For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hospicash ప్రయోజనం, ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సురెన్స్

|

తమ కస్టమర్లకు గ్రూప్ బీమా పాలసీ గ్రూప్ సేఫ్‌గార్డ్‌ను అందించడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ప్రయివేటురంగ దిగ్గజం ఐసీఐసీఐ లాంబార్డ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్రూప్ సేఫ్‌గార్డ్ పాలసీతో కస్టమర్లు ఆసుపత్రిలో చేరితే రూ.500 నుండి పెద్ద మొత్తాలను హాస్పిక్యాష్‌గా పొందే వెసులుబాటు ఉంటుంది.

నిర్ణయించిన రోజువారీ మొత్తంతో కస్టమర్లకు వైద్య, అత్యవసర వ్యయాలకు చెల్లింపులు చేయవచ్చు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్, ఐసీఐసీఐ లాంబార్డ్ తెలిపాయి. ఈ బీమా పాలసీని అందుబాటు ధరలో తెచ్చినట్లు, ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరినా, ఆపరేషన్/ఇతర చికిత్సలకు ఉపయోగపడుతుంది.

Flipkart has partnered with ICICI Lombard to offer Group SafeGuard

స్టాండర్డ్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీతో పోలిస్తే గ్రూప్ సేఫ్‌గార్డ్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్నవారు హాస్పిటల్‍‌లో చేరినప్పుడు ప్రతిరోజు చెల్లింపులకు అవకాశం ఉంది. రోజువారీ నగదు ప్రయోజనాలు రూ.500 నుండి ప్రారంభమవుతుంది. కాగిత రహితంగా, సరసమైనదిగా, సౌకర్యవంతంగా ఉంటుంది.

English summary

Hospicash ప్రయోజనం, ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సురెన్స్ | Flipkart has partnered with ICICI Lombard to offer Group SafeGuard

E-commerce company Flipkart has partnered with ICICI Lombard to offer 'Group SafeGuard' insurance, a group insurance policy to its consumers.
Story first published: Thursday, February 18, 2021, 10:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X