For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న వ్యాపారులకు రిలయన్స్ జియో బంపరాఫర్

|

స్మాల్ స్కేల్, మీడియం వ్యాపారుల(MSMB) కోసం రిలయన్స్ జియో ఇటీవల సరికొత్త టారిఫ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. బ్రాడ్ బాండ్, వాయిస్ కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్, ఇతర డిజిటల్ సొల్యూషన్స్‌తో ఈ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తోన్న ఇతర టెలికం సంస్థల ప్లాన్స్‌తో పోలిస్తే తమ ప్లాన్ ధరలు పదో వంతు మాత్రమేనని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు.

కేంద్రప్రభుత్వం గుడ్‌న్యూస్! పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు ఛాన్స్!!కేంద్రప్రభుత్వం గుడ్‌న్యూస్! పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు ఛాన్స్!!

భారీ సంస్థలకు ధీటుగా

భారీ సంస్థలకు ధీటుగా

మొత్తం ఏడు రకాల ప్లాన్స్‌ను జియో పరిచయం చేసింది. భాగస్వాములతో కలిసి జియో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఈ సులువైన డిజిటల్ సొల్యూషన్స్‌ను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఐదు కోట్ల MSMBలకు ఈ ప్లాన్స్ చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ప్రపంచం డిజిటలైజేషన్ వైపు పరుగులు పెడుతోన్న నేపథ్యంలో భారీ సంస్థలకు ధీటుగా చిన్న వ్యాపారులు నిలదొక్కుకునేందుకు ఈ ప్లాన్స్ దోహదం చేస్తాయని జియో తెలిపింది.

వారి ఖర్చులో పదోవంతు

వారి ఖర్చులో పదోవంతు

సెకనుకు 100Mbps అప్ లోడ్, డౌన్ లోడ్ సామర్థ్యంతో అన్‌లిమిటెడ్ వినియోగ అవకాశం గల ప్లాన్ రూ.901కి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం MSMBలు కనెక్టివిటీ, ప్రోడక్టివిటీ, ఆటోమేషన్ పరికరాల పైన నెలకు రూ.15,000 నుండి రూ.20,000 వరకు ఖర్చు చేస్తున్నాయని, వారికి మార్కెట్ ధర కంటే పదిశాతం తక్కువకు సేవలు అందుబాటులోకి తెస్తున్నామని జియో తెలిపింది.

ప్లాన్స్ ఇవీ...

ప్లాన్స్ ఇవీ...

ప్రారంభ ధర నెలకు రూ.901. ఇందులో అపరిమిత బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ ఉంటుంది. దేశంలో ఎక్కడికైనా కాల్స్ చేసుకునేందుకు ఓ ఫోన్ కనెక్షన్ ఇస్తారు. ప్లాన్ గరిష్ట ధర రూ.10,001. సెకన్‌కు 1 గిగా బైట్ స్పీడ్‌తో బ్రాడ్ బాండ్, 8 లైన్ల వాయిస్ కాల్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్, జియోమీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఇతర డివైజెస్ కోసం 25 లైసెన్స్ ఉంటాయి. రూ.901, రూ.10,0001 ప్లాన్‌‌లతో పాటు రూ.1,201, రూ.2,001, రూ.3,001, రూ.5,001, రూ.7,001 ప్లాన్స్ ఉన్నాయి.

English summary

చిన్న వ్యాపారులకు రిలయన్స్ జియో బంపరాఫర్ | Reliance Jio introduces new fiber broadband plans for small, medium businesses

JioBusiness has introduced an integrated offering for micro, small and medium businesses. The company claims it will provide 1. Enterprise-Grade Fiber Connectivity that offers voice and data services 2. Digital Solutions that help enterprises manage and grow their business 3. Devices that enable leading digital solutions for MSMBs.
Story first published: Thursday, March 11, 2021, 16:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X