ప్రయివేటురంగ కొటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే హోమ్ లోన్ వడ్డీ రేట్లను పరిమిత కాలంలో భారీగా తగ్గించిన ఈ బ్యాంకు దానిని మరికొంతకాలం కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. గత మార్చి నెలలో ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ HDFC, ICICI, కొటక్ మహీంద్రా తదితర బ్యాంకులు పరిమిత కాలంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. మార్చి చివరి తేదీ వరకు ఈ ఆఫర్ వర్తించింది. ఎస్బీఐ ఆ తర్వాత వడ్డీ రేట్లు పెంచింది. అయితే కొటక్ మహీంద్రా గత నెలలో ప్రకటించిన ఆఫర్‌ను కొనసాగిస్తోంది.

ఎస్బీఐ కంటే చాలా తక్కువ
వాస్తవానికి మార్చి 31వ తేదీతో ప్రత్యేక వడ్డీ రేట్ల ఆఫర్ ముగియాలి. కానీ కొటక్ మహీంద్రా మాత్రం వడ్డీ రేట్లను అలాగే కొనసాగిస్తోంది. హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం కొటక్ మహీంద్రలో హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 6.65 శాతంగా ఉంది. మిగతా బ్యాంకుల్లో వడ్డీ రేట్ల కంటే ఇది తక్కువ. ఎస్బీఐ మార్చి నెలలో వడ్డీ రేటును 6.7 శాతానికి తగ్గించింది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలమే. ఏప్రిల్ నుండి వడ్డీ రేటును 6.95 శాతానికి పెంచింది. కొటక్‌లో మాత్రం 6.65 శాతంగా ఉంది.

కనిష్టస్థాయిలో...
హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి ఆఫర్. హోమ్ లోన్స్ పైన వడ్డీ రేట్లు పదిపదిహేనేళ్ల కనిష్టస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఎస్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. మిగతా బ్యాంకులు ఇదే బాటలో నడిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి అతి తక్కువ వడ్డీ రేట్లకు హోం లోన్ తీసుకోవడానికి ఇది సరైన సమయంగా చెబుతున్నారు.

అందుకే యథాతథంగా..
కరోనా సహా పలు కారణాల వల్ల ఇటీవలి కాలంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గాయని, హోమ్ లోన్ సేల్స్‌లో ఇటీవల రికవరీ కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఇళ్ల కొనుగోలుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. హోమ్ లోన్ సేల్స్ భారీగా పెరిగాయని, ఈ ఒరవడి ఇలాగే కొనసాగుతుందని తాము భావిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్లకు అండగా ఉండేందుకు తమ వడ్డీ రేట్లు యథాతథంగా అమలు చేస్తున్నామని కొటక్ మహీంద్రా కన్స్యూమర్ అసెట్ ప్రెసిడెంట్ అంబుజ్ చందన్ అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications