For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్డు ఒక్కటే... ప్రయోజనాలు మాత్రం మూడు... అదేంటో తెలుసుకోండి..

|

వినియోగదారుల అభిరుచులు, అవసరాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా విభిన్న రకాల ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు కొత్తదనాన్ని, సౌలభ్యాన్ని కోరుకుంటున్నారు. దీన్ని గుర్తిస్తున్న బ్యాంకులు అందుకు తగిన విధంగా సేవలను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రయివేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొత్త కార్డును తీసుకువచ్చింది. మరి దీని గురించి తెలుసుకుందామా...

మీరు అకౌంట్ తెరవండి... మేము ఒక మొక్కను నాటుతాం..మీరు అకౌంట్ తెరవండి... మేము ఒక మొక్కను నాటుతాం..

3 ఇన్ 1 కార్డు

3 ఇన్ 1 కార్డు

* ఇటీవలే యాక్సిస్ బ్యాంకు స్మార్ట్ మెటల్ కార్డు ను విడుదల చేసింది. డెబిట్,క్రెడిట్, మల్టీ కరెన్సీ కార్డు సదుపాయాలు ఈ ఒక్క కార్డులోనే ఉన్నాయి.

* ఈ కార్డు ద్వారా కస్టమర్లు తమ ఆర్ధిక లావా దేవీలు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించుకోవచ్చని చెబుతోంది. దేశీయంగానేకాకుండా విదేశాల్లోనూ ఈ కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు.

త్రీ ఇన్ వన్ కార్డు తెచ్చిన తొలి ప్రయివేటు బ్యాంకు

త్రీ ఇన్ వన్ కార్డు తెచ్చిన తొలి ప్రయివేటు బ్యాంకు

* యాక్సిస్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకింగ్ ప్లాటుఫారం బర్గండి ప్రైవేట్ కోసం అందుబాటులోకి తెచ్చారు. ఇదే సంపన్న విభాగ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. బర్గండి ప్రైవేట్ తన కస్టమర్లకు వెల్త్ మేనేజ్మెంట్ , రుణ వితరణ సర్వీసులను అందిస్తోంది. ఎస్టేట్ ప్లానింగ్, రియల్ ఎస్టేట్, టాక్స్ అడ్వైజరీ తదితర సేవలను కూడా అందిస్తోంది.

* ఈ కార్డు ఒక ప్రత్యేకతను కూడా సొంతం చేసుకుంది. ఇలా త్రీ ఇన్ వన్ కార్డును తెచ్చిన తొలి భారత ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ నిలిచింది.

సంపన్న కస్టమర్లపై లక్ష్యం

సంపన్న కస్టమర్లపై లక్ష్యం

* దేశంలో సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరి సంపద నిర్వహణతో పాటు వీరికి అవసరమైన సర్వీసులు అందించేందుకు బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

* గడచిన ఆర్ధిక సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయ పన్ను రిటర్న్ ను సమర్పించిన వ్యక్తుల సంఖ్య పాతిక శాతం వరకు పెరిగినట్టు ఇటీవలే యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అమితాబ్ చౌదరి పేర్కొన్నారు.

* అంతే కాకుండా దేశంలో అధిక సంపద కలిగిన వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలోనే వీరికి తగిన సేవలు అందించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే యాక్సిస్ బ్యాంక్ మెటల్ క్రెడిట్ కార్డును కూడా తెచ్చింది. దీన్ని వినియోగించి నగదు తీసుకున్నా ఎలాంటి చార్జీలను వసూలు చేయడం లేదు. విదేశీ కరెన్సీ లావాదేవీలపైనా చార్జీలు వసూలు చేయడం లేదు. ఉన్నతాదాయ వర్గాలు ఎక్కువగా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తుంటారు. కాబట్టి వీరికి ఇలాంటి కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని బ్యాంకు చెబుతుంటాయి.

English summary

కార్డు ఒక్కటే... ప్రయోజనాలు మాత్రం మూడు... అదేంటో తెలుసుకోండి.. | One card 3 services, Axis bank launched new card

Targeting high net worth segment customers Axis bank recently launched new 3 in 1 metallic card. That offers debit, credit, forex card services.
Story first published: Tuesday, December 24, 2019, 18:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X