For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC హౌసింగ్ గృహవరిష్ట బంపరాఫర్, 6 ఈఎంఐల మాఫీ

|

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇంటి కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. ఈ మేరకు ఇటీవల గృహవరిష్ట పేరుతో హౌసింగ్ లోన్ ప్లాన్‌ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఇప్పుడు 6 EMIల మాఫీ సదుపాయంతో గృహవరిష్ట మార్టగేజ్ గృహరుణాన్ని కొత్తగా తీసుకు వచ్చింది. డిఫైన్డ్ బెనిఫిట్ పెనన్షన్ స్కీమ్ (DBPS) పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్ల కోసం దీనిని రూపొందించింది.

హోమ్ లోన్ చెల్లింపులు జరుగుతున్న కాలంలో 37, 38, 73, 74, 121, 122 EMIలు మాఫీ చేసి అప్పటికి రుణగ్రహీత చెల్లించాల్సిన ప్రిన్సిపల్‌లో సద్దుబాటు చేస్తారు. 65 సంవత్సరాల లోపు వారు దీనికి అర్హులు. ప్రత్యేక లక్షణాల కారణంగా గృహవరిష్టను జూలై 2020లో ప్రారంభించినప్పటి నుండి చాలామందిని ఆకట్టుకుందని, కంపెనీ రూ.15వేల కోట్ల నుండి రూ.30వేల కోట్లు పంపిణీ చేసిందని సీఈవో, ఎండీ విశ్వనాథ గౌడ్ అన్నారు. ఇప్పుడు ఆరు ఈఎంఐల మినహాయింపు వినియోగదారుడికి లాయాల్టీ ప్రయోజనం అన్నారు.

LIC Housing Fin to waive off 6 EMIs under Griha Varishtha

గృహవరిష్ట స్కీంకు అర్హత 65 ఏళ్ల లోపు. లోన్ టెన్యూర్ 80 ఏళ్ల వరకు లేదా గరిష్టంగా 30 ఏళ్లు. అధిక హోమ్ లోన్ కోసం జాయింట్‌గా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎల్ఐసీ హౌసింగ్ లోన్ 6.9 శాతం వడ్డీ రేటు నుండి అందిస్తోంది. 700 అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే రూ.15 కోట్ల వరకు ఇస్తోంది.

English summary

LIC హౌసింగ్ గృహవరిష్ట బంపరాఫర్, 6 ఈఎంఐల మాఫీ | LIC Housing Fin to waive off 6 EMIs under Griha Varishtha

LIC Housing Finance on Thursday announced that it will waive off six equated monthly instalments (EMIs) under home loan product ‘Griha Varishtha’. The company said the product caters to customers who are entitled to get pension under defined benefit pension scheme.
Story first published: Friday, March 26, 2021, 10:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X