ఇండియన్ రైల్వే ప్రయాణీకులు రివార్డ్ పాయింట్స్ ద్వారా ఉచితంగా లేదా తక్కువ ధరకే ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు! మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిచ్చే లక్ష్యంతో కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు-ఐఆర్‌సీటీసీ ఎస్బీఐ రూపే కార్డును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్, నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కొద్ది నెలల క్రితం ప్రారంభించింది.
కొత్త ఐఆర్‌సీటీసీ ఎస్బీఐ రూపే కార్డు మరింత సౌకర్యవంతంగా, వేగంగా, సురక్షితం. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కలిగి ఉంది. IRCTC SBI రూపే కార్డు ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్ కొన్ని తెలుసుకోండి....

ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్
31 మార్చి 2021 వరకు ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదు.
IRCTC వెబ్ పోర్టల్ ద్వారా రైల్వే టిక్కెట్స్ బుక్ చేసుకుంటే 10 శాతం వరకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. (ఒక రివార్డు పాయింట్ = ఒక రూపాయి)
యూజర్లు రివార్డ్ పాయింట్స్ ద్వారా ఉచితంగా టిక్కెట్లను రిడీమ్ చేసుకోవచ్చు. తమకు లేదా కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు వినియోగించవచ్చు.
మొదటి 45 రోజుల్లో రూ.500 ట్రాన్సాక్షన్ పైన యుజర్లు 350 బోనస్ రివార్డ్ పాయింట్స్ పొందుతారు.
IRCTC వెబ్ సైట్ ద్వారా రైలు టిక్కెట్లుబుక్ చేస్తే 1 శాతం ట్రాన్సాక్షన్ ఛార్జీ రద్దు ఉంటుంది.
కాంప్లిమెంటరీ ప్రీమియం రైల్వే లాంజ్ యాక్సెస్‌ను అందిస్తుంది. (క్వార్టర్‌కు ఒక విజిట్)
అన్ని పెట్రోల్ బంకుల్లో 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జీ మాఫీ ఉంటుంది.
కాంటాక్ట్‌లెస్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (NCMC) ఫీచర్ ఉంది. మెట్రో, టోల్, ప్లాట్‌ఫాం టిక్కెట్ కోసం ట్యాప్ అండ్ గో పేమెంట్స్ కోసం వాలెట్ ఫీచర్స్. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.

షాపింగ్ ప్రయోజనాలు
IRCTC SBI రూపే కార్డ్ ఆన్‌లైన్ దుకాణదారులకు వివిధ ప్రయోజనాలు అందిస్తోంది. వినియోగదారులు మెడ్ లైఫ్, ఫిటెర్నిటీ, మీ ఎన్ మామ్స్ మొదలైన వాటిపై డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఈ కార్డు వినియోగదారులకు పాథాలజీపై 40 శాతం తగ్గింపు, 1ఎంజీ నుండి మెడిసిన్స్ కొనుగోలుపై 18 శాతం తగ్గింపు, అప్‌గ్రేడ్ కోర్సు పైన 10 శాతం ఫీజు రద్దు, దిమ్యాన్ కంపెనీలో షాపింగ్ పైన రూ.250 తగ్గింపు, అపోలో ఫార్మసీ, మమెర్త్ ఫార్మసీలో 10 శాతం చొప్పున డిస్కౌంట్ ఉంది.

ప్రయాణాలు ఇప్పుడిప్పుడే..
కరోనా మహమ్మారి కారణంగా ఇటీవలి వరకు ప్రయాణాలు నిలిచిపోయాయి. ఇప్పటికి అవసరమైతే తప్ప ప్రయాణాలు దాదాపు తగ్గిపోయాయి. రైలు ప్రయాణం చేసేవారు చాలామంది IRCTC ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. ఐఆర్‌సీటీసీ ఎస్బీఐ రూపే కార్డును ఉపయోగించి వినియోగదారులు నిబంధనల మేరకు ఉచితంగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. రివార్డు పాయింట్స్ ద్వారా ఇది సాధ్యమవుతుంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications