ఈ బ్యాంకుల్లో లాకర్ ఛార్జీలు తెలుసా?: రూ.500 నుండి రూ.20,000 వరకు
సాధారణంగా బ్యాంకు లాకర్లలో జ్యువెల్లరీ, ముఖ్యమైన పేపర్లు వంటి వాటిని దాచి పెడుతుంటారు. బ్యాంకు లాకర్ తీసుకుంటే ఇందుకు గాను ఆయా బ్యాంకులు ఛార్జీలను వసూలు చేస్తాయి. లాకర్ సైజ్, ప్రాంతాన్ని బట్టి (అర్బన్, మెట్రో, రూరల్) బ్యాంకు లాకర్ ఛార్జీలు ఉంటాయి. అలాగే ఆయా బ్యాంకులు కూడా వివిధ ఛార్జీలను వసూలు చేస్తాయి.
గత ఏడాది సెప్టెంబర్ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సేఫ్ డిపాజిట్ లాకర్స్‌కు, సేఫ్ కస్టడీ ఆర్టికల్స్ సౌకర్యాలకు సంబంధించి గైడ్‌లైన్స్‌ను సవరించింది. ఈ కొత్త లాకర్ నిబంధనలు 1 జనవరి 2022 నుండి అమలులోకి వచ్చాయి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) లాకర్ ఛార్జీలు చూద్దాం..

SBI లాకర్ ఛార్జీలు
- ఎస్బీఐ స్మాల్ లాకర్ రెంటల్ ఛార్జీలు:
అర్బన్, మెట్రో అయితే రూ.2000+Gst
రూరల్, సెమీ అర్బన్ అయితే రూ.1500+Gst
- ఎస్బీఐ మీడియ్ లాకర్ రెంటల్ ఛార్జీలు:
అర్బన్, మెట్రో అయితే రూ.4000+Gst
రూరల్, సెమీ అర్బన్ అయితే రూ.3000+Gst
- ఎస్బీఐ లార్జ్ లాకర్ రెంటల్ ఛార్జీలు:
అర్బన్, మెట్రో అయితే రూ.8000+Gst
రూరల్, సెమీ అర్బన్ అయితే రూ.6000+Gst
- ఎస్బీఐ ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ రెంటల్ ఛార్జీలు:
అర్బన్, మెట్రో అయితే రూ.12000+Gst
రూరల్, సెమీ అర్బన్ అయితే రూ.9000+Gst
ఎస్బీఐ వన్ టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.500 ప్లస్ జీఎస్టీ. స్మాల్, మీడియ్ లాకర్ ఛార్జీలకు, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ ఛార్జీలు అయితే రూ.1000 ప్లస్ జీఎస్టీ.

ICICI లాకర్ ఛార్జీలు
ఐసీఐసీఐ బ్యాంకు స్మాల్ లాకర్ ఛార్జీలు రూ.1200 నుండి రూ.5000 వరకు ఉన్నాయి.
ఎక్స్‌ట్రా లాకర్ రెంట్ ఛార్జీలు రూ.10,000 నుండి రూ.22,000 వరకు ఉన్నాయి. ఇవి జీఎస్టీతో కలిపి ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు వార్షిక మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో ముందే తీసుకుంటుంది.

PNB లాకర్ ఛార్జీలు
పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) లాకర్ ఛార్జీలు 15 జనవరి నుండి పెరిగాయి. లాకర్ వార్షిక అద్దె సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.1250 నుండి రూ.10,000 వరకు ఉంది. అర్బన్, మెట్రో ప్రాంతాల్లో రూ.2000 నుండి రూ.10,000 వరకు ఉంది.