For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gram Sumangal: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ప్రత్యేకం: ప్రయోజనాలు ఎన్నో..డబ్బు రెట్టింపు

|

న్యూఢిల్లీ: పోస్టాఫీస్ ప్రజల జీవితంలో ఓ భాగం. ఇప్పుడది ఇదివరకట్లా కాదు. ఎన్నో మార్పులను సొంతం చేసుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికతను సంతరించుకుంటోంది. పాస్‌పోర్టుల దరఖాస్తుల స్వీకరణ మొదలుకుని ఆధార్ కార్డ్ కరెక్షన్ సహా కేంద్రం అమలు చేస్తోన్న పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేంద్రంగా మారుతోంది. మద్యతరగతి ప్రజల ఆర్థిక వనరులను మరింత బలోపేతం చేయడంలో ప్రధాన వనరుగా మారింది పోస్టాఫీస్. లక్షలాది మందికి జీవిత బీమా భరోసా ఇస్తోంది. మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తోంది.

గ్రామ్ సుమంగళ్ స్కీమ్ ఇదీ

గ్రామ్ సుమంగళ్ స్కీమ్ ఇదీ

ఇందులో భాగంగా తపాలా శాఖ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. 1995లో పోస్టాఫీసు శాఖ గ్రామీణ ప్రజలకు బీమా అందించడానికి గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI)ని ప్రారంభించింది. ఇందులోనూ గ్రామ సుమంగళ్ పథకం మరింత ప్రయోజనకారిగా ఉంటోంది. గ్రామ సుమంగళ్ పాలసీ కాల పరిమితి కనిష్ఠంగా 15 సంవత్సరాలు.. గరిష్ఠంగా 20 సంవత్సరాల వరకు ఉంటుంది. 40 సంవత్సరాల వరకు వయస్సున్న వారు గ్రామ సుమంగళ్ పథకంలో డబ్బులు కట్టొచ్చు. 40 ఏళ్ల వయస్సులో ఈ పాలసీలో చేరితే గరిష్ట పరిమితి 20 ఏళ్లు.. 45 ఏళ్ల వయస్సులో తీసుకుంటే.. పాలసీ గరిష్ట పరిమితి 15 ఏళ్లుగా నిర్ధారించారు.

15, 20 ఏళ్ల కాలపరిమితితో

15, 20 ఏళ్ల కాలపరిమితితో

15 ఏళ్ల కాల పరిమితి ఉండే పాలసీని తీసుకుంటే.. 6, 9, 12 సంవత్సరాలు పూర్తయిన అనంతరం 20-20 శాతంతో ఆర్థిక భరోసా లభిస్తుంది. మెచ్యూరిటీపై 40 శాతం మేర డబ్బు బోనస్‌గా లభిస్తుంది. అదే- పాలసీ కాల పరిమితి 20 సంవత్సరాలు ఉంటే 8, 12, 16 సంవత్సరాల్లో 20-20 శాతం డబ్బు తిరిగి పొందవచ్చు. మెచ్యూరిటీపై 40 శాతం మనీబ్యాక్‌ ఉంటుంది. ఈ పథకంలో డిపాజిట్ చేసిన ప్రతి 1000 రూపాయలకు 48 రూపాయలు బోనస్‌గా అందుతుంది. పాలసీదారుడికి 25 ఏళ్లు ఉంటే.. నెలవారీ ప్రీమియం 2,853 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.

ప్రయోజనాలివీ..

ప్రయోజనాలివీ..

అదే వయస్సున్న పాలసీదారుడు ప్రతి మూడు నెలలకు ప్రీమియం మొత్తాన్ని కట్టాలనుకుంటే 8,449 రూపాయలు, ఆరు నెలలకు 16,715లను చెల్లించాలి. వార్షిక ప్రీమియం మొత్తం 32,735గా నిర్ధారించారు. పాలసీ తీసుకున్న 8,12,16 ఏళ్లల్లో మీకు 1.4-1.4 లక్షల రూపాయల చొప్పున మనీ బ్యాక్ లభిస్తుంది. 20వ సంవత్సరంలో 2,08,000 లక్షల రూపాయలు లభిస్తాయి. ప్రతి వెయ్యి రూపాయలకు 48 రూపాయల బోనస్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఏడు లక్షల మొత్తానికి వార్షిక బోనస్ 33,600లు దక్కుతుంది. 20 ఏళ్లలో ఇది 6.72 లక్షలకు చేరుతుంది. 20 ఏళ్లల్లో ఈ మొత్తం 13.72 లక్షల రూపాయలు లభిస్తాయి.

English summary

Gram Sumangal: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ప్రత్యేకం: ప్రయోజనాలు ఎన్నో..డబ్బు రెట్టింపు | Post Office Scheme: Invest Rs 95 and earn Rs 14 lakh

The Post Office's Gram Sumangal Rural Postal Life Insurance Scheme is an endowment scheme that provides money back as well as insurance cover to people living in the rural areas. There are two types of plans under this scheme.
Story first published: Saturday, April 10, 2021, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X