For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సగం సగం...: నెలకు రూ.2,000తో చేతికి రూ.50 లక్షలు!

|

సెంట్రల్ అటానమస్ సహా 2004 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ నేషనల్ పెన్షన్ స్కీం (NPS) వర్తిస్తుంది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కు మాత్రం మినహాయింపు ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్పీఎస్ స్కీంను అడాప్ట్ చేసుకున్నాయి. తమ రాష్ట్రాల ఉద్యోగాలకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగితో పాటు గవర్నమెంట్ కూడా అంతే మొత్తం ఎన్పీఎస్‌కు కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఒక ఉద్యోగి నెలకు రూ.2000 ఎన్పీఎస్‌కు కాంట్రిబ్యూట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా రూ.2000 ఇస్తుంది. ఇలా ఆర్థిక ప్రణాళికతో వెళ్తే రిటైర్మెంట్ సమయానికి మీ చేతికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది.

మీ SBI అకౌంట్‌ను మరో బ్రాంచీకి మార్చుకోవడం ఎంతో సులభం?మీ SBI అకౌంట్‌ను మరో బ్రాంచీకి మార్చుకోవడం ఎంతో సులభం?

నెలకు రూ.2,000 జమ చేస్తే రూ.50 లక్షలు

నెలకు రూ.2,000 జమ చేస్తే రూ.50 లక్షలు

ఎన్ఎస్డీఎల్ ఈ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అసిస్టెండ్ వైస్ ప్రెసిడెంట్ మందార్ కార్లేకర్ ప్రకారం.. ఒక ఉద్యోగి తన 30 ఏళ్ల వయస్సులో నెలకు రూ.2000 చొప్పున కాంట్రిబ్యూట్ చేస్తే ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో కలిపి రూ.4,000 జమ అవుతుంది. 8 శాతం రాబడిని పరిగణలోకి తీసుకుంటే కనుక ఉంటే రిటైర్మెంట్ సమయానికి అంటే 30 ఏళ్లలో కార్పస్ అమౌంట్ రూ.50 లక్షలకు పైన అవుతుంది. ఈ మొత్తంలో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేస్తే నెలకు రూ.26,000 పెన్షన్ పొందవచ్చు. NPS ఏడాదికి 10 నుంచి 12 శాతం రాబడిని అందిస్తోందని చెప్పారు.

ఫండ్ మేనేజర్లు

ఫండ్ మేనేజర్లు

ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు కేంద్రం SBI పెన్షన్ ఫండ్స్ ప్రయివేటు లిమిటెడ్, UTI రిటైర్మెంట్ సొల్యూషన్స్, LIC పెన్షన్ ఫండ్ స్కీమ్ వంటి పెన్షన్ స్కీమ్ మేనేజర్స్ (PFMs)ను నియమించినట్లు చెప్పారు. ముందుగా నిర్ణయించిన రేషియో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ఉంటుంది. స్థిర ఆదాయ సెక్యూరిటీలు 85 శాతంగా ఉండాలని PFMs ఆదేశాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ సెక్యూరిటీస్, కార్పోరేట్ బాండ్లు వంటివి ఉన్నాయి. గరిష్టంగా 15 శాతం ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత పెట్టుబడులు పెట్టుకోవచ్చు.

అవసరమైతే ఉపసంహరణ

అవసరమైతే ఉపసంహరణ

రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తుది పెన్షన్ ఎన్పీఎస్ కార్పస్ పరిమాణం, పదవీ విరమణ సమయంలో ఎంచుకున్న ప్లాన్ మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. పెన్షన్ ప్రాసెస్ చాలా ఈజీ. అవసరమైన సమయంలో ఎన్పీఎస్ సబ్‌స్క్రైబర్ ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణ ఫారాన్ని ఆఫీస్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రాసెస్ ప్రారంభమవుతుంది.

English summary

సగం సగం...: నెలకు రూ.2,000తో చేతికి రూ.50 లక్షలు! | Rs 50 lakh retirement corpus with just Rs 2000/month for central government employees!

NPS for Central Government Employees: All employees joining services of Central Government, including Central Autonomous Bodies (except Armed Forces) on or after 2004, are covered by NPS for their pension needs.
Story first published: Monday, October 28, 2019, 15:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X