For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు ఎంతంటే?

|

పండుగ సీజన్ నేపథ్యంలో వివిధ బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రస్తుతం ఇంటి రుణాలు ఆల్ టైమ్ కనిష్టం వద్ద ఉన్నాయి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ICICI బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB), కొటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా(BoB), యస్ బ్యాంకు ఉన్నాయి. ఈ బ్యాంకులు హోమ్ లోన్స్ పైన అదిరిపోయే డిస్కౌంట్ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఎస్బీఐ మొదటిసారి క్రెడిట్ స్కోర్ లింక్డ్ హోమ్ లోన్ వడ్డీ రేటును కేవలం 6.70 శాతానికే అందిస్తోంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాదిన్నరగా ఆర్బీఐ రెపో రేటు తగ్గించింది. దీంతో రుణాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతున్నాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా భారీగానే తగ్గినప్పటికీ, ఇటీవల హోమ్ లోన్ రుణ రేటు పెంచేందుకు బ్యాంకులు మరింత డిస్కౌంట్ వడ్డీ రేటును ప్రకటిస్తున్నాయి.

ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం పండుగ ఆఫర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, సాధారణంగా రాయితీ వడ్డీ రేట్లు ఒక నిర్దిష్ట పరిమితి వరకు రుణానికి వర్తిస్తాయని, మరియు రుణ గ్రహీత వృత్తికి లింక్ చేయబడ్డాయని, ఈసారి పండుగ సీజన్‌లో కస్టమర్‌కు మరింత ప్రయోజనం కల్పిస్తూ వడ్డీ రేటును మరింతగా తగ్గించినట్లు ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టీ అన్నారు.

ఎస్బీఐ వడ్డీ రేటు 6.70 శాతం

ఎస్బీఐ వడ్డీ రేటు 6.70 శాతం

ఈసారి వడ్డీ రేటు తగ్గింపు రుణ గ్రహీత వృత్తితో సంబంధం లేకుండా, అన్ని రంగాల్లోని రుణ గ్రహీతలకు వర్తిస్తుందని, రుణ మొత్తంతో కూడా సంబంధం లేకుండా వడ్డీ రేటు అందరికీ సమానంగా ఉంటుందని, క్రెడిట్ లింక్డ్ వడ్డీ రేటు 6.70 శాతంతో అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వడ్డీ రేటు బ్యాలెన్స్ ట్రాన్సుఫర్‌కు కూడా వర్తిస్తుందని తెలిపారు. జీరో ప్రాసెసింగ్ ఫీజు, కన్సెషనల్ వడ్డీ రేటు పండుగ సమయంలో చాలామంది సరసమైన ధరలకే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టీ అన్నారు.

PNB వడ్డీ రేటు 6.60 శాతం

PNB వడ్డీ రేటు 6.60 శాతం

పంజాబ్ నేషనల్ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటును తగ్గించింది. రూ.50 లక్షలకు మించిన హోమ్ లోన్ పైన వడ్డీ రేటును 0.50 శాతం మేర తగ్గించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.60 శాతంగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అత్యంత తక్కువ వడ్డీ రేటు ఉన్నది పంజాబ్ నేషనల్ బ్యాంకులోనే.

ప్రయివేటు బ్యాంకుల వడ్డీ రేట్లు

ప్రయివేటు బ్యాంకుల వడ్డీ రేట్లు

కొటక్ మహీంద్రా బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు 6.50 శాతానికి తగ్గించింది. మరో ప్రయివేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు కూడా హోమ్ లోన్ వడ్డీ రేటును 6.70 శాతానికి తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1000 నుండి ప్రారంభం అవుతుంది. ఇతర బ్యాంకుల నుండి బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు.

యస్ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం నుండి ప్రారంభమవుతోంది. అయితే ఈ తగ్గింపు వడ్డీ రేటు పరిమిత కాలం మాత్రమే. 90 రోజులలో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. మహిళా రుణ గ్రహీతలకు మరో 0.05 శాతం (వడ్డీ రేటు 6.65 శాతం) తగ్గుతుంది.

HDFC బ్యాంకు పరిమిత కాలం పండుగ ఆఫర్ ఇస్తోంది. ఈ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు పండుగ ఆఫర్ కింద 6.70 శాతానికి తగ్గించింది.

వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు

వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు

రుణ మొత్తం రూ.30 లక్షలు, కాల వ్యవధి 20 సంవత్సరాలకు వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

కొటక్ మహీంద్రా - వడ్డీ రేటు 6.5 శాతం నుండి 7.20 శాతం - ఈఎంఐ రూ.22,367 నుండి రూ.23,620 - ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 2 శాతం ప్లస్ జీఎస్టీ.

పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేటు 6.55 శాతం నుండి 8.60 శాతం - ఈఎంఐ రూ.22,456 నుండి రూ.26,225 - ప్రాసెసింగ్ ఫీజు డిసెంబర్ 31 వరకు మినహాయింపు

ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేటు 6.7 శాతం నుండి 7.55 శాతం - ఈఎంఐ రూ.22,722 నుండి రూ.24,260 - ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.5 శాతం నుండి 2 శాతం. గరిష్టంగా రూ.2000.

HDFC వడ్డీ రేటు 6.70 శాతం నుండి 7.65 శాతం - ఈఎంఐ రూ.22,722 నుండి రూ.24,444 - ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 1.5 శాతం, గరిష్టంగా రూ.4500 ప్లస్ ట్యాక్సెస్.

IDBI బ్యాంకు వడ్డీ రేటు 6.75 శాతం నుండి 10.05 శాతం - ఈఎంఐ రూ.22,811 నుండి రూ.29,951 - ప్రాసెసింగ్ ఫీజు రూ.20,000 ప్లస్ ట్యాక్సెస్.

యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేటు 6.75 శాతం నుండి 7.10 శాతం - ఈఎంఐ రూ.22,811 నుండి రూ.23,439 - ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 1 శాతం వరకు, కనిష్టం రూ.10,000.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.75 శాతం నుండి 8.00 శాతం - ఈఎంఐ రూ.22,811 నుండి రూ.25,093 - ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.4 శాతం, కనిష్టం రూ.10,000 గరిష్టం రూ.30,000.

బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 6.75 శాతం నుండి 8.10 శాతం - ఈఎంఐ రూ.22,811 నుండి రూ.25,280 - ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.5 శాతం వరకు, కనిష్టం రూ.8500, గరిష్టం రూ.25,000.

యూనియన్ బ్యాంక్ వడ్డీ రేటు 6.80 శాతం నుండి 8.40 శాతం - ఈఎంఐ రూ.22,900 నుండి రూ.23,985 - ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.5 శాతం, గరిష్టంగా రూ.15,000 ప్లస్ జీఎస్టీ.

ఇండియన్ బ్యాంకు వడ్డీ రేటు 6.80 శాతం నుండి రూ.7.20 శాతం - ఈఎంఐ రూ.22,900 నుండి రూ.24,907 - ప్రాసెసింగ్ ఫీజు రూ.కోటి వరకు 0.4 శాతం, గరిష్టం రూ.20,000.

English summary

వివిధ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు ఎంతంటే? | Home loan rates are at an all time low: SBI, ICICI, BoB, Kotak bank offers

Ahead of the festive season, India's top lenders SBI, ICICI Bank, PNB, Kotak Mahindra, BoB and Yes Bank is offering a lucrative discount on home loan interest rates.
Story first published: Monday, October 4, 2021, 15:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X