Women's Day: మహిళలకు అదిరిపోయే హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ
నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ వుమెన్ సెంట్రిక్ మెడికల్ ఇన్సురెన్స్ పాలసీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. స్టార్ వుమెన్ కేర్ ఇన్సురెన్స్ పాలసీని లాంచ్ చేసింది. మహిళల కోసం ప్రవేశపెట్టిన సమగ్ర హెల్త్ కవర్. మహిళల జీవిత కాలంలో ప్రతి దశలో ఎదురయ్యే ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీని ప్రత్యేకంగా రూపొందించింది స్టార్ హెల్త్.

18 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు
స్టార్ హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ ప్రకారం ఈ స్టార్ వుమెన్ కేర్ ఇన్సురెన్స్ పాలసీ ఇండివిడ్యువల్ పాలసీ, ఫ్లోటర్ పాలసీగా అందుబాటులో ఉంటుంది. 18 ఏళ్ల వయస్సు నుండి 75 ఏళ్ల వయస్సు గల మహిళలు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీని పొందడానికి మహిళలా ఎలాంటి ప్రీమెడికల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్లు త్రైమాసిక లేదా అర్ధవార్షిక వాయిదాలలో చెల్లించగల ప్రీమియమ్స్ ద్వారా పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, మూడు సంవత్సరాలు తీసుకోవచ్చు.

తల్లికి.. బిడ్డకు
రెగ్యులర్ హాస్పిటలైజేషన్‌తో పాటు రీప్రొడక్షన్ చికిత్స, డెలివరీ (ప్రసవానికి ముందు, తర్వాత కవర్), మల్టిపుల్ మెడిసిన్ కన్సల్టేషన్స్, ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్స్, వాలంటరీ స్టెరిలైజేషన్, అలాగే పిల్లల ఆసుపత్రిలో చేరడం వంటివి కవర్ అవుతాయి. ఈ పాలసీ ద్వారా తల్లులు, అలాగే పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్య రక్షణ పొందవచ్చు. పాలసీ ప్రకారం నవజాత శిశువు 1వ రోజు నుండి పాలసీ కవరేజీ మొత్తంలో 25 శాతం వరకు బీమా వర్తిస్తుంది. తర్వాత ఏడాది నుండి 100 శాతం బీమా వర్తిస్తుంది. పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు ఆసుపత్రి ఐసీయులో చేరాల్సి వస్తే తల్లికి, అదే ఆసుపత్రిలో ఉండేందుకు గది అద్దెను ఇస్తారు.

మహిళల అవసరాలకు అనుగుణంగా
స్టార్ హెల్త్ ఇన్సురెన్స్‌లో మహిళలకు ఉన్నతస్థాయి భద్రత, మద్దతు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, స్టార్ వుమెన్ కేర్ ఇన్సురెన్స్ పాలసీ అనేది స్వతంత్ర, సమగ్ర పాలసీ అని, ఇది మహిళలు తమ సొంత ఆరోగ్య బీమా అవసరాలను చూసుకోవడానికి వీలు కల్పిస్తుందని, వారి ప్రతి దశలోను మహిళల అవసరాలను తీర్చడానికి వీలు కల్పిస్తుందని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సురెన్స్ ఎండీ ఆనంద్ రాయ్ అన్నారు. తమ ఈ పాలసీ పెరిగిన వైద్య ఖర్చుల చింతను తీరుస్తుందన్నారు.

స్టార్ వుమెన్ కేర్ బీమా పాలసీ ఫీచర్స్
రూ.1 కోటి హామీ మొత్తంతో పాలసీ తీసుకోవచ్చు. కస్టమర్లు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.25 లక్షలు, రూ.50 లక్షల హామీతో కూడిన పాలసీని తీసుకోవచ్చు. పర్సనల్ పాలసీ 18 ఏళ్ల నుండి 75 సంవత్సరాల మధ్య తీసుకోవచ్చు. ఫ్యామిలీ ప్లోటర్ పాలసీ తీసుకుంటే కుటుంబంలో ఒక్క మహిళ ఉన్నా, జీవిత భాగస్వామి, పిల్లలకు వర్తిస్తుంది. క్యాన్సర్ నిర్ధారణ అయితే హామీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. మొదటి రోజు నుండి ఔట్ పేషెంట్ వైద్య ఖర్చులు కవర్ అవుతాయి. స్టార్ హెల్త్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు వర్తిస్తుంది.