For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈఎంఐ భారమవుతోందా? ఈ సింపుల్ స్టెప్స్‌తో అధిక భారాన్ని తగ్గించుకోండి

|

వచ్చే అరాకొరా వేతనం... ప్రతి నెల ఇంటి ఖర్చులు, విద్యుత్ వంటి వినియోగ ఛార్జీలు. దీనికి తోడు కోరుకొని తీసుకున్న ఈఎంఐ భారం. ఇందులో ఏది లేకున్నా ఇల్లు గడవని పరిస్థితి. ఇక ఈఎంఐ గురించి చెప్పవలసిన పని లేదు. దీనిని ప్రతి నెల ఠంచన్‌గా చెల్లించాల్సిందే. లేదంటే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. జరిమానా ఉంటుంది. ఇది ఆర్థికంగా మరింత భారమవుతుంది. భవిష్యత్తులో క్రెడిట్ కార్డు, లోన్ అర్హతల పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఆర్థిక ఒత్తిడి, అత్యవసరాల కారణంగా చాలామంది రుణగ్రహీతలు రుణ చెల్లింపును మిస్ అయ్యే సందర్భాలు ఉంటాయి. ఆర్థిక పరిమితుల కారణంగా తమ ఈఎంఐలను తిరిగి చెల్లించలేని ప్రస్తుత రుణ గ్రహీతల కోసం ఇక్కడ కొన్ని ఆర్థిక చిట్కాలు.

రిడీమ్ లేదా క్లోజింగ్

రిడీమ్ లేదా క్లోజింగ్

మీకు ఈఎంఐ చెల్లింపులు అధిక భారమైతే కనుక ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, డెట్ ఫండ్స్ వంటి వాటిని క్లోజ్ చేయడం లేదా రిడీం చేయడం. ఈఎంఐ భారాన్ని సకాలంలో చెల్లించలేని వారు దీనిని ఆలోచించాలి. ఈ దీర్ఘకంలో ఈక్విటీస్ వంటివి అందించే రిటర్న్స్ కంటే ఫిక్స్డ్ ఇన్‌కం పెట్టుబడి సాధనాలు (ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్, డెట్ ఫండ్స్) తక్కువ రాబడిని ఇస్తాయి. వీటిపై ఇచ్చే వడ్డీ రేటు కూడా తక్కువ. కాబట్టి కీలకమైన ఆర్థిక లక్ష్యాల కోసం వీటిని క్లోజ్ చేయడం లేదా రిడీమ్ చేయడాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

రుణ బదలాయింపు

రుణ బదలాయింపు

ఇప్పటికే ఉన్న రుణాన్ని మరింత తక్కువ వడ్డీ రేటు బ్యాంకు లేదా సాధనానికి బదలీ చేయడం మరో మార్గం. తక్కువ వడ్డీ రేటు సాధనానికి బదలీ చేసుకుంటే ఈఎంఐ భారం కాస్త తగ్గుతుంది. అదే సమయంలో ప్రస్తుత రుణ కాలపరిమితిని పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. తద్వారా ఈఎంఐ భారాన్ని మరింతగా తగ్గించుకోవచ్చు.

అయితే పెరిగిన పదవీ కాలానికి వడ్డీ రేటు పెరుగుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. రుణదాత బ్యాలెన్స్ బదలీ అభ్యర్థనను తాజా రుణ దరఖాస్తుగా పరిగణిస్తారు. కాబట్టి ప్రాసెసింగ్ ఫీజు, అడ్మినిస్ట్రేషన్ ఫీజు, ఇతర ఛార్జీల వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని లాభం ఉంటేనే తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించడం ద్వారా కాస్త భారాన్ని తగ్గించుకోవచ్చు.

అత్యవసర నిధి వినియోగం

అత్యవసర నిధి వినియోగం

అత్యవసర నిధిని మొదటి నుండి ప్లాన్ చేసుకోవాలి. అనారోగ్యం, ఊహించని ఖర్చులు వచ్చిపడటం వంటి వాటికి అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. ఈఎంఐ చెల్లించలేని క్లిష్ట పరిస్థితుల్లోను ఈ నిధిని వినియోగించుకోవాలి. అత్యవసర నిధి కనీసం ఆరు నెలల ఇంటి ఖర్చు కోసం ఉండేలా చూసుకోవాలి.

రుణ ఏకీకరణ

రుణ ఏకీకరణ

అనేక రుణాలు కలిగిన వారు రుణ ఏకీకరణను పరిగణలోకి తీసుకోవాలి. తక్కువ వడ్డీ రేటుతో ఒకటి లేదా రెండు కొత్త రుణాలను పొందడం ద్వారా అధిక వడ్డీ రేట్లకు తమ ప్రస్తుత రుణాలను ఏకీకృతం చేయాలి. కొత్త రుణం ద్వారా అధిక వడ్డీ రేటు కలిగిన పాత రుణాలు చెల్లించాలి.

English summary

ఈఎంఐ భారమవుతోందా? ఈ సింపుల్ స్టెప్స్‌తో అధిక భారాన్ని తగ్గించుకోండి | Manage your loan EMIs better with these steps

Financial stress or exigencies can force many borrowers to miss loan repayments. As missing EMI repayments can attract hefty penalties on the unpaid dues, it can further worsen the borrower’s debt burden. Non-payment of EMIs by the due date also adversely impacts the borrower’s credit score and future credit card and loan eligibility.
Story first published: Wednesday, January 26, 2022, 9:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X