For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు ఆఫర్: రూ.50వేలు పొందాలంటే రూ.1.18 లక్షలు ఖర్చు.. LTC స్కీం ప్రయోజనకరమేనా?

|

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు, కన్స్యూమర్ డిమాండ్ పుంజుకునేందుకు వివిధ చర్యలు తీసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిమాండ్‌కు ఊతమిచ్చే ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. దీంతో పాటు ప్రభుత్వ మూలధన వ్యయాలను పెంచడం ద్వారా వ్యవస్థలో రూ.1 లక్ష కోట్ల కన్స్యూమర్ డిమాండ్‌ను క్రియేట్ చేయాలని భావిస్తోంది. లీవ్ ట్రావెల్ కన్సెషన్(LTC) క్యాష్ వోచర్ స్కీం, స్పెషల్ ఫెస్టివ్ అడ్వాన్స్ స్కీంలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఇదీ ఎల్టీసీ

ఇదీ ఎల్టీసీ

ఈ రెండింటి ద్వారా రూ.36వేల కోట్ల కన్స్యూమర్ డిమాండ్‌ను క్రియేట్ అవుతుందని నిర్మల తెలిపారు. ఎల్టీసీ ట్యాక్స్ బెనిఫిట్స్ ద్వారా రూ.28వేల కోట్లను ప్రయివేటు సెక్టార్ ఖర్చు చేస్తుందని, ఈ చర్యల వల్ల రూ.1 లక్ష కోట్ల కన్స్యూమర్ డిమాండ్ క్రియేట్ అవుతుందని అంచనా వేశారు ఆర్థికమంత్రి. ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీంను ఎంచుకున్న ప్రభుత్వ ఉద్యోగులు 10 రోజుల లీవ్స్‌ను రీయింబర్సుమెంట్‌గా పొదుతారు. పేస్కేల్‌ను బట్టి విమాన, రైల్వే ఛార్జీలపై రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. కరోనా నేపథ్యంలో వారు దీనిని ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం స్కీంకు ఇది ఉపయోగపడుతుంది.

ఈ పథకాన్ని ఎంచుకుంటే

ఈ పథకాన్ని ఎంచుకుంటే

ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన స్కీం ప్రకారం ఈ పథకాన్ని ఎంచుకున్న ఉద్యోగులు తమ ట్రావెల్ చార్జీకి మూడు రెట్ల అమౌంట్‌ను, లీవ్స్‌ను క్యాష్‌గా మార్చుకున్నాక, ఆ మొత్తాన్ని ఖర్చు చేయాలి. ఈ ఖర్చును కూడా 2021 మార్చి లోపు పూర్తి చేయాలి. 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ జీఎస్టీ ఉన్న ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. చెల్లింపులకు డిజిటల్ పేమెంట్స్‌నే ఉపయోగించాలి. రీయింబర్సుమెంట్స్ కోసం జీఎస్టీ ఇన్వాయిస్‌ను సబ్‌మిట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ స్కీంను ఎంచుకుంటే రూ.5675 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. కేవలం బ్యాంకులు, ప్రభుత్వ కంపెనీల ఉద్యోగులకే రూ.1900 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. 50 శాతం రాష్ట్రాలు ఈ స్కీంను ఎంచుకుంటే ఎకానమీలోకి రూ.9వేల కోట్లు వస్తాయి. తద్వారా ప్రయివేటు సెక్టార్‌లో ఖర్చులు పెరిగితే వ్యవస్థలోకి రూ.28వేల కోట్ల కన్స్యూమర్ డిమాండ్ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు.

ఈ స్కీంతో ప్రయోజనం.. మూడురెట్ల ఓచర్..

ఈ స్కీంతో ప్రయోజనం.. మూడురెట్ల ఓచర్..

ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రెండు ఆఫర్లు ఇచ్చింది. ఒకటి ఉద్యోగులకు వడ్డీలేని రుణం రూ.10వేలు ఇవ్వడం. రెండోది సెలవులపై వెళ్లనప్పటికీ ఎల్టీసీ చెల్లింపులు ఇవ్వడం. అయితే ఇందుకు సంబంధించిన ఖర్చులు చూపించాలి. ఈ ప్రయోజనం మార్చి 31లోపు పొందాలి. మధ్యతరగతి కుటుంబానికి పదివేల వడ్డీలేని రుణం ప్రయోజనకరం. దీనిని ప్రీపెయిడ్ రూపే కార్డు రూపంలో అందిస్తారు.

ఇక రెండో ఆఫర్ ఎల్టీసీ. ఉద్యోగి వేతన స్ట్రక్చర్‌ను బట్టి ఎవరు అర్హులు, ఎంత వరకు అర్హులో.. ఆ మేరకు క్యాష్ ఓచర్ ఇస్తారు.

ఎల్టీసీ అర్హత లేదా ఛార్జీల మొత్తానికి మూడు రెట్లు సమానంగా ఉంటుంది.

అంటే ఎంత మొత్తానికి ఓచర్ లభిస్తే దానికి మూడు రెట్లు ఖర్చుచేసినట్లు రసీదులు చూపించాలి. దీనిపై పన్ను మినహాయింపు ఉంటుంది.

మూడు రెట్లు..

మూడు రెట్లు..

ఈ స్కీం వల్ల ఉద్యోగికి ప్రయోజం ఉందా అనే చర్చ సాగుతోంది. రూ.50వేల పొందేందుకు అంతకుమూడు రెట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి రూ.36,000 వోచర్‌కు అర్హులు. ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటే మొత్తం రూ.1,44,000 అవుతుంది. అంటే దీనికి మూడు రెట్లు ఖర్చు చేయాలి. ఈ లెక్కన రూ.4,32,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి జీఎస్టీ పడుతుంది. అంటే వోచర్ పొందేందుకు అందుకు మూడు రెట్లు కచ్చితంగా ఖర్చు చేయాలి.

మరో ఉదాహరణ తీసుకుంటే ఒక ఉద్యోగి రూ.50వేల వోచర్‌కు అర్హులు అనుకుంటే రూ.1.50 లక్షలు ఖర్చు చేయాలి. 12 శాతం జీఎస్టీ చొప్పున రూ.18,000 అవుతుంది. అంటే రూ.50వేలు పొందేందుకు తన చేతుల మీదుగా రూ.1 లక్షతో పాటు అదనంగా జీఎస్టీ రూ.18వేలు చెల్లించాలి. అంటే రూ.1.18 లక్షల భారం.

English summary

ఉద్యోగులకు ఆఫర్: రూ.50వేలు పొందాలంటే రూ.1.18 లక్షలు ఖర్చు.. LTC స్కీం ప్రయోజనకరమేనా? | Spend Rs 1,18,000 to get Rs 50,000! Should you opt for the LTC cash voucher scheme?

Union Finance Minister Nirmala Sitharaman's latest round of stimulus announcements aimed at boosting consumption may fail to achieve desired results.
Story first published: Tuesday, October 13, 2020, 20:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X