For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా? ఏ బ్యాంకులో వడ్డీ రేటు, ఫీజు తక్కువో తెలుసుకోండి?

|

గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించి, ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తున్నాయి. మీరు హోమ్‌లోన్ తీసుకోవాలనుకుంటే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లింక్ట్ రేట్లను ఎంచుకోవచ్చు. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో దాదాపు అన్ని బ్యాంకులు కూడా తమ బాహ్య బెంచ్ మార్క్ లింక్డ్ రేట్లను ప్రారంభించాయి. ఇవి ఎక్కువగా రెపో రేటుతో ముడివడి ఉన్నాయి.

3 నెలల్లో అమెరికా పౌరసత్వం? ధనిక భారతీయులు ఈ మార్గంలో వెళ్తున్నారు3 నెలల్లో అమెరికా పౌరసత్వం? ధనిక భారతీయులు ఈ మార్గంలో వెళ్తున్నారు

అలా భారీ సేవింగ్‌కు అవకాశం

అలా భారీ సేవింగ్‌కు అవకాశం

ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ రేట్లు ఒకే రెపో రేటుతో అనుసంధానించినప్పటికీ బ్యాంకుల మార్జిన్లు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వడ్డీ రేట్లలో స్వల్ప తేడాలు ఉంటాయి. కాబట్టి మీరు హోమ్ లోన్ తీసుకోవడానికి ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకోవాలి. హోమ్ లోన్స్ దీర్ఘకాలం ఉంటాయి. కాబట్టి వడ్డీ రేట్లలో 20 బేసిస్ పాయింట్ల వ్యత్యాసం కూడా మీ రుణకాలంలో భారీ సేవింగ్స్‌కు అవకాశం ఏర్పడుతుంది.

వడ్డీ రేటు.. ప్రాసెసింగ్ ఫీజు

వడ్డీ రేటు.. ప్రాసెసింగ్ ఫీజు

వడ్డీ రేటు మాత్రమే కాకుండా ప్రాసెసింగ్ ఫీజులు కూడా బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వివిధ బ్యాంకుల్లోని ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ రేటును పోల్చుకోవాలి. టాప్ బ్యాంకులైన ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటివి ఇచ్చే వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజు తెలుసుకుందా...

SBI- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్ అందిస్తోంది. వడ్డీ రేటు మీ ప్రొఫైల్ (శాలరైడ్ లేదా బిజినెస్ క్లాస్), క్రెడిట్ స్కోర్, హోమ్ లోన్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది.

- SBI హోమ్ లోన్ వడ్డీ రేటు 7.95 శాతం నుండి 8.55 శాతం వరకు ఉంది.

- ప్రాసెసింగ్ ఫీజు 0.40 శాతం వరకు ఉంది. GST అదనం.

- కొన్ని సందర్భాలలో ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేస్తాయి.

PNB-పంజాబ్ నేషనల్ బ్యాంకు

PNB-పంజాబ్ నేషనల్ బ్యాంకు

- పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేటు 7.95 శాతం నుండి ప్రారంభమవుతుంది. 9.35 శాతం వరకు ఉంది.

- అకౌంట్ ప్రొఫైల్, క్రెడిట్ స్కోర్, లోన్ అమౌంట్‌ను బట్టి వడ్డీ రేటు ఉంటుంది.

- లోన్ అమౌంట్ పైన 0.35 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.

- ప్రాసెసింగ్ ఫీజు కనీసం రూ.2000, గరిష్టం రూ.15,000. GST అదనం.

HDFC- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

HDFC- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు 8 శాతం నుండి 8.50 శాతం మధ్య ఉంది.

- రూ.30 లక్షల వరకు హోమ్ లోన్‌పై తక్కువ వడ్డీ రేట్లు, రూ.50 లక్షల కంటే పై హోమ్ లోన్‌కు ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి.

- మార్చి 31వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేసింది.

ICICI- ఐసీఐసీఐ బ్యాంకు

ICICI- ఐసీఐసీఐ బ్యాంకు

- ఐసీఐసీఐ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.25 శాత నుండి 9.35 శాతం మధ్య ఉన్నాయి.

- రూ.35 లక్షల వరకు హోమ్ లోన్‌పై 8.25 శాతం వడ్డీ రేటు

- రూ.35 లక్షల నుండి రూ.75 లక్షల లోన్‌పై 8.40 శాతం వడ్డీ రేటు

- ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం. గరిష్టంగా రూ.5,000 ఉంది.

English summary

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా? ఏ బ్యాంకులో వడ్డీ రేటు, ఫీజు తక్కువో తెలుసుకోండి? | Home Loan interst rates, processing fees compared for SBI, PNB, ICICI Bank, HDFC

Here is a comparison of interest rates and processing fees charged by top lenders SBI, PNB, ICICI Bank and HDFC.
Story first published: Wednesday, March 4, 2020, 12:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X