For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్ తీసుకున్నారా? అలా ముందే చెల్లిస్తే రూ.44 లక్షలు ఆదా

|

ఇంటి కోసం రుణం తీసుకున్న వారు చాలామంది తమ చేతికి డబ్బులు రాగానే ఈ రుణం మొత్తాన్ని ఒకేసారి తీర్చాలని భావిస్తారు. తద్వారా ఈఎంఐ చెల్లింపుల నుండి తప్పించుకోవాలనుకుంటారు. పర్సనల్ లోన్ లేదా వెహికిల్ లోన్ లేదా హోమ్ లోన్.. ఇలా ఏదైనా కావొచ్చు. గడువుకు ముందే మొత్తం తీర్చేయడానికి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా హోమ్ లోన్ తీర్చాలనే నిర్ణయం బాగా ఆలోచించవలసినది. హోమ్ లోన్ తీర్చడానికి సరైన లేదా మంచి సమయం ఏదైనా ఉందా? గమనించాలి.

రూ.75 లక్షల రుణం తీసుకుంటే...

రూ.75 లక్షల రుణం తీసుకుంటే...

ఉదాహరణకు మీరు 25 ఏళ్ల కాలపరిమితితో 7.5 శాతం వడ్డీ రేటుతో రూ.75 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. అప్పుడు మీరు ప్రతి నెల చెల్లించే ఈఎంఐ రూ.55,424 అవుతుంది. ఈ పాతిక సంవత్సరాల్లో చెల్లించే మొత్తం రెండింతల కంటే ఎక్కువ అవుతుంది. ఇందులో అసలు రూ.75 లక్షలతో పాటు వడ్డీ రూ.91 లక్షలకు పైగా ఉంటుంది.

హోంలోన్ వడ్డీ ఎలా ఉంటుందంటే

హోంలోన్ వడ్డీ ఎలా ఉంటుందంటే

హోమ్ లోన్ ఈఎంఐ ఎలా పని చేస్తుందో తెలుసా? మీరు తీసుకునే ప్రిన్సిపుల్ అమౌంట్, వడ్డీ మొత్తాన్ని కలిపి ఈఎంఐగా చెల్లించవలసి ఉంటుంది. ప్రారంభంలో మీ ఈఎంఐలో ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లింపులకే వెళ్తుంది. అలా మీ ప్రిన్సిపుల్ రుణం తగ్గుతున్నా కొద్ది వడ్డీ భారం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.75 లక్షల రుణం తీసుకుంటే ఏడాదికి మీరు చెల్లించే ఈఎంఐ రూ.6,65,092 అవుతుంది.

ఇందులో వడ్డీ మొత్తమే 84 శాతం ఉంటుంది. అసలు రూ.1 లక్ష పైన మాత్రమే. ఇలా వడ్డీ మొత్తం క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ప్రారంభ ఏడాదిలో ఈఎంఐ మొత్తం చెల్లింపులో 80 శాతానికి పైగా ఉన్న వడ్డీ రేటు క్రమంగా పదో ఏడాది వచ్చేసరికి 70 శాతానికి, 20వ సంవత్సరానికి 34 శాతానికి తగ్గుతుంది. అంటే మీరు ప్రారంభ సంవత్సరాల్లో చెల్లించే ఈఎంఐలలో మెజార్టీ వాటా వడ్డీదే.

రెండో ఏడాదిలో చెల్లిస్తే సగం ఆదా

రెండో ఏడాదిలో చెల్లిస్తే సగం ఆదా

కాబట్టి హోమ్ లోన్ మొత్తాన్ని చెల్లించాలనుకుంటే ప్రారంభ సంవత్సరాల్లో చెల్లించడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. మీరు 2021లో హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం. 2045 నాటికి ఇది పూర్తి అవుతుంది. జనవరి 2021లో మీ హోమ్ లోన్ ఈఎంఐ చెల్లింపు ప్రారంభిస్తే 2045 డిసెంబర్ నాటికి ముగుస్తుంది. అసలు రూ.75 లక్షలు, వడ్డీ రూ.91.2 లక్షలు అవుతుంది.

మీకు ఏదో రూపంలో రూ.15 లక్షలు వస్తే దానిని రెండో ఏడాదిలో చెల్లిస్తే కనుక మీ వడ్డీ రేటు రూ.91.2 లక్షల నుండి ఏకంగా రూ.47.1 లక్షలకు తగ్గుతుంది. అప్పుడు మీరు రూ.44 లక్షల వరకు ఆదా చేయవచ్చు. మీ హోమ్ లోన్ కూడా 2037 నాటికి ముగుస్తుంది. అంటే మీరు చెల్లించే కాలపరిమితి ఎనిమిదేళ్లు తగ్గుతుంది.

ముందు చెల్లించడం మంచిది

ముందు చెల్లించడం మంచిది

ఉదాహరణకు అదే రూ.15 లక్షలను 12వ సంవత్సరంలో చెల్లిస్తే వడ్డీ ఆదాయం రూ.91.2 లక్షల నుండి రూ.73.4 లక్షలకు తగ్గుతుంది. అప్పుడు మీరు రూ.18 లక్షలు ఆదా చేయవచ్చు. అప్పుడు 2041లో ముగుస్తుంది. కాబట్టి హోమ్ లోన్ పైన పెద్ద మొత్తాన్ని తర్వాత చెల్లించడం కంటే ముందుగా చెల్లించడం ద్వారా వడ్డీ భారం తగ్గించుకోవచ్చు.

English summary

హోమ్ లోన్ తీసుకున్నారా? అలా ముందే చెల్లిస్తే రూ.44 లక్షలు ఆదా | Home Loan: When you should save money by prepaying for home loan

Prepaying an amount earlier in the tenure is more profitable than prepaying the same amount later on.
Story first published: Friday, June 25, 2021, 15:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X