For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19 treatment: రూ.5 లక్షల వరకు బ్యాంకు రుణం, ఎవరు అర్హులంటే?

|

కరోనా మహమ్మారి కారణంగా కొంతమందికి లక్షలు ఖర్చవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు కరోనా ట్రీట్మెంట్ కోసం పర్సనల్ లోన్‌ను రూ.5 లక్షల వరకు ఇస్తున్నాయి. బ్యాంకులు కాస్త తక్కువ వడ్డీ రేటుకు అందిస్తున్నప్పటికీ మీకు క్యాష్-ప్లో సమస్య ఉంటేనే తప్పనిసరి పరిస్థితుల్లో లోన్ తీసుకోవడం మంచిది. లోన్ తీసుకోవడం ఎప్పుడు కూడా రెండో ఆప్షన్‌గా ఎంచుకోవాలి. ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు వంటివి వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి.

ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త, హౌసింగ్ ప్రైసింగ్ ఇండెక్స్ ప్రారంభంఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త, హౌసింగ్ ప్రైసింగ్ ఇండెక్స్ ప్రారంభం

8.5 శాతం వడ్డీ రేటు

8.5 శాతం వడ్డీ రేటు

కోవిడ్ 19 చికిత్స కోసం వ్య‌క్తుల‌కు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలిస్తున్నాయి. అంతే కాదు హెల్త్‌కేర్ మౌలిక వ‌సతుల కల్ప‌న కోసం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేశాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆదివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) చైర్మ‌న్ దినేష్ ఖ‌ారా, ఇండియ‌న్ బ్యాంక్స్ అసోసియేష‌న్ చైర్మ‌న్ రాజ్ కిర‌ణ్ రాయ్ ప్రారంభించారు. ఈ అన్-సెక్యూర్డ్ రుణాల‌పై 8.5 శాతం వ‌డ్డీరేటు వ‌సూలు చేస్తున్నట్లు దినేశ్ ఖ‌రా చెప్పారు.

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

SBI 8.5 శాతం వడ్డీ రేటుతో కనీస రుణం రూ.25,000 ఇస్తుంది. గరిష్ట కాల పరిమితి అయిదేళ్లు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ప్రకారం వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. గరిష్ట కాలపరిమితి 5 సంవత్సరాలు అందిస్తోంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.కెనరా బ్యాంకు కూడా సురక్ష పర్సనల్ లోన్‌ను అందిస్తోంది. కనిష్ట రుణం రూ.25,000, గరిష్ట రుణ పరిమితి రూ.1,00,000. కెనరా బ్యాంకు రుణంపై ఓ వెసులుబాటు ఉంది. ఆరు నెలల పాటు మారటోరియం ఉంది.

నగదు సమస్య ఉంటేనే..

నగదు సమస్య ఉంటేనే..

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఏడాది కోవిడ్ 19 పర్సనల్ లోన్స్‌ను ప్రారంభించాయి. ఈ రుణాలు ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు కూడా అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7.2 శాతం కూడా ఉంది. మీరు తాత్కాలికంగా నగదు సమస్యను ఎదుర్కొంటే మాత్రమే రుణాలు తీసుకోవడం మంచిది.

ఎవరు అర్హులు?

ఎవరు అర్హులు?

గత 12 నెలలుగా ఆయా బ్యాంకుల నుండి వేతన రూపంలో లేదా పెన్షన్ వస్తున్నవారు ఈ రుణానికి అర్హులు.

హోమ్ లోన్ లేదా వెహికిల్ లోన్ లేదా మోర్టగేజ్ లోన్ లేదా పర్సనల్ లోన్ లేదా క్యాష్ లోన్ వంటి రిటైల్ లోన్ తీసుకొని ఉండాలి.

నాన్-శాలరైడ్ ఇండివిడ్యువల్స్ అయితే బ్యాంకులో సేవింగ్స్ ఖాతా లేదా కరెంట్ ఖాతా ఉండి, ఆదాయ పన్ను రిటర్న్స్ రెగ్యులర్‌గా ఫైల్ చేసేవారు.

English summary

COVID 19 treatment: రూ.5 లక్షల వరకు బ్యాంకు రుణం, ఎవరు అర్హులంటే? | PSU banks offering personal loans up to Rs 5 lakh for covid 19 treatment

Public sector banks are offering personal loans up to Rs 5 lakh that individuals can use for the COVID-19 treatment of self or family members.
Story first published: Wednesday, June 2, 2021, 16:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X