For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐదేళ్లలో బిట్ కాయిన్ జంప్ ఇలా.. ఏడాదిలోనే అదుర్స్: ఎలాన్ మస్క్ మళ్లీ.. ఆ క్రిప్టో 1000% జంప్

|

ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీ లేదా క్రిప్టో కింగ్ బిట్ కాయిన్‌ను చాలామంది బంగారానికి ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం చాలామంది డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టడం, అలాగే, ఇందుకు అనుగుణంగా వివిధ క్రిప్టో కరెన్సీలు కరోనా మహమ్మారి అనంతరం భారీగా జంప్ చేస్తున్నాయి. కరోనాకు ముందు 5000 డాలర్లుగా బిట్ కాయిన్ ఆ తర్వాత పరుగులు పెట్టింది. గత అయిదేళ్లను పరిశీలిస్తే 2016 ఇదే సమయంలో కేవలం 600 డాలర్లకు పైన మాత్రమే ఉంది.

మరుసటి ఏడాది దాదాపు పదింతలు పెరిగింది. 2017 చివరలో దాదాపు 20వేల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ తిరిగి పతనమైంది. 2018 సెప్టెంబర్ సమయానికి 6000 డాలర్లకు పడిపోయింది. అదే ఏడాది డిసెంబర్ సమయంలో 4000 డాలర్ల దిగువకు కూడా చేరుకుంది. అప్పటి నుండి క్రమంగా కోలుకుంది. 2019 జూలై, ఆగస్ట్ కాలంలో 11,000 డాలర్లు దాటినప్పటికీ, తిరిగి ఏడాది చివరకు 7000 డాలర్ల స్థాయికి పతనమైంది.

కరోనా సమయంలోనే

కరోనా సమయంలోనే

కరోనాకు ముందు అంటే 2020 మార్చిలో 5,000 డాలర్లకు కాస్త పైన ఉంది. ఈ మహమ్మారి నేపథ్యంలో అక్కడి నుండి వెనుదిరిగి చూడలేదు. ఆటుపోట్లు ఎదురైనప్పటికీ, భారీ కరెక్షన్ కనిపించినప్పటికీ కరోనా కాలంలో మాత్రం ఆకాశాన్ని అంటేలా పరుగులు పెట్టింది. బిట్ కాయిన్ గ్రాప్ చూస్తే అయిదేళ్ల కాలంలో గత ఏడాదిన్నర కాలంలోనే ఊహించని రీతిలో ఎగిసిపడింది.

2020లో 700 రెట్లకు పైగా పెరిగింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో 50,000 డాలర్ల వద్ద ప్రారంభమై, సెకండ్ వేవ్‌కు ముందు 65,000 డాలర్లకు చేరుకొని, ఆ తర్వాత భారీ కరెక్షన్‌కు గురయింది. దీంతో ఓ సమయంలో 30,000 డాలర్ల దిగువకు పడిపోయి, మళ్లీ కోలుకుంటోంది. గతవారం మళ్లీ 50,000 డాలర్లకు చేరుకున్నప్పటికీ, ఇప్పుడు 45,000 డాలర్ల స్థాయిలో ఉంది.

ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం కనిపిస్తోంది. బిట్ కాయిన్ సహా పలు క్రిప్టో కరెన్సీలు గత వారం రోజుల్లో 10 శాతం కంటే పైన పడిపోయాయి. గత కొద్దిరోజులుగా పడిపోయిన బిట్ కాయిన్ నేడు మళ్లీ పుంజుకుంది. నేడు ప్రారంభ సెషన్‌లో 1 శాతానికి పైగా లాభపడి 45,233 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఎలాన్ మస్క్ ట్వీట్ ఎఫెక్ట్

ఎలాన్ మస్క్ ట్వీట్ ఎఫెక్ట్

ఇందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి కారణమయ్యారు. గతంలో మస్క్ ట్వీట్ నేపథ్యంలో బిట్ కాయిన్ పరుగులు పెట్టింది. తాజాగా ఆయన తన పెట్ డాగ్ (పెంపుడు కుక్క) షిబా ఇను పప్పీ ఫోటోను ట్వీట్ చేశారు. ప్లోకీ హాస్ అరైవ్డ్ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ నేపథ్యంలో ఇందుకు సమాన అర్థాలు కలిగిన క్రిప్టో కరెన్సీలు జంప్ చేశాయి. ఇందులో భాగంగా బిట్ కాయిన్ కూడా ఎగిసిపడింది. ఫ్లోకీ పేరు కలిగిన షిబా ఫ్లోకీ క్రిప్టో కరెన్సీ లాభపడింది. ఇది దాదాపు 1000 శాతం(958.09 శాతం) జంప్ చేసింది. ఫ్లోకి ఇను 60 శాతం పెరిగింది.

అక్కడక్కడే... బిట్ కాయిన్

అక్కడక్కడే... బిట్ కాయిన్

బిట్ కాయిన్, సోలానా, ఎథేరియం వంటి క్రిప్టోలు 1 శాతం నుండి 7 శాతం లాభపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే ఒక శాతం పెరిగి 2.07 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 23 శాతం పెరిగింది. గతవారం బిట్ కాయిన్ 20 శాతం మేర కరెక్షన్‌కు గురయింది. గత కొద్ది రోజులుగా 44,000 డాలర్ల నుండి 46,000 డాలర్ల మధ్య కదలాడుతోంది.

బిట్ కాయిన్ నేడు ప్రారంభ సెషన్‌లో 1.3 శాతం లాభపడి 45,233 డాలర్ల వద్ద, ఎథేరియం 1 శాతం మేర ఎగిసి 3,297.09 డాలర్ల వద్ద, బియాన్స్ కాయిన్ 0.71 శాతం పెరిగి 401.26 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 0.71 శాతం పెరిగి 35.22 డాలర్ల వద్ద, సోలానా 7.14 డాలర్లు పెరిగి 168.07 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కార్డానో (0.81 శాతం), డోజీకాయిన్ (1.64 శాతం) మాత్రం నష్టపోయాయి.

English summary

ఐదేళ్లలో బిట్ కాయిన్ జంప్ ఇలా.. ఏడాదిలోనే అదుర్స్: ఎలాన్ మస్క్ మళ్లీ.. ఆ క్రిప్టో 1000% జంప్ | How bitcoin rises: Elon Musk did it again on Crypto

Cryptocurrency prices continue to be in the red on September 14. The global cryptocurrency market cap is $2.06 trillion, a 0.85 percent decrease over the last day.
Story first published: Tuesday, September 14, 2021, 12:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X