For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్త్ ఇన్సురెన్స్.. ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి

|

కరోనా నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు తగిన గ్రూప్ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలను రూపొందించాయి. పలు కంపెనీలు ఇన్సురెన్స్ పాలసీని అప్ గ్రేడ్ చేశాయి. ఆయా సంస్థలు గ్రూప్ హెల్త్ ఇన్సురెన్స్ కింద ఉద్యోగులకు కవరేజ్ ఇస్తుండగా, ఇందుకు అవసరమైన కొన్ని ఫార్మాలిటీస్, ప్రొఫైల్స్‌ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఇందుకు సరైన వివరాలను అందించకుంటే అవసరమైన సమయంలో ఇబ్బందిపడవలసి ఉంటుంది. ఫార్మాలిటీస్ పూర్తి చేయకుంటే మీకు అవసరమైనప్పుడు హామీ మొత్తం చెల్లించకపోవచ్చు. అందుకే గ్రూప్ హెల్త్ ఇన్సురెన్స్ క్లెయిమ్ కోసం కొన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలి.

ఇవి గుర్తుంచుకోండి

ఇవి గుర్తుంచుకోండి

ఉద్యోగి ఐడీని స్వీకరించిన తర్వాత వర్క్ చేసే కంపెనీ పోర్టల్‌లో మీ కుటుంబ సమాచారం అప్ డేట్ చేయాలి. ఇందుకు కావాల్సిన సమాచారాన్ని నమోదు చేయకుంటే క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బంది ఉంటుంది.

ఆరోగ్య బీమా పాలసీ జారీ అయ్యాక సంస్థ మీకు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్(TPA) కార్డును ఇస్తుంది. మీరు ఆసుపత్రిలో నగదురహిత సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఈ కార్డు అవసరం. దీంతో పాటు క్లెయిమ్ కోసం మీ సంస్థ ఐడీ కార్డు ఉండాలి.

ఏ పాలసీని కోనుగోలు చేసినా పాలసీ పత్రాన్ని పూర్తిగా చదవాలి. ఎందుకంటే చివరి నిమిషంలో దీని వల్ల ఇబ్బందులు ఉండవద్దు. ముందే కవరేజీ ఉన్న అంశాలు, లేని అంశాలను తెలుసుకోవడం మంచిది. కార్పోరేట్ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలో పరిమితులెన్నో ఉంటాయి.

బీమా సంస్థలు తమ వినియోగదారుడికి నగదురహిత సేవలను అందించేందుకు ఎంచుకున్న హాస్పిటల్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఈ హాస్పిటల్స్‌ను ఎంపానెల్డ్ నెట్ వర్క్ ఆసుపత్రులుగా సూచిస్తారు. పాలసీ పత్రాన్ని చదివే సమయంలోనే ఈ ఆసుపత్రులను తెలుసుకోవాలి.

క్లెయిమ్

క్లెయిమ్

ఇన్సురెన్స్ చేసినవారు నెట్ వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందాలి. కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి ఆరోగ్య బీమా పాలసీ, టీపీఏ ఈ-కార్డు వివరాలు అందించాలి. వారికి కూడా పాలసీ గురించి పూర్తి వివరాలు తెలిసి ఉండేలా చూడాలి. నెట్ వర్క్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక మెడికల్ బిల్లులకు సంబంధించిన అన్ని ఖర్చులు ఆసుపత్రి ద్వారా బీమా సంస్థకు లేదా టీపీఏకు పంపిస్తారు. అప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీ ఖర్చు వివరాలను అంచనా వేస్తుంది.

బీమా సంస్థ క్లెయిమ్‌ను పరిష్కరిస్తుంది. సంస్థ గ్రూప్ బీమా పాలసీ విషయంలో క్లెయిమ్ ప్రక్రియ, ఆమోదం, పరిష్కారం వంటి సమాచారాన్ని సంస్థకు వెల్లడించాలి. చాలా హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలు హాస్పిటలైజేషన్ బిల్లులను నగదురహిత క్లెయిమ్ రూపంలో సెటిల్ చేస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత హెల్త్ ఇన్సురెన్స్ పైన అవగాహన పెరిగింది. అంతకుముందు హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపించని చాలామంది ఇప్పుడు తీసుకుంటున్నారు. కరోనా తర్వాత హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలు పెరిగాయి.

కార్పోరేట్ బీమా పైనే ఆధారపడవద్దు

కార్పోరేట్ బీమా పైనే ఆధారపడవద్దు

కార్పోరేట్ హెల్త్ ఇన్సురెన్స్ ప్లాన్ అనేది మీరు ఆ సంస్థకు అసెట్ అని చూపించే అవసరం. యజమాని ప్రాయోజిత ఆరోగ్య బీమా పథకం సాధారణంగా ఉద్యోగి, వారి జీవిత భాగస్వామి పిల్లలు, ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులను కవర్ చేస్తుంది. బీమా కవరేజీ విలువైనది. అయితే కేవలం కార్పోరేట్ బీమా పథకంపై ఆధారపడటం అంత సరైన ఆలోచన కాదనేది నిపుణుల సూచన.

English summary

హెల్త్ ఇన్సురెన్స్.. ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి | How to claim health insurance from your employer?

Know how to claim health insurance from your employer. The insured should try to get treatment in a network hospital.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X