For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC SARAL Plan: రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే... జీవితాంతం పెన్షన్ - ఎంతంటే..?

|

రిటైర్ అయిన తర్వాత మంచి జీవనం పొందాలంటే అందుకు తగ్గ ప్రణాళిక ఇప్పటి నుంచే రచించాల్సిన అవసరం ఉంది. సరైన సమయంలో సరైన పెట్టుబడి పెడితే మంచి పెన్షన్ పొందొచ్చు. అయితే ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుంది అనే ప్రశ్న చాలామందికి రావొచ్చు. అయితే ఎప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెడితే సురక్షితం అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే దేశంలో చాలామంది ఎల్‌ఐసీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సంస్థ ప్రజల మనసులను గెలుచుకుంది. అందుకే తమ కస్టమర్ల కోసం మంచి ప్లాన్స్‌ను ప్రవేశ పెట్టింది ఎల్‌ఐసీ. ఇందులో భాగంగా ఎల్ఐసీ అత్యుత్తమ పెన్షన్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కేవలం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతినెలా రూ. 22వేలు పెన్షన్ రూపంలో పొందొచ్చు.

సాధారణంగా పోస్టాఫీసులో కానీ బ్యాంకుల్లో కానీ రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు గరిష్టంగా రూ.5వేలు వడ్డీ రూపంలో పొందొచ్చు. కానీ ఎల్ఐసీ ప్రవేశపెట్టిన ప్లాన్‌తో మాత్రం పోస్టాఫీసులు, బ్యాంకులు వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం మీద నాలుగు రెట్లు అధికంగా రిటర్న్స్ పొందొచ్చు.

LIC Saral Pension Plan: Invest Rs 10 Lakh and know how much you get as monthly pension

LIC ఇటీవల సరల్ పెన్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. LIC యొక్క ఈ పెన్షన్ ప్లాన్‌లో ఒకసారి పెట్టుబడి పెట్టడం ద్వారా జీవితాంతం పెన్షన్ పొందుతారు. LIC తీసుకొచ్చిన ఈ పెన్షన్ ప్లాన్ ఒంటరి జీవితం గడుపుతున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వారికి ఒక ఆర్థిక అండగా నిలుస్తుంది. ఈ ప్లాన్ కింద ఒక వ్యక్తి తనతో పాటు తన భార్యను కూడా చేర్పించవచ్చు. ఇద్దరిలో ఒకరు మరణిస్తే మరో వ్యక్తి బతికున్నంత వరకు ఈ పెన్షన్ చెల్లించబడుతుంది. ఒకవేళ ఇద్దరూ మరణిస్తే పెన్షన్ ప్లాన్‌లో డిపాజిట్ చేయబడ్డ డబ్బులు నామినీకి అందజేయడం జరుగుతుంది. LIC యొక్క సరల్ పెన్షన్ ప్లాన్ సంఖ్య UIN: 512N342V01. దీన్ని ప్రీమియం పెన్షన్ ప్లాన్ కింద కూడా పరిగణించొచ్చు. ఈ పెన్షన్ ప్లాన్ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఒకటి ఒంటరిగా ఉన్న వారు ప్లాన్‌ను తీసుకోవచ్చు.. మరొకటి దంపతులు ఇద్దరూ కలిసి తీసుకోవచ్చు.

ఎల్ఐసి సరల్ పెన్షన్ స్కీమ్ కింద, నెలకు కనీసం 1000 రూపాయల పెన్షన్ తీసుకోవడం తప్పనిసరి. అయితే, తీసుకోగల గరిష్ట పెన్షన్‌పై పరిమితి లేదు. అటువంటి పరిస్థితిలో, ఏదైనా పెన్షన్ స్కీమ్‌ ఎంపిక చేసుకోవచ్చు. LIC యొక్క సరల్ పెన్షన్ ప్లాన్‌లో, 40 సంవత్సరాల నుండి పెన్షన్ ప్రారంభించవచ్చు. గరిష్ట వయస్సు విషయానికొస్తే, ఇది 80 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. అంటే, 40 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు ఏ వ్యక్తి అయినా LIC యొక్క ఈ పెన్షన్ ప్లాన్‌లో చేరవచ్చు మరియు వెంటనే పెన్షన్ తీసుకోవడం చేయొచ్చు. ఇది ఒకే ప్రీమియం ప్లాన్. దీంతో మీరు ప్రీమియం చెల్లించిన రోజు తర్వాత వెంటనే పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారు. LIC ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో సరల్ పెన్షన్ ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో తీసుకోవడానికి అదనపు ప్రయోజనం ఉంటుంది. ప్రతి నెలా లేదా మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా సంవత్సరం ప్రాతిపదికన ఈ పెన్షన్ పొందొచ్చు. మీకు పెన్షన్ ఎలా కావాలో, మీరు పెన్షన్‌ను ఎంచుకునే అవకాశాన్ని బట్టి ఉంటుంది.

ఎల్ఐసి సరల్ పెన్షన్ ప్లాన్ వివరాల ప్రకారం, 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఒకేసారి రూ. 10 లక్షల ప్రీమియం డిపాజిట్ చేస్తే, అతనికి ఏటా రూ .50250 పెన్షన్ మొత్తం చెల్లించబడుతుంది. ఈ పెన్షన్ మొత్తం జీవితాంతం ఇవ్వబడుతుంది. అయితే, పెన్షన్ ప్లాన్ నుండి నిష్క్రమించాలని భావిస్తే.. డిపాజిట్ చేసిన డబ్బు నుండి 5 శాతం తీసివేసి తర్వాత మిగిలిన మొత్తం తిరిగి చెల్లించబడుతుంది. ఈ పెన్షన్ నెలవారీ నుండి వార్షిక ప్రాతిపదికన తీసుకోవచ్చు.

ఎల్ఐసి పొందుపర్చిన సమాచారం ప్రకారం, 60 సంవత్సరాల వయస్సులో సరల్ పెన్షన్ ప్లాన్‌లో రూ .10 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా వార్షిక పెన్షన్ రూ. 51,650 పొందుతారు. మొదటి ఎంపికను ఎంచుకున్నప్పుడు ఈ పెన్షన్ అందుబాటులో ఉంటుంది. రెండవ ఆప్షన్ ఎంచుకుంటే, ఈ పెన్షన్ మొత్తం సంవత్సరానికి రూ. 51,150 అవుతుంది. ఈ పెన్షన్ మొత్తాన్ని నెలవారీ నుండి సంవత్సరానికి కూడా తీసుకోవచ్చు.

ఎల్‌ఐసి సరల్ పెన్షన్ ప్లాన్ కింద 40 ఏళ్ల వ్యక్తి ఒకేసారి రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏటా పెన్షన్ రూపంలో 50,250 రూపాయలు పొందుతాడు. అదే నెలవారీ ఆప్షన్ చూస్తే నెలకు రూ.4200 పెన్షన్ పొందుతాడు. ఈ పెన్షన్ జీవితాంతం అందుబాటులో ఉంటుంది. ఇక SIPలో నెలకు రూ.4200 ఇన్వెస్ట్ చేస్తే అలా 20 ఏళ్ల పాటు చేస్తే మీరు ఆశించన స్థాయిలో రిటర్న్స్ పొందలేరు.

40 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో, నెలకు రూ .4200, SIP నుండి 20 సంవత్సరాల తర్వాత (మీకు 60 ఏళ్లు ఉంటే) సుమారు రూ .41 లక్షలు లభిస్తాయి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ పథకంలో రాబడి 12 శాతం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీకు 60 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, మీ SIP ఆగిపోతుంది మరియు మీ వద్ద 41 లక్షల రూపాయలు ఉంటాయి. మరోవైపు, మీరు సరల్ పెన్షన్ ప్లాన్‌లో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే మీరు నెలకు రూ .4200 పొందుతున్నారు.

English summary

LIC SARAL Plan: రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే... జీవితాంతం పెన్షన్ - ఎంతంటే..? | LIC Saral Pension Plan: Invest Rs 10 Lakh and know how much you get as monthly pension

LIC have introduced the new SARAL life pension scheme where in if you deposit Rs.10 lakhs then you will get Rs.4200 monthly pension.
Story first published: Tuesday, August 10, 2021, 19:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X