For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? పోస్టాఫీసులో ఈ స్కీమ్.. చూశారా?

|

డబ్బంటే ఎవరికి చేదు? ఎంత సంపాదించినా.. ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. కొంతమంది డబ్బును అక్కడ ఇక్కడ పొదుపు చేసి దానికి పిల్లలు పెట్టిస్తూ ఉంటారు. ఒకప్పుడు బ్యాంకుల్లో రికరింగ్, ఫిక్స్‌డ్.. ఇలా వివిధ రకాల ఖాతాలు తెరిచి వాటిలో పొదుపు చేస్తూ.. వాటి మెచ్యూరిటీ తీరగానే మళ్లీ మరో పథకంలో పొదుపు చేస్తూ.. కొద్ది మొత్తాన్నే కాలక్రమేణా పెద్ద మొత్తంగా చేసేవారు.

ఇప్పుడు బ్యాంకులో డబ్బు దాచుకోవడానికి భయపడి చస్తున్నారు. చివరికి సేవింగ్స్ ఖాతాల్లోనూ డబ్బు దాచుకోవడం లేదు. బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లు బాగా తగ్గించడమే కాక.. దేశంలో ఎప్పుడు ఏ బ్యాంకు దివాలా తీస్తుందో తెలియని పరిస్థితి. దీంతో కొంతమంది బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు తప్ప బ్యాంకులో దాచుకోవడం లేదు. అయితే తపాలాశాఖ తాజాగా తీసుకొచ్చిన ఒక స్కీం గురించి చెబితే మాత్రం అందరూ ఎగిరి గంతేస్తారు. అదేమిటంటే...

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్...

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్...

బ్యాంకుల్లో మాదిరిగానే పోస్టాఫీసులోనూ రికరింగ్ డిపాజిట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎంత కాలంపాటు డిపాజిట్ చేయాలన్నది మీరే ఎంచుకోవచ్చు. మంచి వడ్డీ రేటు పొందాలని భావించే వారికి ఈ రికరింగ్ డిపాజిట్ ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ప్రతి నెలా కొంత మొత్తం నిర్ణీత కాలంపాటు డిపాజిట్ చేస్తూ వచ్చిన వారికి మెచ్యూరిటీ సమయంలో మంచి బెనిఫిట్ కలుగుతుంది.

రూ.10తో ఆర్డీ ప్రారంభం...

రూ.10తో ఆర్డీ ప్రారంభం...

అసలే చాలీచాలని సంపాదన.. మేం బతకడమే కష్టంగా ఉంటే.. మళ్లీ అందులో డిపాజిట్లు కూడానా అంటారా? అయితే మీరిక్కడ ఓ విషయం తెలుసుకోవాలి. బ్యాంకుల సంగతి పక్కన పెడితే.. పోస్టాఫీసుల్లో మీరు నెలకు రూ.10 కూడా దాచుకోవచ్చు. అవును రూ.10తో మీరు రికరింగ్ డిపాజిట్ ప్రారంభిస్తే.. అలా ఐదేళ్లపాటు.. అంటే 60 నెలలు పొదుపు చేస్తూ వస్తే.. మీ డబ్బు వడ్డీతో కలుపుకుని రూ.725.05 అవుతుంది.

బ్యాంకుల కంటే అధిక వడ్డీ...

బ్యాంకుల కంటే అధిక వడ్డీ...

బ్యాంకులతో పోల్చుకుంటే.. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు అధికంగా ఉంటోంది. ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ ఇస్తుంటే.. ప్రైవేటు రంగంలోని హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంకు 6.75 శాతం వడ్డీ ఇస్తోంది. అయితే పోస్టాఫీసులో గనుక మీరు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో నెలనెలా కొంత మొత్తాన్ని గనుక డిపాజిట్ చేస్తూ పోతే మీ డబ్బుపై 7.2 శాతం వడ్డీ పొందగలుగుతారు.

స్థిరమైన వడ్డీ రేటు...

స్థిరమైన వడ్డీ రేటు...

ఇక్కడ మీ సొమ్ముపై లభించే వడ్డీకి సంబంధించి మరొక్క విషయం కూడా చెప్పుకోవాలి. అదేమిటంటే.. సాధారణంగా బ్యాంకులిచ్చే వడ్డీ రేటు (చలన) మారుతూ ఉంటుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఈ వడ్డీ రేటు పెరగొచ్చు.. తగ్గొచ్చు. కానీ పోస్టాఫీసులో అలా కాదు. మీరు ఖాతా ప్రారంభించే రోజు ఎంత వడ్డీ రేటు అయితే ఉంటుందో, అదే వడ్డీ రేటు (స్థిర) డిపాజిట్ మెచ్యూరిటీ వరకు.. అంటే.. అయిదేళ్లపాటు కొనసాగుతుంది.

కాంపౌండింగ్ వల్ల అధిక లాభం...

కాంపౌండింగ్ వల్ల అధిక లాభం...

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ ఖాతాలో వడ్డీ అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి జమ అవుతూ వస్తుంది. దీంతో డిపాజిట్‌దారులకు కాంపౌండింగ్ ప్రయోజనం కలుగుతుంది. ఫలితంగా మెచ్యూరిటీ సమయంలో అధిక రాబడి లభిస్తుంది. ఉదాహరణకు.. మీరు ప్రతి నెల రూ.750 మీ ఆర్డీ అకౌంట్‌లో పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయం (60 నెలలు)లో మీ చేతికి రూ.54 వేలు అందుతాయి. ఒకవేళ మీరు ప్రతి నెల రూ.5 వేలు గనుక డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయానికి ఏకంగా రూ.3.6 లక్షలు వస్తాయి.

English summary

డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? పోస్టాఫీసులో ఈ స్కీమ్.. చూశారా? | post office recurring deposit scheme is a good choice for risk averse investors

Post office RD is basically a monthly investment for a fixed period of 5 years with a interest rate of 7.2% per annum (compounded quarterly). On completion of the fixed tenure of five years, RD account with Rs. 10,000 invested every month will fetch you Rs. 7,25,051.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X