For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు హోమ్ లోన్ కోసం ఆ రెండు జట్టు: ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్‌లో వడ్డీ రేట్లు ఇలా...

|

కస్టమర్లకు హోమ్ లోన్స్ ఇచ్చేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(IPPB), ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL) జత కట్టాయి. 4.5 కోట్ల IPPB కస్టమర్లకు హోమ్ లోన్ ఉత్పత్తులు అందించేందుకు గాను వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంగళవారం తెలిపాయి. దేశవ్యాప్తంగా ఉన్న 650 బ్రాంచీలు, 1,36,000 బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్స్ ద్వారా LIC హౌసింగ్ హోమ్ లోన్ ఉత్పత్తులను తమ కస్టమర్లకు అందించేందుకు ప్రయత్నిస్తామని తపాలా బ్యాంక్ తెలిపింది. అన్ని హోమ్ లోన్ క్రెడిట్ అండర్ రైటింగ్, ప్రాసెసింగ్, పంపిణీ తదితర విషయాలు LIC హౌసింగ్ చేపడుతుంది. రుణాలు తీసుకునే ఖాతాదార్లను తపాలా బ్యాంక్ ఆ సంస్థకు చూపిస్తుంది. IPPB ఇప్పటికే జనరల్ ఇన్సురెన్స్, జీవిత బీమా పాలసీలను పంపిణీ చేస్తోంది.

LICHFLతో వ్యూహాత్మక భాగస్వామ్యం IPPB తన ఉత్పత్తులు, సేవలను విస్తృతం చేసేందుకు ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల, అండర్-సర్వ్డ్ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. IPPB ప్రముఖ బీమా కంపెనీల భాగస్వామ్యంతో వివిధ సాధారణ, జీవిత బీమా ఉత్పత్తులను పంపిణీ చేస్తోంది. క్రెడిట్ ఉత్పత్తులు మరో మైలురాయి. IPPB 200,000 పోస్టల్ ఉద్యోగులతో(పోస్ట్‌మెన్ అండ్ గ్రామీన్ డాక్ సేవక్స్) మైక్రో ఏటీఎం, బయోమెట్రిక్ పరికరాలతో కూడి, డోర్ స్టె బ్యాంకింగ్ సేవల ద్వారా LICHFL హౌసింగ్ లోన్స్ అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.

LICHF partners with India Post Payments Bank to offer home loans

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వేతన జీవులకు రూ.50 లక్షల వరకు 6.66 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ అందిస్తుంది. అయితే ఈ వడ్డీ రేటు రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే వారి సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీ రేటు ఉంటుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు, NBFCలో హోమ్ లోన్ వడ్డీ రేటును 6.6 శాతం నుండి 7 శాతం మధ్య అందిస్తున్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ట్రెడిషనల్ హోమ్ లోన్ ఉత్పత్తులతో పాటు గృహ వరిష్టా వంటి ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఈ స్కీం రిటైర్డ్ లేదా PSU కంపెనీ, ప్రభుత్వ, డిఫెన్స్, బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులకు అందిస్తోంది. రుణం తీసుకునే సమయంలో రుణగ్రహీత వయస్సు 65 ఉండవచ్చు. రుణ కాలపరిమితి 80 సంవత్సరాల వరకు లేదా గరిష్టంగా 30 ఏళ్లు ఉండవచ్చు. ఇందులో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. అంతేకాదు, ఎల్ఐసీ హౌసింగ్ ఆరు ఈఎంఐలకు మినహాయింపును ఇస్తోంది. భారత్‌లో హౌసింగ్ లోన్ మార్కెట్ 22.26 లక్షల కోట్లు (డిసెంబర్ 2020 నాటికి).

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వివిధ రకాల హోమ్ లోన్స్‌ను అందిస్తోంది. గృహ సువిధ హోమ్ లోన్, పెన్షనర్లకు హోమ్ లోన్, హోమ్ రినోవేషన్ లోన్, హోమ్ లోన్ టాపప్, హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్, ప్లాట్ లోన్, హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ లోన్ ఎన్నారై, హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ వంటివి ఉన్నాయి.

హోమ్ లోన్ పైన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...

రూ.50 లక్షల వరకు రుణంపై...

CIBIL 700కు ఎక్కువ ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 6.66 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.00 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

CIBIL 650 నుండి 699 మధ్య ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 7.10 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.20 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

CIBIL 600 నుండి 649 మధ్య ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 7.30 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.40 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

CIBIL 600కు తక్కువ ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 7.50 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.60 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

రూ.50 లక్షల నుండి రూ.1 కోటి వరకు రుణంపై...

CIBIL 700కు ఎక్కువ ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 6.90 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.00 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

CIBIL 650 నుండి 699 మధ్య ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 7.30 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.40 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

CIBIL 600 నుండి 649 మధ్య ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 7.60 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.70 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

CIBIL 600కు తక్కువ ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 7.70 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.80 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

రూ.3 కోట్ల నుండి రూ.15 కోట్ల వరకు రుణంపై...

CIBIL 700కు ఎక్కువ ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 6.90 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.00 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

CIBIL 650 నుండి 699 మధ్య ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 7.50 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.60 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

CIBIL 600 నుండి 649 మధ్య ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 7.70 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.80 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

CIBIL 600కు తక్కువ ఉంటే శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు 7.80 శాతం, నాన్ శాలరైడ్, నాన్ ప్రొఫెషనల్స్‌కు 7.90 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

English summary

కస్టమర్లకు హోమ్ లోన్ కోసం ఆ రెండు జట్టు: ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్‌లో వడ్డీ రేట్లు ఇలా... | LICHF partners with India Post Payments Bank to offer home loans

IPPB and LIC Housing Finance on Tuesday announced a strategic partnership for providing home loan products to over 4.5 crore customers of IPPB, the companies said in a press statement.
Story first published: Wednesday, September 8, 2021, 11:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X