For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FD Rate Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి రాబడిని అందిస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంత కాలానికంటే..?

|

FD Rate Hike: RBI రేట్ల పెంపుకు అనుగుణంగా అనేక బ్యాంకులు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభం కాకముందే బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు మంచి బహుమతిని అందిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకు తన రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీ రేట్లను పెంచింది. రెండు కోట్ల రూపాయలలో పు డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను డిసెంబర్ 26 నుంచి అందుబాటులోకి తెచ్చింది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల లోపు డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3-7 శాతం వడ్డీని అందిస్తోంది.

తిరంగా ప్లస్ స్కీమ్..

తిరంగా ప్లస్ స్కీమ్..

బ్యాంక్ ఆఫ్ బరోడా పత్రికా ప్రకటన ప్రకారం బ్యాంక్ స్పెషల్ తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లను కూడా పెంచింది. బరోడా ట్రైకలర్ ప్లస్ డిపాజిట్ స్కీమ్ 399 రోజులకు ఇప్పుడు 7.05 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 7.55 శాతం వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ త్రైమాసికంలో రెండోసారి రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. నవంబర్‌లో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.

FD వడ్డీ రేట్లు ఇలా..

FD వడ్డీ రేట్లు ఇలా..

7 నుంచి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై బ్యాంక్ 3% వడ్డీని చెల్లిస్తోంది. 46 నుంచి 180 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 4% వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు 181- 270 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 5.25 శాతం వడ్డీ రేటును, 271 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 5.75 శాతం వడ్డీని అందిస్తోంది.

10 సంవత్సరాల FDపై వడ్డీ..

10 సంవత్సరాల FDపై వడ్డీ..

ఏడాది నుంచి మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఇప్పుడు 6.75 శాతం వడ్డీ లభిస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం మెచ్యూర్ అయితే వాటిపై 5.45 శాతం వడ్డీని అందుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 3 ఏళ్ల కంటే ఎక్కువ 10 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. బరోడా తిరంగా డిపాజిట్ స్కీమ్ కింద్ బ్యాంక్ ఆఫ్ బరోడా 444 రోజులు, 555 రోజుల డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీని ఖాతాదారులకు చెల్లిస్తోంది.

English summary

FD Rate Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి రాబడిని అందిస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంత కాలానికంటే..? | Know Fd rates hiked by bank of boroda in latest rate hike

Know Fd rates hiked by bank of boroda in latest rate hike
Story first published: Tuesday, December 27, 2022, 16:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X