For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రభుత్వం కీలక నిర్ణయం, ఈ స్టాక్స్ 15% రిటర్న్స్ ఇచ్చే అవకాశం

|

ఇటీవల పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీగా పెరిగాయి. దీంతో గ్యాస్ సంబంధిత స్టాక్స్ ఇటీవల జంప్ చేస్తున్నాయి. గ్యాస్ సంబంధిత స్టాక్స్ పరుగులు పెడుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ధరలు పెరగడం కలిసి వస్తోంది. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్(ATGL) కంప్రెస్డ్ నేచరల్ గ్యాస్(CNG), పైప్డ్ నేచరల్ గ్యాస్(PNG) ధరలను పెంచింది. రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్ కస్టమర్లకు ఇది భారంగా మారుతుంది.

అహ్మదాబాద్ కేంద్రంగా పని చేసే గ్యాస్ రిటైలర్ ATGL. అహ్మదాబాద్‌లో సీఎన్జీ గ్యాస్ ధరను కిలోకు రూ.2.56 పెంచడంతో రూ.58.86గా ఉంది. అక్టోబర్ 2వ తేదీ నుండి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ కంపెనీ ఇతర ప్రాంతాల్లోను ధరలను పెంచింది. వడోదర, ఖేడా, సురేంద్రనగర్, నవ్‌సారి, పోర్‌బందర్‌లలోను ధరలు పెంచింది. అహ్మదాబాద్‌లో డొమెస్టిక్ పీఎన్జీ లేదా పైప్డ్ నేచరల్ గ్యాస్ ధర రూ.2.03 (స్టాండర్డ్ క్యూబిక్ మీటర్) పెరిగి రూ.32.40కి చేరుకుంది. అంతకుముందు ఈ ధర రూ.30.37గా ఉంది.

అందుకే ధరల పెంపు

అందుకే ధరల పెంపు

అదానీ గ్రూప్ కంపెనీ ఇటీవల ఇండస్ట్రియల్, కమర్షియల్ పీఎన్జీ ధరలను వరుసగా రూ.5, రూ.8 పెంచింది. ఇండస్ట్రియల్ టారిఫ్ (స్టాండర్డ్ క్యూబిక్ మీటర్) రూ.41.04 నుండి రూ.46.04కు, కమర్షియల్ పీఎన్జీ రూ.56.22 నుండి రూ.64.22కు పెరిగింది. ఇటీవల ప్రభుత్వం డొమెస్టిక్ ప్రొడ్యూస్డ్ నేచరల్ గ్యాస్ పెంచింది. అక్టోబర్ 1, 2021 నుండి మార్చి 31,2021 కాలానికి ఈ పెంపు వర్తిస్తుంది. డొమెస్టిక్ నేచరల్ గ్యాస్ ధర ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 1.79 డాలర్లు (పర్ మిలియిన్ బ్రిటిష్ థెర్మల్ యూనిట్స్) పెరిగింది.

అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ ధరలు పెంచినట్లుగా ఇతర గ్యాస్ సంస్థలు గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ వంటివి కూడా ధరలుపెంచవచ్చు.

15 శాతం వరకు రిటర్న్స్

15 శాతం వరకు రిటర్న్స్

ప్రభుత్వం నేచరల్ గ్యాస్ ధరల పైన 62 శాతం టారిఫ్ హైక్ ప్రకటించిన అనంతరం గత శుక్రవారం గ్యాస్ రంగంలోని స్టాక్స్ భారీగా జంప్ చేశాయి. డొమెస్టిక్ ప్రొడ్యూస్డ్ నేచరల్ గ్యాస్ ధరలు 2.9 డాలర్లు (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్) పెంచింది. దీంతో అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర గత సెషన్‌లో 0.06 శాతం లాభపడింది. ఓ సమయంలో రూ.1433ను తాకింది. అదానీ టోటల్ గ్యాస్ ఐదు సెషన్‌లలో దాదాపు రెండు శాతం, ఈ క్యాలెండర్ ఏడాదిలో దాదాపు 300 శాతం లాభపడింది.

గెయిల్ స్టాక్ ధర చివరి సెషన్‌లో 2.30 శాతం లాభపడి రూ.162.50 వద్ద ముగిసింది. ఈ క్యాలెండర్ ఏడాదిలో 31 శాతానికి పైగా, ఐదు సెషన్లలో దాదాపు 5 శాతం లాభపడింది.

పెట్రోనెట్ స్టాక్ మాత్రం క్రితం సెషన్‌లో 1.49 శాతం తగ్గింది. గత ఐదు సెషన్‌లలో 0.09 శాతం, ఈ క్యాలెండర్ ఏడాదిలో దాదాపు ఆరు శాతం క్షీణించింది. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఈ స్టాక్స్ మరింత పుంజుకోవచ్చునని, 15 శాతం వరకు రిటర్న్స్ ఇవ్వవచ్చునని అంచనా.

గ్యాస్ స్టాక్స్

గ్యాస్ స్టాక్స్

భారత్‌లో టాప్ 10 పెట్రోలియం స్టాక్స్‌ను పరిశీలిస్తే ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, గెయిల్, పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ, హెచ్‌పీసీఎల్, ఎల్జీఎల్, అదానీ గ్యాస్, గుజరాత్ గ్యాస్, జీఎస్పీఎల్ ఉన్నాయి.

English summary

ప్రభుత్వం కీలక నిర్ణయం, ఈ స్టాక్స్ 15% రిటర్న్స్ ఇచ్చే అవకాశం | Gas stocks in focus, May up 15 percent: Adani raises CNG and PNG prices

Shares of gas related sector were in focus on Friday after the government announced a 62 per cent hike in natural gas price for the second half of the fiscal year.
Story first published: Sunday, October 3, 2021, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X