For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్ద బ్యాంకుల కంటే బెట్టర్! సేవింగ్స్ అకౌంట్‌పై వడ్డీ రేట్లు ఇలా

|

భద్రత, వినియోగం, ద్రవ్యత నేపథ్యంలో సేవింగ్స్ ఖాతాలు దేశంలో అత్యంత పాపులర్ బ్యాంగింగ్ పరికరంగా ఉంది. పదవీ విరమణ వ్యూహాలు, ఖర్చు లక్ష్యాలు, ఆర్థిక ప్రాధాన్యతలకు ఇవి పునాది వేస్తాయి. సేవింగ్స్ ఖాతాల పైన వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ రేట్ల కంటే తక్కువగా ఉంటాయి. ప్రధాన ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే సేవింగ్స్ ఖాతాల పైన కొన్ని చిన్న ప్రయివేటు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. సేవింగ్స్ అకౌంట్‌లో బ్యాంకులు ఎంత మొత్తంలో వడ్డీ రేటును అందిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

రిస్క్.. సేవింగ్స్ అకౌంట్

రిస్క్.. సేవింగ్స్ అకౌంట్

రిస్క్‌ను పరిగణలోకి తీసుకొని ఎప్పుడు కూడా సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు ఉంచడాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మీరు సేవింగ్స్ అకౌంట్ తెరిచే ప్రయత్నాలు చేస్తే మంచి వడ్డీ రేటు అందించే కొన్ని బ్యాంకులను కింద తెలుసుకోండి. వివిధ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్స్ పైన వివిధ వడ్డీ రేట్లను అందిస్తాయి. సేవింగ్ అకౌంట్స్ వడ్డీ రేటు సాధారణంగా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బంధన్ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు వంటి బ్యాంకులు వడ్డీ రేటును 7.15 శాతం, 6.5 శాతం, 6 శాతంగా అందిస్తున్నాయి.

వడ్డీ రేట్లు

వడ్డీ రేట్లు

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ప్రస్తుతం వడ్డీ రేటును 7.25 శాతం నుండి 7 శాతం వరకు అందిస్తున్నాయి. ప్రధాన ప్రయివేటు బ్యాంకుల విషయానికి వస్తే HDFC బ్యాంకు, ICICI బ్యాంకులు 3 శాతం, 3.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు 4 శాతం, ఎస్బీఐ 2.7 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3.20 శాతం అందిస్తున్నాయి.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

- Utkarsh Small Finance Bank - 5 నుండి 7.25 శాతం

- Equitas Small Finance Bank - 3.5 నుండి 7.25 శాతం

- బంధన్ బ్యాంకు - 3 నుండి 7.15 శాతం

- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - 4 నుండి 7 శాతం

- AU Small Finance Bank - 3.5 నుండి 7 శాతం

- Fincare Small Finance Bank - 3 నుండి 7 శాతం

- ESAF Small Finance Bank - 4 నుండి 6.5 శాతం

- RBL Bank - 4.75 నుండి 6.5 శాతం

- Suryoday Small Finance Bank - 4 నుండి 6.25 శాతం

- IndusInd Bank - 4 నుండి 6 శాతం

- IDFC First Bank - 3.5 నుండి 6 శాతం

- Yes Bank - 4 నుండి 5.5 శాతం

- DCB Bank - 3.25 నుండి 5.5 శాతం

- City Union Bank - 3.5 నుండి 4 శాతం

- Kotak Mahindra Bank - 3.5 నుండి 4 శాతం

- DBS Bank - 3 నుండి 4 శాతం

- Union Bank of India - 3 నుండి 4 శాతం

- Dhanlaxmi Bank - 3 నుండి 4 శాతం

- Punjab National Bank - 3 నుండి 3.5 శాతం

- Axis Bank - 3 నుండి 3.5 శాతం

- HDFC Bank - 3 నుండి 3.5 శాతం

- ICICI Bank - 3 నుండి 3.5 శాతం

- Punjab & Sind Bank - 3.1 శాతం

- Indian Overseas Bank - 3.05 శాతం

English summary

పెద్ద బ్యాంకుల కంటే బెట్టర్! సేవింగ్స్ అకౌంట్‌పై వడ్డీ రేట్లు ఇలా | List of Banks Providing Higher Interest Rates On Savings Accounts

Savings accounts are the most popular banking instrument in our country due to their safety, usability, and liquidity. These lay the groundwork for all of our financial priorities, including retirement strategies, spending goals, and so on.
Story first published: Monday, April 19, 2021, 15:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X