For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fixed Deposit: ప్రత్యేక డిపాజిట స్కీమ్.. తక్కువ కాలంలో మంచి రాబడి..

|

Fixed Deposit: భారతీయ బ్యాంకుల్లో డిపాజిట్లకు ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆదాయం ఎంత వస్తుంది అనే దాని కంటే ఉన్న డబ్బు ఎంత సేఫ్ అనేదానికే చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఇలాంటి డిపాజిటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంటాయి. పైగా ఇటీవల వడ్డీ రేట్లు పెరగటంతో చాలా మంది మదుపరులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మనసుపడుతున్నారు.

 ప్రత్యేక స్కీమ్..

ప్రత్యేక స్కీమ్..

మూలధన సమీకరణలో భాగంగా బ్యాంకులు ఎక్కువగా డిపాజిట్లను ప్రోత్సహిస్తుంటాయి. ఆ డబ్బును అవి తమ వ్యాపార కార్యకలాపాలను వృద్ధి చేసుకునేందుకు వినియోగిస్తుంటాయి. ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటువంటి కస్టమర్ల కోసం తాజాగా 600 రోజుల స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టాయి.

డిపాజిట్ మెుత్తం..

డిపాజిట్ మెుత్తం..

ఈ స్కీమ్ లో 60 ఏళ్లు పైబడిన సీనియర్లు, సూపర్ సీనియర్లు సైతం తమ డబ్బును దాచుకోవచ్చు. రెండు కోట్ల వరకు సింగిల్ టర్మ్ డిపాజిట్ చేసేందుకు వెసులుబాటును బ్యాంక్ కల్పించింది. అయితే ఇది కాలబుల్, నాన్ కాలబుల్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఖాతాదారులు PNB ONE యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, స్వయంగా బ్యాంకు వెల్లటం ద్వారా ఇందులో తమ డబ్బును పొదుపు చేసుకోవచ్చు.

కాలబుల్ పెట్టుబడి..

కాలబుల్ పెట్టుబడి..

దీనికింద డిపాజిట్ చేసిన సొమ్ముకు 7 శాతం రెగ్యులర్ వడ్డీ రేటు లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు 7.50%, 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.80% వడ్డీ రేటును బ్యాంక్ చెల్లిస్తోంది.

నాన్-కాలబుల్..

నాన్-కాలబుల్..

ఈ ఆప్షన్ కింద సాధారణంగా 7.05% వడ్డీని డిపాజిట్లపై బ్యాంక్ అందిస్తోంది. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు 7.55%, 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85% వడ్డీ రేటును బ్యాంక్ చెల్లిస్తోంది. సాధారడ డిపాజిట్లపై బ్యాంక్ రూ.2 కోట్ల కంటే తక్కువ పెట్టుబడులకు 4.30% నుంచి గరిష్ఠంగా 6.90% వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. అక్టోబర్ 2022లో చివరిసారిగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.

English summary

Fixed Deposit: ప్రత్యేక డిపాజిట స్కీమ్.. తక్కువ కాలంలో మంచి రాబడి.. | Punjab national bank offering special rate to 600 days bank deposits

Punjab national bank offering special rate to 600 days bank deposits
Story first published: Saturday, November 12, 2022, 20:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X