For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలకు రూ.8,334 ఇన్వెస్ట్ చేస్తే, అయిదేళ్లకు చేతికి రూ.7 లక్షలు

|

పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్ అయిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో ప్రతి నెల రూ.8,334 ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్ల మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి రూ.7 లక్షలు వస్తాయి. బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్ మొదలు వివిధ డిపాజిట్ లేదా లోన్ పథకాల్లో సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక వడ్డీ రేటు ఉంటుంది. సాధారణ వడ్డీ రేటుతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ పైన బ్యాంకుల్లో వడ్డీ రేటు తక్కువగా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో సురక్షిత, గ్యారెంటీ రిటర్న్స్ కోరుకునే వారు పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్‌కు పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్ అందుబాటులో ఉంటాయి. మిడిల్ క్లాస్ సిటిజన్స్ కూడా సురక్షిత, గ్యారెంటీ రిటర్న్స్ కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు.

పోస్టాఫీస్ స్కీమ్

పోస్టాఫీస్ స్కీమ్

రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయాన్ని పొందడానికి పోస్టాఫీస్ స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. ఈ స్కీంలో చేరే వారి వయస్సు అరవై లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఈ స్కీంలో చేరి ప్రతి నెల రూ.8334 ఇన్వెస్ట్ చేస్తే, అయిదేళ్ల తర్వాత రూ.7 లక్షలు అవుతుంది. నెలకు రూ.8334 చొప్పున ఏడాదికి చెల్లించే మొత్తం రూ.1 లక్ష అవుతుంది.

అయిదేళ్లలో చేసే డిపాజిట్ మొత్తం రూ.5 లక్షలు అవుతుంది. వడ్డీ రేటుతో కలిపి దాదాపు రూ.7 లక్షలు వస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఈ లెక్కన రూ.5 లక్షలకు వచ్చే వడ్డీ మొత్తం రూ.1.85 లక్షలు అవుతుంది. అంటే మన చేతికి రూ.6,85,000 వస్తుంది. త్రైమాసికం ప్రాతిపదికన వడ్డీ రేటును లెక్కిస్తారు. అంటే ప్రతి మూడు నెలలకు రూ.9250 వడ్డీ వస్తుంది. పీపీఎఫ్ అకౌంట్ వడ్డీ రేటుతో సమానంగా ఉంది.

వడ్డీ రేటు

వడ్డీ రేటు

ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఈ స్కీం కింద మెచ్యూరిటీ పీరియడ్ అయిదేళ్లు. అవసరమనుకుంటే ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు. మరింత ప్రయోజనం పొందేందుకు ఒకసారి దీనిని మూడేళ్లకు పొడిగించుకోవచ్చు.

ఎవరు ఎంత వయస్సులో

ఎవరు ఎంత వయస్సులో

అరవై ఏళ్లు, ఆ పైన వయస్కులు పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీంను ఓపెన్ చేయవచ్చు. అయితే కొన్ని కండిషన్స్‌తో కొంతమందికి మినహాయింపు ఉంది. సివిలియన్ ఎంప్లాయీస్ 55 ఏళ్లు దాటితే ఈ స్కీంలో చేరవచ్చు. డిఫెన్స్ ఉద్యోగులు అయితే 50 ఏళ్లు దాటిన తర్వాత చేరవచ్చు.

English summary

నెలకు రూ.8,334 ఇన్వెస్ట్ చేస్తే, అయిదేళ్లకు చేతికి రూ.7 లక్షలు | Post Office Savings Scheme: Deposit Rs 8,334 Monthly to Get Rs 7 Lakh At Maturity

There shall be only one deposit in the account in multiple of INR.1000/- maximum not exceeding INR 15 lakh.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X