For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్: ఐటీఆర్ అవసరం లేదు.. వారికి ఐటీ శాఖ భారీ ఊరట

|

ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను సెప్టెంబర్ చివరి నాటికి ఫైల్ చేయాల్సి ఉంది. కరోనా మహమ్మారి, కొత్త ఐటీ పోర్టల్‌లో సమస్యల నేపథ్యంలో ఐటీ శాఖ ఐటీ రిటర్న్స్ గడువును పలుమార్లు పొడిగించింది. ఇందులో భాగంగా జూలై 31 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ చివరి నాటికి పొడిగించింది. అయితే ఐటీ రిటర్న్స్‌కు సంబంధించి వృద్ధులకు సీబీడీటీ ఊరటను కల్పించింది. 75 సంవత్సరాలు లేదా అంతకుమించి ఉన్న వయో వృద్ధులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా నిర్మలమ్మ ఈ మాట ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను సీబీడీటీ విడుదల చేసింది. పెన్షన్ ఖాతా, వడ్డీ ఆదాయం వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఒకే బ్యాంక్ బ్రాంచీలోని వయోవృద్ధులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.

75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ పెన్షన్ ఆదాయం, ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వడ్డీ ఒకే బ్యాంకు నుండి పొందుతుంటే వారు 2021 ఏప్రిల్ 1వ తేదీ నుండి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించాల్సిన అవసరం లేదని నిర్మలమ్మ బడ్జెట్ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు సీబీడీటీ తాజాగా నిబంధనలతో సహా డిక్లరేషన్ ఫామ్స్‌ను నోటిఫై చేసింది. వీటిని సంబంధిత బ్యాంకుల్లో సమర్పిస్తే టీడీఎస్ ఆ బ్యాంకులు నిలిపివేస్తాయని వెల్లడించింది. అయితే పెన్షన్ డిపాజిట్ అయ్యే బ్యాంకులో వడ్డీ ఆదాయం కూడా ఉంటేనే ఐటీఆర్ ఫైలింగ్ నుండి మినహాయింపు లభిస్తుందని పేర్కొంది.

Forms for exemption from income tax returns for senior citizens notified

నిబంధనలు...
ఒకే బ్యాంకు బ్రాంచీలో పెన్షన్ ఖాతా, వడ్డీ ఆదాయం వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా ఉండాలి.

సీనియర్ సిటిజన్స్ ఫామ్ 12బీబీఏలో తమ పెన్షన్, వడ్డీ ఆదాయ వివరాలను తమకు ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచీకి సమర్పించాలి.
బ్యాంకు బ్రాంచీ సీనియర్ సిటిజన్స్ ఆదాయ స్లాబ్ ప్రకారం పన్ను మినహాయింపును ఇచ్చి ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తుంది.
సీనియర్ సిటిజన్స్ నుండి ఫామ్ 12బీబీఏలో ఈ వివరాలు స్వీకరించేందుకు ప్రతి బ్యాంకు బ్రాంచీలో ప్రత్యేక కౌంటర్స్ ఉంటాయి.
అవసరమైతే సీనియర్ సిటిజన్స్ ఫామ్ 12బీబీఏలను బ్యాంకు సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి స్వీకరించే సౌలభ్యం ఉంది.

English summary

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్: ఐటీఆర్ అవసరం లేదు.. వారికి ఐటీ శాఖ భారీ ఊరట | Forms for exemption from income tax returns for senior citizens notified

The Income Tax Department has notified declaration forms that senior citizens aged 75 years and above need to file with the banks to get exemption from filing income tax returns for financial year 2021-22.
Story first published: Monday, September 6, 2021, 9:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X