For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది మీకు తెలుసా: హోమ్‌లోన్ వడ్డీ రేటు తగ్గించుకోండి ఇలా, ఇవి గుర్తుంచుకోండి..

|

మీరు హోమ్ లోన్ తీసుకున్నారా? ఈఎంఐ క్రమంగా చెల్లిస్తున్నారా? హోమ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలను చూస్తారు. లోన్ తీసుకున్న తర్వాత ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తారు. ఈఎంఐ ప్రక్రియ సాఫీగా సాగిపోతుందని భావిస్తారు. కానీ ఈ సమయంలోనూ ప్రయోజనకర అంశాలు ఉంటాయని తెలుసా? హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ లాభదాయకంగా ఉంటుంది.

ఒక్కరోజే రూ.1,000 పెరిగి, నేడు తగ్గిన బంగారం ధర: ధర పెరిగేందుకు దారి తీసే కారణాలుఒక్కరోజే రూ.1,000 పెరిగి, నేడు తగ్గిన బంగారం ధర: ధర పెరిగేందుకు దారి తీసే కారణాలు

తక్కువ వడ్డీ రేటు లేదా సులభ ఈఎంఐ ఉంటే..

తక్కువ వడ్డీ రేటు లేదా సులభ ఈఎంఐ ఉంటే..

మీరు హోమ్ లోన్ తీసుకుంటే రుణాలు ఇచ్చే బ్యాంకులు.. మీ క్రెడిట్ స్కోర్, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే పీరియడ్ వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. హోమ్ లోన్ తీసుకున్న తర్వాత కొంతమంది.. మరో బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు లేదా సులభ ఈఎంఐ ఉందని భావించే సందర్భాలు ఉంటాయి. అలాంటి సమయంలో హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ లేదా రీఫైనాన్సింగ్ గురించి ఆలోచిస్తారు.

ప్రతి బ్యాంకులో ట్రాన్సుఫర్ వెసులుబాటు!

ప్రతి బ్యాంకులో ట్రాన్సుఫర్ వెసులుబాటు!

ఏదేని ఓ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకొని ఈఎంఐ చెల్లిస్తుంటే.. ప్రస్తుత ఈఎంఐ కంటే కొంత తక్కువ ఈఎంఐ ఉండే మరో బ్యాంకుకు మీ లోన్ ట్రాన్సుఫర్ చేసుకోవడమే ఇది. మొదటి బ్యాంకులో ఇంకా మిగిలి ఉన్న మొత్తాన్ని రెండో బ్యాంకుకు ట్రాన్సుఫర్ చేస్తారు. దాదాపు ప్రతి బ్యాంకులో హోమ్ లోన్ ట్రాన్సుఫర్ వెసులుబాటు ఉంది.

అలాంటి కస్టమర్లను నిలుపుకునేందుకే బ్యాంకుల మొగ్గు

అలాంటి కస్టమర్లను నిలుపుకునేందుకే బ్యాంకుల మొగ్గు

రుణగ్రహీతగా మీకు అర్హత ఉంటే.. ప్రయోజనం ఉంటుందనుకుంటే మీరు మీ గృహ రుణాన్ని ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు బ్యాంకులు ఈఎంఐలు సరిగ్గా చెల్లించే కస్టమర్లను నిలుపుకునే ప్రయత్నాలు చేస్తాయి. కాబట్టి మీ క్రెడిట్ స్కోర్, ఇతర అంశాల ఆధారంగా సాధ్యమైనంత తక్కువగా ఇవ్వవచ్చు.

వడ్డీ రేటును మరోసారి పరిశీలించమని అడగవచ్చు..

వడ్డీ రేటును మరోసారి పరిశీలించమని అడగవచ్చు..

మీరు ఈఎంఐలను సక్రమంగా చెల్లిస్తూ, ట్రాక్ రికాడ్ లేదా క్రెడిట్ స్కోర్ బాగుంటే కొద్ది కాలానికి మీ వడ్డీ రేటును పరిశీలించమని బ్యాంకులో అడగవచ్చు. నిబంధనలపై చర్చించవచ్చు.

అలాంటి సమయంలో మరో బ్యాంకుకు..

అలాంటి సమయంలో మరో బ్యాంకుకు..

ప్రస్తుతం మీరు చెల్లిస్తున్న వడ్డీ రేటు ఎక్కువగా అనిపించి, మరో బ్యాంకు తక్కువకు అందిస్తుందని మీరు భావించడం లేదా ప్రస్తుత బ్యాంకు రుణాన్ని సమీక్షించని పరిస్థితుల్లో మీరు ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు. వడ్డీ రేటు తగ్గుదలతో పాటు రివైజ్డ్ రీపేమెంట్ టర్మ్స్, ప్రీఅప్రూవ్డ్ ఆఫర్స్, మెరుగైన సేవల అంశాల ఆధారంగా కూడా హోమ్ లోన్ బదలీని ఎంచుకోవచ్చు.

భారం తగ్గి.. ఆదా చేసుకోవచ్చు

భారం తగ్గి.. ఆదా చేసుకోవచ్చు

వడ్డీ రేట్లలో మార్పులు, మీ ఖర్చులు, మీ అవసరాల ఆధారంగా రుణ బదలీ చేసుకోవచ్చు. ఎక్కువమంది హోమ్ లోన్ ట్రాన్సుఫర్‌ను ఎంచుకోవడానికి వడ్డీ రేటు తగ్గుదల-ఈఎంఐ భారం తగ్గడం. మరో బ్యాంకు తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇచ్చిన సందర్భంలో మార్పు కోరుకుంటారు. ఈఎంఐ తగ్గితే మీ నెల భారం తగ్గడంతో పాటు హోమ్ లోన్ పూర్తయ్యే సమయానికి మీరు పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు.

రీపేమెంట్ ఛార్జీలు ఉంటాయి..

రీపేమెంట్ ఛార్జీలు ఉంటాయి..

ప్రతి బ్యాంకులో దాదాపు వేర్వేరు రీపేమెంట్ నిబంధనలు, షరతులు ఉండే అవకాశాలు ఉంటాయి. మీ లోన్ మొత్తాన్ని ముందే చెల్లించాలనుకుంటే కొన్ని బ్యాంకులు ఛార్జ్ చేస్తాయి. హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ అంశంలో ఇది కూడా పరిశీలించే అంశం. రెండు బ్యాంకులను బేరీజు వేసుకొని, మీకు ఏది సాధ్యమైతే దానిని ఎంచుకోవచ్చు.

పరోక్ష ప్రయోజనాలు

పరోక్ష ప్రయోజనాలు

హోమ్ లోన్ అంశాల్లో వడ్డీ రేటు, ఈఎంఐ, బెట్టర్ రీపేమెంట్స్ నిబంధనల వంటి ప్రత్యక్ష ప్రయోజనాలతో పాటు పరోక్ష ప్రయోజనాలు కూడా ఉంటాయి. హోమ్ లోన్ ట్రాన్సుఫర్ చేసుకుంటే బ్యాంకులు పరోక్ష ప్రయోజనం అందిస్తాయి. కొన్ని బ్యాంకులు టాపప్ లోన్స్ ఇస్తాయి. అదనపు మనీ అవసరమైన సమయంలో ఇది ప్రయోజనకరం.

డిస్కౌంట్లు, ఇతర స్కీంలు

డిస్కౌంట్లు, ఇతర స్కీంలు

కొన్నిసార్లు బ్యాంకులు రుణదాతలను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, ఇతర స్కీంలు ప్రవేశ పెడతాయి. రుణ బదలీ కోసం ఇలాంటి విండోను ఎంచుకోవచ్చు. అయితే రుణ బదలీకి ఏదో ఒకటే కారణం కాకుడదని కూడా నిపుణులు సూచిస్తున్నారు. మల్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు.

చివరగా ఇది గుర్తుంచుకోండి..

చివరగా ఇది గుర్తుంచుకోండి..

మీ హోమ్ లోన్ రీపేమెంట్ బ్యాలెన్స్ షీట్ సరిగ్గా ఉండాలి. అప్పుడే హోమ్ లోన్ ట్రాన్సుఫర్ సరైన నిర్ణయంగా భావించవచ్చు. మరో విషయం వడ్డీ రేటు తక్కువకు వస్తుందని పదేపదే బ్యాంకులను మార్చుకోకూడదు. ఎందుకంటే ప్రీపేమెంట్, ట్రాన్సుఫర్, ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉంటాయి.

English summary

ఇది మీకు తెలుసా: హోమ్‌లోన్ వడ్డీ రేటు తగ్గించుకోండి ఇలా, ఇవి గుర్తుంచుకోండి.. | home loan balance transfer can benefit you

A home loan balance transfer can be a profitable if you meet certain requirements. Experts often suggest a cost-benefit analysis before making the decision of transferring your home loan to another lender.
Story first published: Tuesday, February 25, 2020, 13:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X