For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్గెస్ట్ ఐపీవో చాలా నెమ్మదిగా...: ఈ 3 స్టాక్స్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్!

|

ఇటీవలి భారత అతిపెద్ద బిగ్గెస్ట్ ఐపీవో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ మందగమన సభ్యత్వాన్ని చూస్తోంది. మూడో రోజు మధ్యాహ్నం సమయానికి బిడ్డింగ్ కేవలం 55 శాతం మాత్రమే నమోదయింది. రిటైల్ పోర్షన్ మాత్రం 1.35 శాతంగా ఉంది. రూ.18,300 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో, రూ.2080-రూ.2110 ఇష్యూ ధరతో సోమవారం వచ్చిన పేటీఎం ఐపీవో సబ్‌స్క్రిప్షన్ నెమ్మదిగా కొనసాగుతోంది.

ఇష్యూలో భాగంగా 4.83 కోట్ల షేర్లు జారీ చేస్తుండగా, నేడు మధ్యాహ్నం వరకు 55 శాతం సబ్‌స్క్రిప్షన్‌తో 2.65 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్స్ వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకు 1.32 శాతం స్పందన వచ్చింది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 5 శాతం స్పందన లభించింది. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ కోసం కేటాయించిన షేర్లకు 54 శాతం స్పందన లభించింది.

ధర కాస్త ఎక్కువే

ధర కాస్త ఎక్కువే

పేటీఎం ప్రైస్ భారీగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన టెక్నికల్ రంగం కంపెనీలు నైకా, జొమాటో పబ్లిక్ ఇష్యూలకు తొలిరోజు అపూర్వ స్పందన లభించింది. పేటీఎం షేర్ల పరిమాణంతో పోలిస్తే వాటి పరిమాణం తక్కువ. పేటీఎం అయితే రిటైల్ ఇన్వెస్ట‌ర్ క‌నీసం ఆరు షేర్ల‌తో కూడిన ఒక లాట్, గ‌రిష్టంగా 15 లాట్లను కొనుగోలు చేయాలి. ఒక లాట్ పైన అప్ప‌ర్ ప్రైస్ బాండ్ రూ.12,900 ప‌లుకుతుంది. లాట్ సైజ్ ఆరు షేర్లకు పరిమితం చేసినప్పటికీ, భారీ రేటుతో ఇంకెంత ప్రీమియం వస్తుందనే ఆలోచన కూడా రిటైల్ ఇన్వెస్టర్ల నిరాదరణకు కారణంగా భావిస్తున్నారు.

షాపైర్, లాటెంట్

షాపైర్, లాటెంట్

షాప్పైర్ ఫుడ్స్ ఐపీవో, లాటెంట్ వ్యూ ఐపీవో కూడా ఉంది. నేడు లాటెంట్ వ్యూ ఐపీవో ప్రారంభమవుతోంది. నవంబర్ 10న ప్రారంభమై నవంబర్ 12వ తేదీన ముగుస్తుంది. ప్రైస్ బాండ్ రూ.190 నుండి రూ.197. నేడు ప్రారంభమైన లాటెంట్ వ్యూ బిడ్డింగ్‌కు ఆదరణ లభించింది. రిటైల్ సబ్‌స్క్రిప్షన్ 1.38 శాతంగా ఉంది. రూ.474 కోట్ల వ్యాల్యూ కలిగిన షేర్లను ఆఫర్ చేస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ కింద మరో రూ.126 కోట్లు సేకరిస్తోంది.

ఇక నిన్న ఐపీవోకు వచ్చిన షాపైర్ ఫుడ్స్ నేటి (రెండో రోజు) 54 శాతం సబ్‌స్క్రిప్షన్ నమోదు చేసింది. 96.63 లక్షల షేర్లను అందుబాటులోకి తెచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్స్ సబ్‌స్క్రిప్షన్ 2.97 శాతం, నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సబ్‌స్క్రిప్షన్ 6 సాతం, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ 2 శాతం సబ్‌స్క్రైబ్ అయింది.

దీర్ఘకాలంలో మంచి పెట్టుబడి

దీర్ఘకాలంలో మంచి పెట్టుబడి

పేటీఎం, సాఫైర్ ఫుడ్స్, లాటెంట్ వ్యూ స్టాక్స్‌ను కొనుగోలు చేసినప్పటికీ లాంగ్ టర్మ్‌లో మంచి ఫలితాలు ఇస్తాయని, కాబట్టి వీటిని అట్టిపెట్టుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ మూడు కంపెనీలు కూడా తమ తమ రంగాల్లో ఆకర్షణీయంగా ఉన్నాయని, ఈ కంపెనీలు మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ మూడింటిని కొనుగోలు చేసి అట్టిపెట్టుకుంటే దీర్ఘకాలంలో మంచి స్టాక్స్‌గా ఉండగలవని చెబుతున్నారు.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి స్టాక్స్ గురించి, మార్కెట్ గురించి పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం మంచిది.

English summary

బిగ్గెస్ట్ ఐపీవో చాలా నెమ్మదిగా...: ఈ 3 స్టాక్స్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్! | Paytm IPO, Biggest India Sale, Sees Sluggish Subscription

One97 Communications-owned Paytm opened its initial public offering for subscription on November 8. This is the largest-ever public issue in the history of Indian capital markets.
Story first published: Wednesday, November 10, 2021, 12:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X