For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం టార్గెట్ ధర రూ.56,500, ధరలు పైపైకి చేరుకోవచ్చు

|

బంగారం ధరలు మే నెలలో దాదాపు 7 శాతం ఎగిశాయి. గత నెలలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు 1765 డాలర్ల నుండి 1913 డాలర్ల మధ్య కదలాడాయి. గత నాలుగు నెలల కాలంలో ఇది గరిష్టం. ఇక వెండి కూడా 25.85 డాలర్ల నుండి 28.89 డాలర్ల మధ్య కదలాడింది. అమెరికా ట్రెజరీ యీల్డ్స్, యూఎస్ డాలర్ మార్పులకు అనుగుణంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి భారీ ఆర్థిక ప్యాకేజీ వచ్చి పడుతోంది. అలాగే అగ్రరాజ్యంలో వడ్డీ రేట్లు దాదాపు జీరో స్థాయిలోనే ఉన్నాయి. ఈ ప్రభావం సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఉంటోంది.

బ్యాడ్-లాగా మార్చేసిన బీజేపీ, idea of GST: RIP: చిదంబరం 10 పాయింట్స్...బ్యాడ్-లాగా మార్చేసిన బీజేపీ, idea of GST: RIP: చిదంబరం 10 పాయింట్స్...

బంగారం ధరలు పెరగవచ్చు

బంగారం ధరలు పెరగవచ్చు

బంగారం ధరలు ఈ వారం కూడా కాస్త పైపైకి చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం ధర 2050కి చేరుకునే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఆ తర్వాత 2250 డాలర్లకు చేరుకుంటుందని అంటున్నారు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో టార్గెట్ ధర రూ.50,500. ఆ తర్వాత రూ.56,500.

నిన్న, నేడు ధరలు

నిన్న, నేడు ధరలు

భారత్‌లో ఇటీవల బంగారం ధ‌ర‌ల్లో భారీ హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తున్నాయి. శ‌నివారం భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లో ఆదివారం మ‌ళ్లీ పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం దాదాపు రూ.400 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.47,100, 24 క్యారెట్ల బంగారం రూ.51,250గా ఉంది. శనివారం 22 క్యారెట్ల బంగారం రూ.46,700, 24 క్యారెట్ల బంగారం రూ.50900గా ఉంది.

హైదరాబాద్‌లో ధర

హైదరాబాద్‌లో ధర

హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 45,900, 24 క్యారెట్ల పసిడి రూ.50,070, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరలు 45,900, 24 క్యారెట్ల పసిడి రూ.50,070, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధరలు 45,900, 24 క్యారెట్ల పసిడి రూ.50,070, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధరలు 46,150, 24 క్యారెట్ల పసిడి రూ.50,350 గా ఉంది.

English summary

బంగారం టార్గెట్ ధర రూ.56,500, ధరలు పైపైకి చేరుకోవచ్చు | Gold may continue to trade with a positive bias, target Rs 56,500

Gold prices rose nearly 7 per cent in May, marking the second green candle for the year so far. The yellow metal traded with high volatility in the range of $1,765 to $1,913, and marked the highest level in four and half months.
Story first published: Sunday, June 6, 2021, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X