For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో స్టేషన్ డెవలప్‌మెంట్ ఫీజు: రైల్వే టిక్కెట్ ఛార్జీ రూ.50 వరకు పెరగొచ్చు!

|

విమానాశ్రయాలకు భారతీయులతో పాటు విదేశీయులు వచ్చివెళ్తారు. విమానాశ్రయలు మన స్టేటస్‌కు సింబల్స్. వీటిలో వసతి సౌకర్యాలు ఉండటంతో పాటు అత్యాధునికత అవసరం. ఇందుకోసమే విమానాశ్రయాలు ఎయిర్ పోర్ట్ డెవలప్‌మెంట్ ఛార్జీలను లేదా యూజర్ ఛార్జీలను వసూలు చేస్తాయి. ఎయిర్ పోర్ట్స్ ప్యాటర్న్ ఇప్పుడు ఇండియన్ రైల్వేలకు వర్చించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రీడెవలప్డ్ రైల్వే స్టేషన్ ట్రావెలింగ్‌కు మీరు మరింత ఎక్కువ మొత్తం చెల్లించవలసి రావొచ్చు.

రైల్వే స్టేషన్ల రీ-డెవలప్‌మెంట్ కోసం స్టేషన్ డెవలప్‌మెంట్ ఫీజు లేదాయూజర్ ఫీజును వసూలు చేయాలని ఇటీవల జరిగిన రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ ఫీజు రూ.10 నుండి రూ.50 వరకు ఉండవచ్చు.

ముందే సమాచారం

ముందే సమాచారం

రీ-డెవలప్డ్ స్టేషన్స్ లేదా భవిష్యత్తులో పునరుద్ధరించబడే ఇలాంటి పునరాభివృద్ధి కోసం స్టేషన్లలో రైళ్ల డీ-బోర్డింగ్‌కు ఇలాంటి ఛార్జీలు విధించడం ఆసక్తికర అంశం. నోటిఫికేషన్ ప్రకారం ప్రయాణీకులు రైలు ఎక్కిన స్టేషన్‌తో పాటు దిగిన స్టేషన్‌లోను ఈ ఛార్జీలు వసూలు చేస్తారు.

ఈ మేరకు రైల్వే స్టేషన్ డెవలప్‌మెంట్ ఫీజును ఖరారు చేసేందుకు రైల్వే బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం స్టేషన్ డెవలప్‌మెంట్ యూనిట్లుగా రైల్వే జోనల్ కార్యాలయాలు ఉంటాయి. ఈ ఫీజును వసూలు చేయడానికి 120 రోజుల ముందు ఆయా స్టేషన్ల పరిధిలో ప్రయాణీకులకు తెలియజేయాలని ఆయా స్టేషన్ల కమర్షియల్ యూనిట్లకు జోన్లు సమాచారాన్ని ఇచ్చాయి.

ప్లాట్ ఫామ్ ధర

ప్లాట్ ఫామ్ ధర

ఈ స్టేషన్లలో డెవలప్‌మెంట్ ఫీజుతో పాటు రీ-డెవలప్‌మెంట్ చేసిన స్టేషన్‌లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలు కూడా రూ.10 పెరిగుతాయి. రైల్వే స్టేషన్లు రీ-డెవలప్‌చేసే ప్రయివేటు సంస్థలకు ఆదాయమార్గంగా ఈ స్టేషన్ డెవలప్‌మెంట్ ఫేర్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ గత ఏడాది ఆమోదించింది.

స్టేషన్ డెవలప్‌మెంట్ ఫేర్‌ అమలులోకి వస్తే రైల్వే స్టేషన్ల రీ-డెవలప్‌మెంట్, మౌలిక వసతుల కల్పనకు బిడ్స్ దాఖలు చేయడానికి ప్రయివేటు సంస్థలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని రైల్వే శాఖ చెబుతోంది. ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టులు చేపడితే రైల్వేలకు స్టేషన్ డెవలప్‌మెంట్ ఫేర్‌ అదనపు ఆదాయం అవుతుంది.

ఇతర స్టేషన్లకు విస్తరణ

ఇతర స్టేషన్లకు విస్తరణ

స్టేషన్ డెవలప్‌మెంట్ ఫేర్ వసూలు చేస్తే రైలు టిక్కెట్ ధరలు పెరుగుతాయి. నిర్ణయం ప్రకారం మీరు రెండు రీ-డెవలప్‌మెంట్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తే రెండింటికి చెల్లించాలి. లేదా మీరు ప్రయాణం ప్రారంభించే లేదా గమ్యస్థానం... ఏదో ఒకటి రీ-డెవలప్ అయితే ఒకదానికి చెల్లించాలి. మొదట 50 రైల్వే స్టేషన్లలో దీనిని అమలు చేస్తారు. క్రమంగా ఇతర స్టేషన్లకు విస్తరిస్తారు. విమాన ప్రయాణీకులకు టిక్కెట్ ధరతో పాటు ఎయిర్ పోర్ట్ డెవలప్‌మెంట్ ఫీజు వసూలు చేస్తారు. రైల్వే స్టేషన్ డెవలప్‌మెంట్ ఫేర్‌ కూడా టిక్కెట్‌తో కలిపి తీసుకుంటారు.

English summary

త్వరలో స్టేషన్ డెవలప్‌మెంట్ ఫీజు: రైల్వే టిక్కెట్ ఛార్జీ రూ.50 వరకు పెరగొచ్చు! | Railways to charge passengers Rs 10-50 extra for redeveloped stations

Rail fares likely to go up as Railway Board approves station development fees in range of Rs 10 - Rs 50.
Story first published: Sunday, January 9, 2022, 13:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X