency attacks by cybercriminals to grow in next year

State-sponsored groups will target the world’s cryptocurrency industry next year, while cybercriminals will take advantage of investors by fabricating rogue wallet with backdoors included.
Story first published: Monday, November 29, 2021, 10:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X