For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే మంచి ఛాన్స్: ఏ బ్యాంకులో ఎంతంటే?

|

కరోనా మహమ్మారి సమయంలో లోన్ మార్కెట్ పడిపోయింది. కరోనా కాలంలో వడ్డీ రేట్లను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. పాలసీపరమైన రిలాక్సేషన్స్, వడ్డీ రేట్లు పదేళ్ళ కనిష్టానికి తగ్గించడం, ఎకానమీలోకి క్యాష్ ఇన్-ఫ్యూషన్ వంటి చర్యలు చేపట్టింది. కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి అనువైన చర్యలు తీసుకుంది. అలాగే, ప్రజలు పెద్ద కొనుగోళ్లు జరిపి, రికవరీకి ఊతమిచ్చే విధానపరమైన చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. ఈ వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా SBI, ICICI బ్యాంకు, PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా వివిధ తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్‌ను అందిస్తున్నాయి. ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ రేటుకు అందిస్తున్నాయో కింద చూద్దాం.

ఎస్బీఐ వడ్డీ రేటు

ఎస్బీఐ వడ్డీ రేటు

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) హోమ్ లోన్ వడ్డీ రేటును భారీగా తగ్గించింది. క్రెడిట్ లింక్డ్ హోమ్ లోన్స్ 6.70 శాతం నుండి ప్రారంభమవుతున్నాయి. రుణ మొత్తంతో సంబంధం లేకుండా ఈ వడ్డీ రేటు ఉంటుంది. ఇదివరకు రూ.75 లక్షల హోమ్ లోన్ పైన రుణగ్రహీతకు వడ్డీ రేటు 7.15 శాతంగా ఉండేది. ఇప్పుడు వడ్డీ రేటు తగ్గింది. అంతేకాదు, ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు. బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ కేసులోను ఈ తగ్గింపు వడ్డీ రేటు వర్తిస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు

పంజాబ్ నేషనల్ బ్యాంకు

పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా హోమ్ లోన్ వడ్డీ రేటును తగ్గించింది. పండుగ సమయంలో వివిధ బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేటును తగ్గించాయి. ఇందులో భాగంగా PNB రూ.50 లక్షల వరకు రుణంపై వడ్డీ రేటును 0.50 శాతం తగ్గించింది. దీంతో వడ్డీ రేటు 6.60 శాతంగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు అందించే హోమ్ లోన్ వడ్డీ రేట్లలో అతి తక్కువ వడ్డీ రేటు కలిగి ఉన్నది PNB కావడం గమనార్హం.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంకు ఆఫ్ బరోడా ప్రత్యేక ఆఫర్ కింద హోమ్ లోన్ వడ్డీ రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్, కారు లోన్ పైన 0.25 శాతం వరకు మాఫీ ప్రయోజనాన్ని కల్పిస్తోంది. అదనంగా ఈ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. కొత్త హోమ్ లోన్స్ పైన వడ్డీ రేటు 6.75 శాతం నుండి అందిస్తోంది.

యస్ బ్యాంకు

యస్ బ్యాంకు

ప్రస్తుత పండుగ సమయంలో యస్ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటును 6.7 శాతానికి తగ్గించింది. ఈ బ్యాంకు ప్రత్యేక 90 రోజుల ఆఫర్ కింద అదనంగా 0.05 శాతం వడ్డీ రేటు ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. ఈ సౌకర్యాన్ని ఉద్యోగం కలిగిన మహిళా హోమ్ బయ్యర్స్‌కు అందిస్తోంది. దీంతో వడ్డీ రేటు 6.65 శాతంగా మాత్రమే ఉండనుంది.

కొటక్ మహీంద్రా బ్యాంకు

కొటక్ మహీంద్రా బ్యాంకు

కొటక్ మహీంద్రా బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు 6.50 శాతం నుండి ప్రారంభం అవుతుంది. పండుగ నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని సెప్టెంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 8వ తేదీ వరకు కల్పిస్తోంది.

ICICI బ్యాంకు

ICICI బ్యాంకు

ఐసీఐసీఐ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.70 శాతం నుండి ప్రారంభం అుతున్నాయి. కొత్తగా హోమ్ లోన్ తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు రూ.1100 మాత్రమే. ఇతర బ్యాంకుల్లో హోమ్ లోన్ కలిగిన వారు మిగతా బ్యాలెన్స్‌ను ట్రాన్సుఫర్ చేసుకుంటే కూడా ఈ తగ్గింపు ప్రయోజనం ఉంటుంది.

బ్యాంకు ఆఫ్ ఇండియా

బ్యాంకు ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BoI) హోమ్ లోన్ వడ్డీ రేటును అలాగే, కారు లోన్ వడ్డీ రేటును తగ్గించింది. పండుగ సందర్భంగా వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వెహికిల్ లోన్ వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.50 శాతం నుండి ప్రారంభమవుతుంది. అంతకుముందు ఇది 6.85 శాతంగా ఉంది. వాహన రుణం పైన 6.85 శాతంగా ఉంది. అంతకుముందు ఇది 7.35 శాతంగా ఉంది.

పండుగను దృష్టిలో పెట్టుకొని పలు బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు హోమ్ లోన్ నుండి పర్సనల్ లోన్ వరకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇతర రుణాల వడ్డీ రేట్లతో పోలిస్తే హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు ఎప్పుడు తక్కువగా ఉంటాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు మరింతగా పడిపోయాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు దశాబ్దాల కనిష్టానికి తగ్గాయి.

కరోనా మహమ్మారి నేపథ్యంలో రియాల్టీ మాత్రమే కాదు.. అన్నింటా డిమాండ్ పడిపోయింది. ఓ వైపు ఆర్థిక రికవరీ కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మరోవైపు పండుగ సీజన్ నేపథ్యంలో సేల్స్ పెంచుకోవడానికి, తద్వారా డిమాండ్ పెరగడానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు వివిధ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తాయి. తాజాగా బజాజ్ ఫైనాన్స్ హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ మేరకు బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ ఇటీవల ఓ ప్రకటన చేసింది. హోమ్ లోన్ పైన వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. శాలరైడ్, ప్రొఫెషనల్స్‌కు వడ్డీ రేటు 6.70 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఇదివరకు ఈ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది.

అంటే వడ్డీ రేటు 0.05 శాతం తక్కువగా ఉంది. రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారి క్రెడిట్ స్కోర్ బాగుంటే, ఆదాయానికి సంబంధించిన ప్రొఫైల్ కూడా బాగుంటే ఈ ప్రమోషనల్ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ రేటుతో వారి ఈఎంఐ నెలకు ప్రతి లక్ష రూపాయలకు రూ.645 మాత్రమే అవుతుంది.

English summary

హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే మంచి ఛాన్స్: ఏ బ్యాంకులో ఎంతంటే? | Home Loan Interest Rate at All time Low: Latest rates by SBI, ICICI Bank, Kotak Mahindra

The loan market in India has witnessed a substantial dip in interest rates after the Reserve Bank of India relaxed policies and cut down its rates for infusion of cash into the economy.
Story first published: Monday, October 18, 2021, 14:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X