For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: బంగారం ధరలు తగ్గాయి, అదే దారిలో వెండి

|

బంగారం, వెండి ధరలు నేడు (జూలై 12, సోమవారం) ప్రారంభ సెషన్‌లో క్షీణించాయి. వెండి కూడా అదే బాటలో నడిచింది. బంగారం రూ.47,750 దిగువనకు రాగా, వెండి రూ.69,000 స్థాయిలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గినప్పటికీ 1800 డాలర్లకు పైనే ఉంది. వెండి 26 డాలర్ల పైన కదలాడుతోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గినప్పటికీ, డెల్టా వేరియంట్ వైరస్ కారణంగా కొన్ని దేశాల్లో బంగారానికి మద్దతు లభిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఆర్థిక రికవరీ ఆందోళనలు కూడా నెలకొన్నాయి. దీంతో బంగారం ధరలు అక్కడ పెరుగుతున్నాయి. ఈ ప్రభావం క్రమంగా ఇతర ప్రాంతాలపై పడుతుంది.

తగ్గినా.. దాదాపు స్థిరంగా

తగ్గినా.. దాదాపు స్థిరంగా

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పది గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.206.00 (-0.43%) తగ్గి రూ.47717.00 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.167.00 (-0.35%) తగ్గి రూ.47991.00 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు నేడు ఉదయం కేవలం రూ.100 మధ్య మాత్రమే పైకి కిందకు కదలాడింది. అంటే కాస్త తగ్గినప్పటికీ దాదాపు స్థిరంగా ఉందని భావించవచ్చు. ఇక, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.267.00 (-0.39%) తగ్గి రూ.69030.00 వద్ద, డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.250.00 (-0.35%) క్షీణించి రూ.70350.00 వద్ద ట్రేడ్ అయింది. వెండి కూడా నేడు రూ.100 మధ్యనే పైకి, కిందకు కదలాడుతోంది.

బంగారం ఈ వారం ఎలా ఉండవచ్చు

బంగారం ఈ వారం ఎలా ఉండవచ్చు

ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.48,130 పైకి చేరుకుంటే మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రూ.47,600 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని కొనుగోలు చేయవచ్చు. అలాగే రూ.47,580 కంటే దిగువకు వస్తే మాత్రం మరింత పడిపోవచ్చు. సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ.68,120 కంటే దిగువన ట్రేడ్ అయితే రూ.67,553కు పడిపోవచ్చు

గోల్డ్ ఫ్యూచర్స్...

గోల్డ్ ఫ్యూచర్స్...

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ -7.35 (0.41%) డాలర్లు తగ్గి 1803.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 1,802.40 - 1,810.90 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ సెప్టెంబర్ 0.106 (0.40%) డాలర్లు తగ్గి 26.128 డాలర్ల వద్ద కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1810 డాలర్ల వద్ద కదలాడింది.

English summary

Gold price today: బంగారం ధరలు తగ్గాయి, అదే దారిలో వెండి | Gold price today: Yellow metal under pressure after delta COVID variant

Gold prices were supported by rising worries over fast spreading of Delta variant virus in some parts of the world.
Story first published: Monday, July 12, 2021, 10:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X