For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC IPO: ఆదివారం తెరిచే ఉంటాయ్, లిస్టింగ్ గెయిన్స్ కోసం కాకుండా...

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీవో 4వ తేదీన ప్రారంభమైంది. 9వ తేదీ వరకు సబ్‌స్క్రైబ్ కావొచ్చు. ఐపీవో దరఖాస్తు కోసం దరఖాస్తుదారులకు ఓ శుభవార్త. శనివారంతో పాటు ఆదివారం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ ఎల్ఐసీ ఐపీవో కోసం ఆదివారం (మే 8) కూడా బ్యాంకులను తెరిచి ఉంచనున్నట్లు ప్రకటించింది. అన్ని బ్రాంచీలు కూడా ఎల్ఐసీ దరఖాస్తులను ఆమోదించేందుకు అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్యాక్డ్ అమౌంట్ (ASBA) డిజిగ్నేటెడ్ బ్యాంకు శాఖలు తెరిచి ఉంచాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ తన శాఖలను తెరుస్తోంది.

శుభవార్త

శుభవార్త

ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనే ఖాతాదారుల‌కు ఇది శుభవార్త. ఎల్ఐసీ ఐపీవో కోసం బిడ్స్ డాఖ‌లు చేసేవారి సౌక‌ర్యార్థం ఆదివారం (మే 8) మా అన్ని శాఖ‌లు తెరిచి ఉంటాయని ఎస్బీఐ పేర్కొంది. ఎల్ఐసీ ఐపీవో 4వ తేదీన ఓపెన్ అయింది. ఎల్ఐసీ ఐపీవో 9వ తేదీ వరకు తెరిచి ఉంటుంది.

ఎవరెంత

ఎవరెంత

ఎల్ఐసీ ఐపీవోలో 1.29 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. 20.85 కోట్ల ఈక్విటీ షేర్ల‌కు బిడ్స్ దాఖలు అయ్యాయి. ఎల్ఐసీ ఐపీవోలో 16.2 కోట్ల ఈక్విటీ షేర్ల‌కు మాత్ర‌మే బిడ్స్‌ను ఆహ్వానించింది. పాల‌సీదారులు మిన‌హా శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యానికి 3.77 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్ట‌ర్లు 1.15 రెట్లు, ఉద్యోగులు 2.89 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు. క్యూఐబీ బిడ్ 54 శాతం, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 65 శాతం కొనుగోలు చేశారు.

లాంగ్ టర్మ్ కోసం

లాంగ్ టర్మ్ కోసం

గ్రే మార్కెట్‌లో ఎల్ఐసీ ప్రీమియం కాస్త తగ్గుముఖం పట్టింది. ఐతే ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనేవారు దీర్ఘకాలానికి ఆలోచన చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇన్వెస్టర్లు తమ ఫండ్స్, రిస్క్‌ను పరిగణలోకి ఆలోచించి, ఎల్ఐసీ ఐపీవోలో ఇన్వెస్ట్ చేయవచ్చునని, కానీ లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రం చూడవద్దని సూచిస్తున్నారు. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలని చెబుతున్నారు.

English summary

LIC IPO: ఆదివారం తెరిచే ఉంటాయ్, లిస్టింగ్ గెయిన్స్ కోసం కాకుండా... | LIC IPO: SBI branches will remain open on Sunday to accept applications

Public sector lender SBI on Friday said it will keep all branches open on this coming Sunday i.e. May 8 to accept LIC IPO applications.
Story first published: Saturday, May 7, 2022, 12:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X