For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిపాజిట్ ఇన్సురెన్స్ రూ.5 లక్షల వరకు.. ఎలా వస్తుందంటే?

|

భారత్‌లోని విదేశీ బ్యాంకుల శాఖలు, స్థానిక బ్యాంకులు, ప్రాంతీ గ్రామీణ బ్యాంకులు సహా అన్ని వాణిజ్య బ్యాంకులు డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్(DICGC) బీమా చేస్తాయి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో డిపాజిట్లు కలిగి ఉంటే ప్రతి బ్యాంకులోని డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సురెన్స్ కవరేజీ పరిమితి విడిగా వర్తిస్తుంది. ఆర్థిక ఒత్తిడి కారణంగా బ్యాంకు విఫలమైతే లేదా బ్యాంకు నుండి ఉపసంహరణ నిలిపివేయబడితే డిపాజిటర్లు తక్షణమే రూ.5 లక్షల డిపాజిట్ ఇన్సురెన్స్ పొందతారు. అంటే DICGC యాక్ట్ 1961 కింద డిపాజిట్లు బీమా చేయబడతాయి. తక్షణ ఆర్థిక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

అడిగి తెలుసుకోవాలి

అడిగి తెలుసుకోవాలి

లిక్విడేషన్ విషయంలో డిపాజిట్ ఇన్సురెన్స్ విఫలమైన బ్యాంకులు డిపాజిటర్లకు ఎలా చెల్లిస్తాయో తెలుసుకుందాం. మీరు బ్యాంకులో డిపాజిట్ చేసే సమయంలో అనుమానం ఉంటే మీ బ్యాంకు DICGC చేత బీమా హామీ ఉందా అని బ్రాంచీ అధికారిని అడిగి తెలుసుకోవచ్చు. డిపాజిట్ ఇన్సురెన్స్ పథకం తప్పనిసరి. ఏ బ్యాంకుకైనా ఇది వర్తిస్తుంది. వరుసగా మూడుసార్లు ప్రీమియం చెల్లించడంలో విఫలమైతే DICGC బీమా చేసిన బ్యాంకు నమోదును రద్దు చేయవచ్చు.

ఆ లోపు చెల్లించాలి

ఆ లోపు చెల్లించాలి

డిపాజిట్ బీమా పథకం ప్రకారం, బ్యాంకులోని ప్రతి డిపాజిటర్ వద్ద ఉన్న అసలు, వడ్డీ మొత్తానికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు బీమా హామీ ఉంటుంది. బ్యాంకు లిక్విడేషన్‌కు వెళ్లినప్పుడు లేదా బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినా లేదా బ్యాంకులు ఇతర బ్యాంకులో విలీనమైనా వ‌ర్తిస్తుంది. ఒక బ్యాంకు లిక్విడేషన్‌లోకి వెళ్తే డిపాజిట్ ఇన్సురెన్స్ లిక్విడేటర్ లేదా నియమించబడిన అధికారికి ప్రతి డిపాజిటర్ క్లెయిమ్ మొత్తాన్ని నియమించబడిన అధికారి నుండి క్లెయిమ్ జాబితాను స్వీకరించిన తేదీ నుండి రెండు నెలల్లోపు రూ.5 లక్షల వరకు చెల్లించాలి.

లిక్విడేటర్ ద్వారా

లిక్విడేటర్ ద్వారా

నియమిత అధికారి డిపాజిటర్ వారీగా క్లెయిమ్ జాబితాను తయారు చేసి పరిశీలన, చెల్లింపు కోసం DICGCకి పంపిస్తాడు. ఓసారి జాబితా పరిశీలించి, ప్రతి బీమా డిపాజిటర్‌కు వారి క్లెయిమ్ మొత్తానికి అనుగుణంగా పంపిణీ చేస్తారు. లిక్విడేటర్‌ను కేంద్రం నియమిస్తుంది.

English summary

డిపాజిట్ ఇన్సురెన్స్ రూ.5 లక్షల వరకు.. ఎలా వస్తుందంటే? | If bank fails, Rs 5 lakh deposit insurance amount to be available immediately to depositors

The finance minister, Nirmala Sitharaman, has announced that in case a bank fails or withdrawals from the bank are stopped due to financial pressure on the bank, the depositors will be able to get immediate access to their deposits upto the deposit insurance amount of Rs 5 lakh, i.e., the amount to which deposits are insured under the 'The Deposit Insurance and Credit Guarantee Corporation Act, 1961' (DICGC Act).
Story first published: Thursday, April 15, 2021, 21:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X