For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్, సరికొత్త సేఫ్టీ ఫీచర్.. టిప్స్

|

తమ కస్టమర్ల భద్రత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు ఏటీఎం సెంటర్‌కు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం లేదా మినీ స్టేట్‌మెంట్ తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ మీకు ఓ ఎస్సెమ్మెస్‌ను పంపిస్తుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పెరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఎస్బీఐ ఈ కొత్త ఫీచర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ ఫ్రాడ్స్ పట్ల కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ హెచ్చరించింది. బ్యాలెన్స్ ఎంక్వయిరీ, మినీ స్టేట్‌మెంట్‌కు సంబంధించి ఎస్సెమ్మెస్ హెచ్చరికలను విస్మరించవద్దని సూచించింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఈ ఎస్సెమ్మెస్ వస్తుంది.

ఎన్పీఏలుగా వద్దు.. లోన్ మారటోరియంపై తాత్కాలిక ఊరట: వడ్డీ భారం తప్పదు!ఎన్పీఏలుగా వద్దు.. లోన్ మారటోరియంపై తాత్కాలిక ఊరట: వడ్డీ భారం తప్పదు!

వెంటనే ఏటీఎం కార్డును బ్లాక్ చేసుకోవచ్చు..

వెంటనే ఏటీఎం కార్డును బ్లాక్ చేసుకోవచ్చు..

ఏటీఎమ్ నుండి బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ తీసుకున్న ప్రతిసారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓ సందేశం పంపించడం ద్వారా ఖాతాదారులను అలర్ట్ చేయడం ద్వారా కస్టమర్ ఖాతాలు సురక్షితంగా ఉంటాయి. ఈ మెసేజ్ అలర్ట్ కారణంగా ఒకవేళ అనధికార ట్రాన్సాక్షన్స్ జరిగితే కనుక సదరు ఖాతాదారుడు వెంటనే స్పందించి తన ఏటీఎమ్ కార్డును బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఎస్బీఐ ట్వీట్ చేసింది.

మీ తెలివితో...

మీ తెలివితో...

ఇప్పుడు ఏటీఎం ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా మినీ స్టేట్‌మెంట్ కోసం ఒక అభ్యర్థనను స్వీకరించినప్పుడు, మేము(ఎస్బీఐ) మా కస్టమర్లను ఒక ఎస్సెమ్మెస్ పంపించి అలర్ట్ చేస్తామని, ఆ ట్రాన్సాక్షన్ వారిది కాకపోతే వారు వెంటనే వారి డెబిట్ కార్డును బ్లాక్ చేయవచ్చునని ట్వీట్‌లో పేర్కొంది. కస్టమర్ల భద్రతా వ్యవస్థలో కొంత లొసుగుల కోసం వెతుకుతున్న మోసగాళ్ళను గుర్తించడానికి మీ తెలివిని ఉపయోగించండని, కొన్ని భద్రతా చిట్కాలు ఉన్నాయి తెలిపింది.

ఇలా చేయండి..

ఇలా చేయండి..

ఫ్రాడ్‌స్టర్స్‌కు ఇలా కొత్త కొత్త పద్ధతుల్లో చీట్ చేస్తారని చెబుతూ వీడియోను రూపొందించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దీనిని ఉపయోగించుకొని చీట్ చేయవచ్చునని తెలిపింది. తాము ప్రభుత్వం లేదా చారిటీ ట్రస్ట్స్ లేదా రిలీఫ్ ఫండ్‌కు చెందిన వారమని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తారని, కరోనా ట్రీట్మెంట్‌కు రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని కోరుతారని, సైబర్ నేరగాళ్లు ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఈమెయిల్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా నమ్మించే ప్రయత్నాలు చేస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇలా వచ్చినప్పుడు సైబర్ నేరగాళ్లను, అసలైన వారిని గుర్తించడం ఇబ్బందికరంగా మారుతుందని, అయినప్పటికీ మీ వ్యక్తిగత విషయాలు తెలియని వ్యక్తులకు అసలు షేర్ చేయవద్దని సూచించింది. మీ పాస్‍‌వర్డ్ ఎప్పటికప్పుడు మార్చుకోవడం మంచిదని తెలిపింది. ఫోన్ లేదా మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చే వారితో మీ బ్యాంకు డిటైల్స్ షేర్ చేయవద్దని సూచించింది. అలాంటి అనుమానిత లింక్స్ పైన క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. ఎస్బీఐకి సంబంధించిన సమాచారం కోసం ఎప్పుడు అధికారిక వెబ్ సైట్‌ను చూడాలని, సైబర్ నేరగాళ్లను గుర్తిస్తే దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచీలో అధికారులకు తెలియజేయాలని సూచించింది.

English summary

కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్, సరికొత్త సేఫ్టీ ఫీచర్.. టిప్స్ | SBI introduces new facility for ATM users, Check out details

State Bank of India has launched a new feature for ATM users' safety amid rising incidents of ATM frauds. SBI will send customers an SMS when receives a request for balance enquiry or mini statement via ATMs.
Story first published: Friday, September 4, 2020, 16:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X