For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బేసిక్ వేతనం రూ.20,000 ఉంటే, ఆ తర్వాత మీ చేతికి రూ.2.80 కోట్లు!

|

మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఈపీఎఫ్ఓలో ఖాతాను కలిగి ఉన్నారా? అయితే ఇది మీకోసమే. వాస్తవానికి, భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి, ప్రజలు తమ వృద్ధాప్యాన్ని సౌకర్యవంతంగా కొనసాగించేందుకు వివిధ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వేరుగా పెట్టుబడి వద్దనుకుంటే ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకు అవకాశం ఇస్తుంది. దీని ద్వారా వారు తమ జీతంలో కొంత మొత్తాన్ని ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పదవీ విరమణ సమయంలో మీరు పెద్ద మొత్తంలో పొందవచ్చు.

రూ.2.79 కోట్లు అవుతుంది

రూ.2.79 కోట్లు అవుతుంది

నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ బేసిక్ శాలరీ రూ.20వేలు అయితే, మీకు 25 ఏళ్లు ఉన్నప్పటి నుండి మీరు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, 24 శాతం (12 శాతం యాజమాన్యం, 12 శాతం ఉద్యోగి) కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దీని ప్రకారం ప్రతి నెల రూ.4800 ఇన్వెస్ట్ అవుతుంది. ఇలా పాతిక సంవత్సరాలు నిరంతరం ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ సమయానికి కార్పస్ ఫండ్ రూ.2.79 కోట్లు అవుతుంది. ఇది ఎలాగో చూద్దాం...

ఏ వయస్సులో ఎంత

ఏ వయస్సులో ఎంత

ఈపీఎఫ్ పెట్టుబడిపై మీకు 8.5 శాతం వడ్డీ రేటు ఉందనుకుందాం. మీకు ఏడాదిలో 7 శాతం శాలరీ హైక్ ప్రకారం లెక్కిస్తే....

25 ఏళ్లలో మీ పెట్టుబడి ప్రారంభిస్తే క్రమంగా మీ కార్పస్ ఫండ్ రూ.2.79 కోట్లు అవుతుంది.

30 ఏళ్ల వయస్సులో వేతనం రూ.28,051తో ప్రారంభిస్తే రిటైర్మెంట్ సమయానికి రూ.2.30 కోట్లు అవుతుంది.

35 ఏళ్ల వయస్సులో వేతనం రూ.39,343తో ప్రారంభిస్తే రిటైర్మెంట్ సమయానికి రూ.1.85 కోట్లు అవుతుంది.

ఒకవేళ మీరు 40 ఏళ్ల వయస్సులో పెట్టుబడి ప్రారంభిస్తే, 40 ఏళ్ల వయస్సులో వేతనం రూ.55,181తో ప్రారంభిస్తే రిటైర్మెంట్ సమయానికి రూ.1.42 కోట్లు అవుతుంది.

45 ఏళ్ల వయస్సులో వేతనం రూ.77,394 ప్రారంభిస్తే రిటైర్మెంట్ సమయానికి రూ.1.3 కోట్లు అవుతుంది.

50 ఏళ్ల వయస్సులో వేతనం రూ.1,08,549తో ప్రారంభిస్తే రిటైర్మెంట్ సమయానికి రూ.66.44 లక్షలు అవుతుంది.

అత్యవసరమైతే తప్ప

అత్యవసరమైతే తప్ప

అత్యవసరమైతే తప్ప ఈపీఎఫ్ నుండి డబ్బును ఉపసంహరించుకోవద్దు. ఎందుకంటే దీనిని ఉపసంహరించుకుంటే మీ రిటైర్మెంట్ కార్పస్ తగ్గుతుంది. 30 సంవత్సరాల వయస్సులో పీఎఫ్ ఖాతా నుండి రూ.1 లక్షను ఉపసంహరిస్తే అరవై ఏళ్ల వయస్సులో పదవీ విరమణ నిధి నుండి రూ.11.55 లక్షలు తగ్గుతాయి. ఉద్యోగాలు మారితే మీ పీఎఫ్ ఖాతాను బదలీ చేసుకోండి. పీఎఫ్ ఖాతా ఎంత పాతది అయితే అంత ప్రయోజనం. యూఏఎన్ ద్వారా ఈపీఎఫ్ ఖాతాను సులభంగా బదలీ చేసుకోవచ్చు.

English summary

మీ బేసిక్ వేతనం రూ.20,000 ఉంటే, ఆ తర్వాత మీ చేతికి రూ.2.80 కోట్లు! | PF Account Holders Alert: Basic salary is Rs 20,000, you will get Rs 2.79 crore profit

If your basic salary is 20 thousand and from the age of 25, 24% EPF is deducted, then accordingly an investment of Rs 4800 will be made every month. If you keep investing continuously for 25 years, then you can get a corpus of RS 2.79 crores on retirement. Let us understand about it in simple words.
Story first published: Thursday, March 10, 2022, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X