For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా, SBI మీకో గుడ్‌న్యూస్: వడ్డీ రేట్ల పెంపు

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రెండేళ్లుగా పైగా కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన చెల్లించే వార్షిక వడ్డీ రేటు 0.10 శాతం నుండి 0.15 శాతం మేర పెంచింది. ఈ నెల 15వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. దీంతో రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్ పైన 5.10 శాతం నుండి 5.20 శాతానికి పెరిగింది. మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.30 శాతం నుండి 5.45 శాతానికి పెరిగింది. అయిదేళ్ల కాలపరిమితి నుండి పదేళ్ల కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.40 శాతం నుండి 5.50 శాతానికి చేరుకుంది.

రూ.2 కోట్ల వరకు...

రూ.2 కోట్ల వరకు...

రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటులో ఎలాంటి మార్పులేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఉంది. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ పైన ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంటుంది. వీరికి గతంలోని 5.5 శాతంతో పోలిస్తే పది బేసిస్ పాయింట్లు పెరిగి 5.6 శాతానికి పెంచారు.

HDFC ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు

HDFC ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు

రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ పైన HDFC వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్ల నుండి 10 బేసిస్ పాయింట్లు పెంచింది. పెంచిన తాజా వడ్డీ రేట్లు ఫిబ్రవరి 14, 2022 నుండి అమల్లోకి వస్తుంది. బ్యాంకు ఏడాది కాలపరిమితి FD వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచి 4.9 శాతం నుండి 5 శాతానికి పెంచింది. మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 5 బేసిస్ పాయింట్లు పెంచి 5.40 శాతం నుండి 5.45 శాతానికి పెంచింది.

ఈ బ్యాంకులు ముందే

ఈ బ్యాంకులు ముందే

ఇతర బ్యాంకుల విషయానికి వస్తే యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకుల కంటే ముందే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ పైన వడ్డీ రేట్లను పెంచింది. ఈ రెండు బ్యాంకుల కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి.

English summary

ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా, SBI మీకో గుడ్‌న్యూస్: వడ్డీ రేట్ల పెంపు | SBI hikes interest rates of long term FDs: Latest interest rates compared

Joining a list of banks that have raised the interest rates on FD, India's largest bank State Bank of India (SBI) has also hiked rates on FDs for tenures above 2 years.
Story first published: Thursday, February 17, 2022, 15:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X