For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీఎం నగదు ఉపసంహరణ, చెక్కు బుక్ రూల్స్ మార్పు: వచ్చే నెల నుండి SBI కొత్త నిబంధనలు

|

దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఏటీఎం, నగదు ఉపసంహరణ నియమ నిబంధనలను మార్చేందుకు సిద్ధమైంది. ఈ కొత్త నిబంధనలు జూలై నుండి అమల్లోకి వస్తాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎస్బీఐ కస్టమర్లకు పలు సూచనలు చేసిందని తెలుస్తోంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD) అకౌంట్లకు కొత్త ఛార్జీల అమలుతో పాటు ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలు, చెక్కు బుక్కులు, ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్‌కు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.

<strong>బంగారాన్ని తీసుకోవడం లేదు, బ్యాంకులకు మరింత భారమే: వారు వేలం వేస్తున్నారు..</strong>బంగారాన్ని తీసుకోవడం లేదు, బ్యాంకులకు మరింత భారమే: వారు వేలం వేస్తున్నారు..

కేవైసీ సమాచారం..

కేవైసీ సమాచారం..

అద‌న‌పు ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ లేకుండా జీరో బ్యాలెన్స్‌పై ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. కోట్లాది మందికి బ్యాంకు అకౌంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. సంబంధిత వ్య‌క్తి KYC వివ‌రాల స‌మాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవ‌కాశముంది. ఈ అకౌంట్‌తో పాటు ఏటీఎం కార్డ్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు.

చెక్కులపై నిర్దిష్ట మొత్తం

చెక్కులపై నిర్దిష్ట మొత్తం

BSBD అకౌంట్ హోల్డ‌ర్లు ప్రతి నెలా ఏటీఎంలు, బ్యాంక్ శాఖలతో సహా నాలుగుసార్లు ఉచితంగా న‌గ‌దును ఉపసంహరించుకోవచ్చు. ఉచిత ఉపసంహరణ పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్‌కు బ్యాంకు రూ.15ను విధిస్తంది. దీనికి జీఎస్టీ అదనం. అయితే ఈ BSBD అకౌంట్ హోల్డ‌ర్లకు ఆర్థిక సంవత్సరంలో పది చెక్కు బుక్స్‌ను బ్యాంకు అందిస్తుంది. ఆ తర్వాత నుండి అందించే చెక్కుల‌పై నిర్ధిష్ట మొత్తాన్ని వసూలు చేస్తుంది.

చెక్కు బుక్కులపై..

చెక్కు బుక్కులపై..

పది చెక్కు బుక్కులకు బ్యాంకు రూ.40తో పాటు జీఎస్టీ వసూలు చేస్తుంది. 25 చెక్కుబుక్కులకు బ్యాంకు రూ.75తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. పది ఎమర్జన్సీ చెక్కుబక్కులకు రూ.50తో పాటు జీఎస్టీ వసూలు చేస్తుంది. సీనియర్ సిటిజన్లకు చెక్కుబుక్కులకు సంబంధించి కొత్త సర్వీస్ ఛార్జీల నుండి మినహాయింపు ఉంటుంది. అకౌంట్ హోల్డర్ హోం బ్రాంచీ లేదా ఇతర బ్రాంచీలలో ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్ పైన ఎలాంటి ఛార్జీలు విధించారు. నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది.

English summary

ఏటీఎం నగదు ఉపసంహరణ, చెక్కు బుక్ రూల్స్ మార్పు: వచ్చే నెల నుండి SBI కొత్త నిబంధనలు | SBI ATM cash withdrawal, cheque book rules, charges to change from next month

State Bank of India (SBI), the top lender of India, is all set to change the rules and charges for cash withdrawals from its ATMs and bank branches. The new rule will come into effect from next month, the lender said earlier.
Story first published: Wednesday, June 9, 2021, 8:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X